పతంజలి గోపాత్రుడు …. చాలా ఏళ్ళ క్రితం పోస్ట్ ఆఫీస్ లో మిత్రుడి కోసం ఎదురు చూస్తూ ఇండియా టుడే సాహిత్య సంచికలో పతంజలి గోపాత్రుడు చదువుతూ గట్టిగా నవ్వకుండా ఉండలేక పోయాను .
భూమి బల్లపరుపుగా ఉంది, నా నమ్మకం నా ఇష్టం అని గోపాత్రుడు వాదిస్తాడు … గుండ్రంగా ఉంది అని ఇతరుల వాదన .. వివాదం కోర్టుకు వెళుతుంది .. గోపాత్రుడిపై గ్రామ పెద్ద విజయం సాధిస్తాడు .. విజయం సాధించిన గ్రామపెద్ద వద్దకు లోకల్ విలేకరి వెళ్లి … మీరు గెలిచారు కదా ? మీ ఇంటర్వ్యూ ఫోటోతో ఐతే ఇంత . ఫోటో లేకుండా ఐతే ఇంత అని రేటు చెబుతాడు .
గ్రామ పెద్ద నువ్వు నా ఇంటర్వ్యూ కోసం వచ్చావు కాబట్టి నువ్వే నాకు ఇవ్వాలి అని తెలివిగా అంటాడు .. విలేకరి నవ్వి నువ్వు వార్త కోసం నా దగ్గరకు వచ్చినా , వార్త కోసం నేను నీ వద్దకు వచ్చినా డబ్బు నువ్వే నాకు ఇవ్వాలి … ఎవరు ఎవరి వద్దకు వెళ్లినా డబ్బు నా వద్దకే అందుకే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను అని బదులిస్తాడు … రాసింది జర్నలిస్ట్ చదువుతున్నది జర్నలిస్టే ఐనా అంత సహజంగా అద్భుతంగా రాసిన వ్యంగ్యానికి నవ్వకుండా ఉండలేం ..
Ads
( పతంజలి అద్భుతమైన వ్యంగ్యం రాశారు, సొంత ఇల్లు కూడా లేదు, పత్రిక పెట్టి చేతులు కాల్చుకున్నాడు కాబట్టి ‘అక్షర యోధుడు’ అనలేం . విశాఖ వెళ్లి పతంజలి పేరుతో పత్రిక పెట్టి ఉన్నది పోగొట్టుకున్నారు . అద్భుతంగా రాయడం వేరు . మీడియా బిజినెస్ వేరు . జర్నలిస్ట్ ల తెలివి తేటలు , రాసే నైపుణ్యం యాజమాన్యానికి ఉపయోగపడుతుంది కానీ సొంతంగా పత్రిక పెడితే ఎంత గొప్ప రాతగాడు ఐనా దెబ్బతింటారు అని పతంజలి ఉదంతం చెబుతుంది )
ఈనాడులో మొదటి పేజీ పూర్తి పేజీ ప్రకటన చూడగానే పతంజలి రాసిన ఈ సీన్ గుర్తుకు వచ్చింది హఠాత్తుగా …
ఆంధ్ర తెలంగాణలోని అన్ని ఎడిషన్లలో మొదటి పేజీ ప్రకటన వ్యయం ఎంతో నాకు తెలియదు కానీ … 1982 లో టీడీపీ ఆవిర్భావం నుంచి నిన్న మొన్నటి వరకు పార్టీని ఒంటి చేతితో మోసిన వారికి ప్రభుత్వం తరపునే కాకుండా పార్టీ తరుపున కూడా ఇదే స్థాయి ప్రకటన ఇవ్వడం కనీస ధర్మం … తెలంగాణలో అధికారపక్షం ఇవ్వక పోయినా ఆంధ్రాలో ఇవ్వడం ధర్మమే …
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు కూడా దక్కని అరుదైన గౌరవం రామోజీకి దక్కింది . ప్రతి ఏటా ఎన్టీఆర్ సంతానం మళ్ళీ ఎప్పుడు పుడతావు నాన్నా అని ఓ క్వార్టర్ పేజీ ప్రకటన ఇచ్చేవారు … ఇలా రెండు రాష్ట్రాల్లో అన్ని ఎడిషన్లలో ప్రభుత్వం తరపున ఫుల్ పేజీ ప్రకటన గౌరవం ఒక్క రామోజీరావుకే దక్కింది . ఆదాయం కూడా ఈనాడుకు దక్కింది . (అఫ్‌కోర్స్, ఈనాడు కవల పత్రిక ఆంధ్రజ్యోతికి కూడా కొంత ఆదాయం ఇదే యాడ్ ద్వారా వచ్చింది…)
తన సంతాప సభ కూడా తన సంస్థకు కోట్ల రూపాయల ప్రకటనల ఆదాయం తెచ్చి పెట్టడం అంటే ఇదో అరుదైన , అపురూపమైన సంఘటన … బహుశా ఒక్క రామోజీ రావు విషయంలోనే ఇది సాధ్యం అయింది …… (by… బుద్ధా మురళి)
ఎడిటర్ ఎంఎన్ఆర్ సంపాదకీయ వ్యాసం రాశాడు… సహజమే, సందర్భం ఇదే కాబట్టి బాస్‌ను అలా స్మరించుకున్నాడు… తప్పుపట్టేదేమీ లేదు… కానీ ఎప్పుడో ఈనాడు వదిలివెళ్లిన (లేదా వదిలేయబడిన..?) శ్రీధర్ బొమ్మ కూడా కనిపించింది అందులోనే ఇన్‌సర్ట్‌గా… కానీ రామోజీరావు పోలికలు కూడా కనిపించలేదు ఆయన మొహంలో… బట్, వోకే… ముచ్చట
Share this Article