Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జంపింగుల్లో నైతికత కాదు, చట్టబద్ధత చూడాలట… ఆధునిక మత్స్య నీతి..!!

July 9, 2024 by M S R

మాయాబజార్ సినిమాలో… ద్వారకలో అడుగుపెట్టిన ఘటోత్కచుడికి శ్రీకృష్ణుడు ఓ ముసలివాడి రూపంలో కనిపించి ఓ పాట పాడతాడు… ‘‘చిన చేపను పెద చేప… చిన మాయను పెను మాయ… అది స్వాహా… ఇది స్వాహా.. అది స్వాహా… ఇది స్వాహా.. చిరంజీవ చిరంజీవ సుఖీభవ!’’

సరే, విషయానికొద్దాం… ఢిల్లీలో శ్రీమాన్ కేటీయార్ గారేమన్నారు..? మేం చేసుకున్నది విలీనం… ఫిరాయింపులు కావు… అవి రాజ్యాంగబద్ధం, అదీ చూడాల్సింది, అదే చట్టబద్ధత అన్నాడు… అంటే తమ హయాంలో సాగిన ఫిరాయింపులు, సారీ, విలీనాల నైతికత గురించి అడగొద్దు, జస్ట్ థింక్ అబౌట్ లీగాలిటీ అంటున్నాడన్నమాట…

ఫాఫం, కేసీయార్ కనీసం రాజకీయ శక్తుల పునరేకీకరణ అనబడే ఓ భ్రమపదార్ధం వంటి సూత్రీకరణ చేసుకున్నాడు… కేటీయార్ 80 వేల పుస్తకాలు చదవలేదు కదా డాడీలాగా… సమయానికి పడికట్టు పదాలు దొరకలేదు… తడబడి ఏదేదో చెప్పుకొచ్చాడు… జనం ఏమనుకుంటారు అనేది అప్రస్తుతం, అది తనకు అనవసరం… తాము గతంలో చేసింది సంసారం, రేవంత్ రెడ్డి చేసేది వ్యభిచారం…

Ads

ఈ నేపథ్యంలో మిత్రుడు బెల్లంకొండ ప్రసేన్ ఏమంటాడంటే… ‘‘విలీనం, ఫిరాయింపు వేర్వేరు, ది గ్రేట్ ఎంపరర్ ఎడ్వర్డ్ కేటీఆర్ ఈ రోజు డిల్లీలో ప్రెస్ తో …

‘మత్స్య న్యాయ’ అని ఒక పురాతన భారతీయ తత్వ శాస్త్రం ఒకప్పుడు అమలులో ఉండేది… ఇది చేపల చట్టం అనే సూత్రం ఆధారిత ప్రకృతి నియమం … అంటే, పెద్ద చేప చిన్న చేపను మింగడం ప్రాథమిక సూత్రం… లా ఆఫ్ జంగిల్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు.. అంటే జంతు నీతి …

మనుష్య నీతి కూడా ఉంటది, అదేంటి అంటే బలహీనులను కాల్చుకుని తినడం, బానిసలను చేసుకోవడం, తన్నడం , చంపడం అదనపు సౌకర్యం…

సాధారణ మనుషులు పవిత్రులు అయ్యాక చట్ట సభలకు వెళ్తారు… అలగా జనాలను పురుగుల కన్నా హీనంగా చూస్తూ మన నెత్తిన ఎక్కి కూర్చుంటారు. వాళ్లు చెప్పిందే న్యాయం, ఆచరించిందే చట్టం…

గెలిచిన వాడు బలహీనుడు అయితే బలవంతుని సంకన చేరతాడు. దీన్నే ఆధునిక రాజ్య భాషలో ఫిరాయింపు అంటారు. ఒక జంతువుని చంపకుండా ఒక్కొక్క అవయవాన్ని కోసుకుని తినడం అన్నమాట, దాన్ని జంతు ఫిరాయింపు న్యాయం అంటారు.,

ఇలా అవయవాలను ఒక్కొక్కటీ కోసుకోకుండా ఒకేసారి మంటల్లో కాల్చి తినేయడాన్ని విలీనం అంటారు… ఇప్పుడు గ్రేట్ KTR ఏమంటాడూ అంటే చంపి తినడం న్యాయం, ఒక్కొక్క అవయవం నరుక్కోవడం అటవికం అంటాడు…

మీకు చేతనైతే గతంలో మేము కాంగ్రెస్ ని చేసినట్టే.,.  ఖీమా కొట్టి తినండి అంటున్నాడు… ఇలా చావకుండా బ్రతకకుండా BRS ను బరిబాత చేయొద్దు అంటున్నాడు…

వాళ్లు అలా నరికి, తుంచి, కాల్చి, రోస్ట్ చేసి చేసేది ఓటర్ల నమ్మకాన్ని అనేది జనాలకు అర్థం అయ్యే రోజు కోసం చూడాలి… సో, విలీనం నాగరికం, ఫిరాయింపు అటవికం అంటాడు… ఇదండీ నవ్య రాజకీయ చేప నీతి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions