Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గాలి ఈలలు వేసేననీ… సైగ చేసేననీ… అది ఈరోజే తెలిసింది…

June 30, 2024 by M S R

చూసారా ఈ సినిమా ?! 1973 లో వచ్చిన ఈ శ్రీవారు మావారు సినిమాకు నిర్మాత – దర్శకుడు బి యస్ నారాయణ . అనగనగా ఓ కోటీశ్వరుడి కుమారుడు హీరో కృష్ణ . మేనత్త అంజలీదేవి అతి క్రమశిక్షణతో పెంచుతుంది . విసుగెత్తిన హీరో లోకం చూడటానికి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు , హీరోయిన్ వాణిశ్రీ కలుస్తుంది, ఇద్దరూ ప్రేమించుకుంటారు .

హీరో తండ్రిని మేనత్త మొగుడు విలన్ నాగభూషణం చంపుతాడు . ఆ విలన్ కు మరో భార్య కూడా ఉంటుంది . ఆ భార్య కూతురే హీరోయిన్ వాణిశ్రీ అన్నమాట . మెయిన్ విలన్ వద్ద ఓ జూనియర్ విలన్ కృష్ణంరాజు . మెయిన్ విలన్ ఓ జూనియర్ విలన్ని చంపేస్తాడు . పోలీసులు వచ్చి మెయిన్ విలన్ని బంధించి తీసుకుని వెళతారు . ఇదీ కధ టూకీగా . ..

ఈ సినిమాలో విశేషం ఏమిటంటే పద్మనాభం , గీతాంజలి అన్నాచెల్లెళ్ళుగా నటించటం . బహుశా ఈ ఒక్క సినిమాయే అయి ఉంటుంది . మరో విశేషం జ్యోతిలక్ష్మి వేసే డాన్సుని రాజసులోచన ఇంకా వేయటం . ..

Ads

జి కె వెంకటేష్ సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . పూలు గుసగుసలాడేనని జత కూడేనని (సినారె రచన) , పోలేవులే నీవు పోలేవులే పాటలు హిట్టయ్యాయి కూడా . వాణిశ్రీ గ్రూప్ డాన్స్ బాగుంటుంది . ఈ డాన్సులో పాట అల్లరి చూపుల వాడే కూడా బాగుంటుంది .

రాజసులోచన జ్యోతిలక్ష్మి డాన్స్ పాట ఈవేళలో నా మనసు నీదే వయసు నీదే , గీతాంజలి బావ హీరో కృష్ణ వెంటపడే పాట చెయ్యి వేస్తే చాలు చిర్రుమంటాడప్పా , మరో వేదాంత గీతం ఇంతేలే జీవితమింతేలే ఉన్నాయి . శ్రావ్యంగానే ఉంటాయి .

కృష్ణ , కృష్ణంరాజు , పద్మనాభం , నాగభూషణం , రామ్మోహన్ , అంజలీదేవి , యస్ వరలక్ష్మి , గీతాంజలి , సంధ్యారాణి , రాజసులోచన ప్రభృతులు నటించారు .

కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో చూసా . వెంకటేశ్వరా లేక నాగూర్వలియా గుర్తు లేదు . మా నరసరావుపేట ఫ్రెండ్స్ చెప్పాలి . 1973 లో ఏవరేజ్ గా ఆడిన కృష్ణ సినిమా ఇది .A neet , feel good movie . చూడబులే . పాటల వీడియోలు ఉన్నాయి . సంగీత ప్రియులు తప్పక వినండి #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………. By    డోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యథా కేసీయార్- తథా హరీష్ రావు… పక్కా యాంటీ దళిత్ పాలసీ…
  • ప్యారడైజ్‌ మూవీలో సవారీ కులదేవత, ఆ ఉగ్రశక్తి ఎవరో తెలుసా..?
  • మహానటి బోల్డ్ కేరక్టర్ – అసలు డోరోతి కంట్రవర్సీ ఏమిటంటే..?
  • సర్కారూ బీ అలర్ట్ ! సన్నబియ్యం ధర వందకు చేరే సూచనలు !!
  • తిను, తినను… ఇదేం తెలుగు భాషరా మీ మొహాలు మండా…
  • ఆటే సవాల్ అన్నాడు నాగార్జున – అంతే, ఆట చూడటమూ సవాలే !!
  • ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే… కేసీయార్ మరో బిగ్ బ్లండర్…
  • మన జేమ్స్ బాండ్… ‘దురంధర్‌’ల నిర్మాత… తెరపైకి ఆ మహా గూఢచారి!
  • రేచర్ల రుద్రుడి విగ్రహం ! గుడ్ డెసిషన్… ఐతే ఇంతకీ తనెవరంటే ?
  • ఓహో… తెలంగాణ నటులు తెలుగు ఇండస్ట్రీకి పనికిరాని మొహాలా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions