లోకసభలో రెండు పక్షాల నుంచి నిరాశాపూర్వక ప్రవర్తనే కనిపించింది… ప్రొటెం స్పీకర్‌గా సురేష్‌ను నియమించాలని విపక్షం కోరింది… తను దళిత్, సీనియర్… కానీ మోడీ ప్రభుత్వం నో అనేసింది… ఇదేమిటయ్యా, అత్యంత సీనియర్‌ను కదా ప్రొటెం స్పీకర్‌గా నియమించాల్సింది అనడిగింది…
నో, నో, సురేష్ ఎక్కువసార్లు గెలిచాడు, కానీ మధ్యలోబ్రేక్ ఉంది, వరుసగా ఏడుసార్లు గెలిచిన భర్తృహరి మహతాబ్ ఉన్నాడు అని చెప్పి హడావుడిగా రాష్ట్రపతి దగ్గర ప్రమాణం చేయించి ప్రొటెం స్పీకర్ చేసేసింది… నిజానికి ఇక్కడ మోడీ ప్రభుత్వం కాస్త తెలివిడిగా సురేష్‌నే ప్రొటెం స్పీకర్‌గా ఎంచుకుంటే బాగుండేది…
ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు… స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనేసరికి రాజకీయాలు, రాగద్వేషాలు వస్తాయి, సహజం, తప్పదు… కానీ ప్రొటెం స్పీకర్ దగ్గర ఈ అహాలు దేనికి..? ప్రొటెం స్పీకర్ చేసేది కేవలం సభ్యులతో ప్రమాణాలు చేయించడం, స్పీకర్ ఎన్నిక నిర్వహించడం… అంతే కదా… రెగ్యులర్ పార్లమెంటరీ బిజినెస్‌తో తనకు సంబంధం ఉండదు కదా, మరి సురేష్‌ను ఎంచుకుంటే మోడీకి రాజకీయంగా నష్టమేముంది..?
Ads
సరే, అదయిపోయింది… అది మనసులో పెట్టుకున్న ఇండి కూటమి అదే సురేష్‌తో నామినేషన్ వేయించింది… వీలైనంతవరకూ స్పీకర్ పదవికి పోటీ లేకుండా ఎన్నిక లేదా ఎంపిక జరగడమే బెటర్… ప్రొటెం స్పీకర్ ఇష్యూ మనసులో పెట్టుకుని, ఓడిపోతామని తెలిసీ ఇండి కూటమి తనను పోటీకి నిలబెట్టింది… సరే, పోటీ స్పూర్తి కోణంలో వోకే, కానీ 50 ఏళ్ల తరువాత మళ్లీ ఎన్నిక… ఏ ఎన్నికలోనైనా వోకే కానీ స్పీకర్ వంటి కొన్ని పోస్టులకు సంబంధించి వీలైనంతవరకూ పోటీల దాకా పోకపోవడమే బెటర్…
అదేమంటే, డిప్యూటీ స్పీకర్ మాక్కావాలి, అది ఇవ్వలేమని ఎన్డీయే చెప్పింది, అందుకే పోటీకి పెట్టాం అంటుంది ఇండి కూటమి… పోటీకి పెట్టడం వల్ల సాధించింది ఏమిటి అనేది కదా ప్రశ్న… ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉంది… పోటీ మీ ఇష్టం అనేసింది… తీరా ఏమైంది..? మూజువాణి వోటుతో పాత స్పీకర్ బిర్లా ఎన్నికే కొత్త స్పీకర్‌గా జరిగిపోయింది… రేప్పొద్దున డిప్యూటీ స్పీకర్ పోస్టూ అంతే… (అదుగో, టీడీపీ సపోర్ట్ కోసం మోడీ పాట్లు, చక్రం తిప్పుతున్న చంద్రబాబు అని గతంలోలాగే ఫేక్ హైప్ వార్తలు సరేసరి)…
రాజకీయాల్లో పట్టూవిడుపులు, పరస్పర గౌరవ మర్యాదలు అవసరం… అవి లోపించినట్టు కనిపిస్తోంది… నాలుగు సీట్లు ఎక్కువ రాగానే ఇక మోడీ భరతం పడతాం అన్నట్టుగా ఇండి కూటమి అంగీలు చింపుకోవడం వేస్ట్… చూస్తూ ఉండండి, టీడీపీ, జేడీయూ లేనిదే ఎన్డీయే ప్రభుత్వం లేదు అన్నట్టుగా ఇండి కూటమి త్వరలో ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుంది అన్నట్టుగా షో చేస్తోంది…
కానీ ఇక్కడే బీజేపీని తక్కువ అంచనా వేస్తోంది ఇండి కూటమి… రెండు సీట్ల దగ్గర మొదలైన ప్రస్థానం బీజేపీది… రెండు టరమ్స్ కంఫర్టబుల్ మెజారిటీతో ప్రభుత్వం నడిపించింది… రేప్పొద్దున విధి లేదు అనుకుంటే మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్లడానికీ బీజేపీ రెడీ అంటుంది… బీజేపీది సుదీర్ఘకాలిక ప్రణాళిక… ఇండి కూటమి కప్పలతక్కెడ… ఇదంతా వోకే, ప్రొటెం స్పీకర్ విషయంలో బీజేపీది తప్పా కాదా అంటే… తప్పు కాదు, అవసరమైనంత ఉన్నత సంస్కారం, గౌరవాన్ని ప్రదర్శించలేకపోయింది… అంతే…!!
రాహుల్, మోడీ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని, స్పీకర్‌ను కుర్చీ వరకు తీసుకోవడం వరకూ హుందాగానే వ్యవహరించారు… అది మరీ ఏపీ అసెంబ్లీ కాదు కదా..!!
Share this Article