ఇండియన్ ఐడల్ తెలుగు తాజా ప్రోమో చూశాక ఆశ్చర్యంతోపాటు కొంత ఆనందం కూడా… హిందీ ఇండియన్ ఐడల్ షోలో బోలెడు వాయిద్యాలు వాడుతారు షూటింగు సమయంలో… చెవులకింపుగా… పాడేవాళ్లకు కూడా ఓ జోష్… ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ షో హఠాత్తుగా చాలామంది వాయిద్యకారులు కనిపించారు… పాట క్వాలిటీ పెరిగినట్టనిపించింది…
నిజానికి సినిమా సాంగ్స్‌కు సంబంధించి రకరకాల యాప్స్ వచ్చాయి… గాయకులు పాడుతున్నప్పుడు, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న లోపాలు తలెత్తితే అవే సరిచేస్తాయి… కొన్ని యాప్స్ కంపోజ్ చేస్తాయి… కంప్యూటర్లలో మిక్సింగులు… ఎవరో ట్రాక్ పాడతారు… దాన్ని విని ఇంకెవరో పాడతారు… అన్నీ కంప్యూటర్లలో ఒరిజినల్ కంపోజింగుకు తగినట్టు మిక్స్ చేసి వదులుతుంటారు… (రాను రాను పాటలు కూడా కంప్యూటర్లే పాడతాయి అనే జోకూ ఉంది…)
ఐతే కచేరీలకు వెళ్లినప్పుడు ఎలా అంటారా..? ఫంక్షన్లు, కాన్సర్టుల్లో స్థాయిని బట్టి ఏర్పాట్లు… సపోజ్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కాన్సర్ట్స్ ఏర్పాటు చేస్తే వాయిద్యాకారులు వెంట వస్తారు… వేదికపైనే లైవ్‌లో పర్‌ఫామ్ చేస్తారు… చిన్న చిన్న ఫంక్షన్లయితే ట్రాకులు యూజ్ చేసుకుని పాడేవారు పాడుతూ ఉంటారు… ఓ మోస్తరు మ్యూజికల్ ట్రూప్ అయితే కీబోర్డు ప్లేయర్, డ్రమ్మర్ (వీటిల్లో కూడా రకరకాలు వచ్చాయి ఇప్పుడు…) తో నడిపించేస్తుంటారు…
Ads
పాటను బట్టి రకరకాల వాయిద్యాలను లైవ్‌లో వింటుంటే వచ్చే ఆనందం వేరు… సాధారణంగా టీవీ మ్యూజిక్ కంపిటీషన్ షోలలో మ్యూజిషియన్స్‌ను చూపించరు… చాలాసార్లు ట్రాకులతో పని నడిపించేస్తుంటారు… ఈటీవీ పాడతా తీయగా నయం… పాటను బట్టి కొన్ని వాయిద్యాలను ఎలా వాయిస్తున్నారో చూపిస్తారు… పాడటమే కాదు కదా, సంగీత సహకారం కూడా ముఖ్యమే కదా… ఆర్కెస్ట్రా ప్రభావం, ప్రాధాన్యం కూడా కనిపించాలి ప్రేక్షకులకు, శ్రోతలకు…
ఇండియన్ ఐడల్ తెలుగుకు నిజంగానే బాగా ఖర్చు పెడుతున్నారు… అనేక దేశాలు, వేలాది మందితో నిర్వహించే ఆడిషన్స్ ఒక ప్రయాస… అందులో 12 మందిని ఎంపిక చేయడం ఓ టాస్కే… ఫస్ట్, సెకండ్ సీజన్లకు దీటుగా ఈ థర్డ్ సీజన్‌కు కంటెస్టెంట్ల ఎంపిక జరిగినట్టే కనిపిస్తోంది వాళ్ల ప్రాథమిక పర్‌ఫామెన్స్ చూస్తుంటే… పోటీ కూడా ఎక్కువే ఉన్నట్టుంది…
ఈసారి ప్రోమోలో కనిపించిన వాయిద్యాలు ఎందుకు విశేషంగా అనిపించాయంటే… ఆల్మోస్ట్ హిందీ ఇండియన్ ఐడల్ షో రేంజుకు దీన్ని తీసుకుపోతున్నారు… ఇంత ఖర్చుకు తగిన యాడ్స్ వస్తాయా అనేది వేరే ప్రశ్న… యాడ్స్ సంఖ్య కూడా బాగా పెంచారు… కేవలం ఆహా ఓటీటీలోనే గాకుండా యూట్యూబులో పెట్టేస్తున్నారు కదా, అది కూడా ప్రధాన ఆదాయ వనరే ఇప్పుడు… (ఈటీవీ అయితే పూర్తిగా ఆ ఆదాయంపైనే కాన్సంట్రేట్ చేస్తోంది, తమకు ఈటీవీ విన్ అనే యాప్ ఉన్నా సరే…)
శివ, పవన్, కామాక్షి తదితరులతో చిన్నగా ఉండే ఆర్కెస్ట్రా ఇన్నాళ్లు ఆల్మోస్ట్ ఓ ఫుల్ ప్లెడ్జ్‌డ్ ఆర్కెస్ట్రా స్థాయిలో వర్క్ చూపించింది… ఇప్పుడు వాళ్లకు తోడుగా చాలామంది వాయిద్యకారులు జతయ్యారు… గుడ్… చెవుల తుప్పు వదిలించండిక..!!
Share this Article