విచారణ జరుగుతూ ఉండగానే జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది… వెంటనే ఆయన విద్యుత్తు విచారణ కమిషన్ నుంచి వైదొలిగారు… కానీ ఇది బీఆర్ఎస్‌కు, కేసీయార్‌కు రిలీఫ్ ఏమీ కాదు… ఒకరకంగా సుప్రీంకోర్టు మరింత ఫిక్స్ చేసినట్టే తనను..!
కాకపోతే మరో జడ్జిని నియమించండి, జుడిషియల్ కమిషన్ అనకుండా ఎంక్వయిరీ కమిషన్ అనాలని సుప్రీం కోర్టు సూచించింది… వాటికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది… కాస్త టైమ్ తీసుకుని కొత్త జడ్జి పేరు చెబుతామని పేర్కొంది… దీంతో కమిషన్ ఏర్పాటు, దాని విచారణార్హతలకు సంబంధించి కేసీయార్ వేసిన పిటిషన్ వీగిపోయింది…
గతంలో కేసీయార్ ఒక లేఖ రాశాడు కదా జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌కు… మీరే స్వచ్చందంగా వైదొలగాలని అందులో కోరాడు కదా… ఇప్పుడు జరిగిందీ అదే… ఆయనే వైదొలిగారు… కేసీయార్ అందులో ప్రస్తావించి ఆక్షేపించిన ప్రెస్ మీట్ అంశాన్నే సుప్రీం కోర్టు కూడా ప్రస్తావించి, వ్యతిరేకత వ్యక్తం చేసింది… కానీ కేసీయార్ సుప్రీంలో వేసిన పిటిషన్ ద్వారా కోరుకున్నది మొత్తానికే తన పాత నిర్ణయాల మీద కమిషన్ వేయడమే కరెక్టు కాదు అని…
Ads
జడ్జిని మార్చండి అని పేర్కొన్నదే తప్ప విచారణ కమిషన్ అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పలేదు… అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటుపై తీసుకున్న నిర్ణయానికి సుప్రీం ఆమోదం లభించినట్టే అయిందిప్పుడు… ఆయన బదులు మరో జడ్జిని నియమిస్తారు… అంతే తేడా… కానీ ఒకసారి రెగ్యులేటరీ కమిషన్లు ఆమోదించిన అంశాలపై విచారణ జరగాల్సిన అవసరం లేదు అనే కేసీయార్ వాదన వీగిపోయినట్టే…
ట్రిబ్యునల్స్ ఉండగా ఒక విచారణ కమిషన్ రెగ్యులేటరీ కమిషన్ల ఆమోదించిన నిర్ణయాలను ఎలా విచారిస్తుంది అనే బేసిక్ లా పాయింట్ ఓడిపోయినట్టయింది… కేసీయార్ రాసిన లేఖలో ఉన్న అంశాలనే తన తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వినిపించారు తన వాదనలో భాగంగా…
సుప్రీంకోర్టు చేసిన ఓ కామెంట్ ఇంట్రస్టింగు… ‘‘న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా, నిష్పక్షపాతంగా కనపడాలి కూడా’’… జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు తను నిష్పాక్షికంగా ఉన్నట్టుగా లేవనేది సుప్రీంకోర్టు అభిప్రాయం… ఇక ఇప్పుడు కొత్త జడ్జి వచ్చాక సాగే విచారణ మరింత కీలకంగా, ఇంట్రస్టింగుగా సాగబోతోంది అన్నమాట…!!
Share this Article