సాధారణంగా ఓ బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి, అదీ ఓ టాప్ త్రీ ఇండియన్ టాప్ స్టార్ కొడుకు అయితే… తన లాంచింగ్ ఎలా ఉండాలి…? ఇతర భాషల్లో అయితే బీభత్సమైన యాక్షన్ సీన్లు, ఫైట్లు, స్టెప్పులు, ఫుల్లు కమర్షియల్ వాల్యూస్‌తో తెర మీద అరంగేట్రం ఉంటుంది…
కానీ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ సినిమా మహారాజ్ ఆ పోకడల్లో గాకుండా ఓ పాత రియల్ స్టోరీ ఆధారంగా తీయబడింది… పేరు మహారాజ్… అయితే దానిపై ఓ వివాాదం…అదే గనుక లేకపోతే ఈ సినిమా అలా వచ్చేది, ఇలా పోయేది… అంతే… అంత అనామకంగా తీశారు ఈ సినిమాను… అసలు అమీర్ ఖాన్ కొడుకు సినిమా లాంచింగ్ మరీ ఇలాగా అనిపించేట్టు..! పైగా థియేటర్లలో కాదు, ఓటీటీ విడుదల..!!
Ads
అందులో హిందువుల మతవిశ్వాసాలు, మనోభావాలు దెబ్బతీసే అంశాలున్నాయనీ, రిలీజుకు ముందే మాకు చూపించాలని కొన్ని హిందూ మత సంస్థలు డిమాండ్ చేశాయి, కోర్టుకెక్కాయి… నెట్‌ఫ్లిక్స్‌ను కూడా బెదిరించారు… గుజరాత్ కోర్టు కూడా సినిమా చూసి, ఇందులో మతవిశ్వాసాలు దెబ్బతినే అంశాలేమీ లేవని చెప్పి గోఎహెడ్ అని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది…
నిజానికి ఏముంది సినిమాలో..? ఏమీ లేదు… అప్పుడెప్పుడో 150 ఏళ్ల క్రితంనాటి కథ… ఒక అభ్యుదయ జర్నలిస్టు… తనకు ఓ ప్రేయసి… విలన్ ఓ ఫేక్ బాబా… తన వద్దకు వచ్చే ఈ జర్నలిస్టు ప్రేయసిని లోబరుచుకుంటాడు… ఆమె చెల్లెను సైతం … ఈ జర్నలిస్టు చెప్పినా ప్రేయసి వినిపించుకోదు… తరువాత మరణిస్తుంది…
సదరు ఫేక్ బాబు ఓ కామాంధుడు… వాడి ఆట కట్టించడానికి ఈ జర్నలిస్టు హీరో ఏం చేశాడనేది కథ… ఇలాంటివి బొచ్చెడు కథల్ని చూసింది ఇండియన్ సినిమా… ఆశ్రమాలు, మఠాలు, సన్యాసులు అనగానే ఓ నెగెటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసే ప్రయత్నాలు, కథలు… అంతకుమించి ఈ సినిమా కథలోనూ ఏమీ లేదు…
కథ ఏమైనా ఆసక్తికరంగా ప్రజెంట్ చేయబడిందా అంటే అదీ లేదు… సంగీతం సోసో, పెద్ద ట్విస్టులు ఆశించవద్దు… వారసుడి నటన కూడా ప్చ్, మరీ ఓనమాల దగ్గరే ఆగిపోయాడు… అర్జున్‌రెడ్డి సినిమా హీరోయిన్ ఇందులో తన ప్రేయసి పాత్ర పోషించింది… షాలినీ పాండే… ఆమె ఒక్కతీ పర్లేదు…
పత్రికల్లో స్టోరీలు రాయడం, బాబా పరువు నష్టం దావా వేయడం, సుప్రీంకోర్టు దాకా వెళ్లిన వ్యాజ్యం… అంతా ఓ బోరింగ్ కథనం… ఇది యశ్‌రాజ్ వాళ్ల సినిమా అంటే ఆశ్చర్యమే మరి… కాకపోతే అంతే…!!
Share this Article