చాలామంది కోరస్‌ను లైట్ తీసుకుంటారు గానీ… ఒక పాటకు ప్రాణం ఆర్కెస్ట్రా ఎంతో, కోరస్ కూడా అంతే… తెలుగు ఇండియన్ ఐడల్ తాజా ఎపిసోడ్ చూస్తుంటే… కోరస్ ఇంపార్టెన్స్ తెలుస్తోంది… కోరస్ పాడటానికీ ఓ అర్హత ఉండాలని తెలుస్తోంది… అదెలా ఉండాలో ఓ చిన్న పిల్ల శ్రీకీర్తి పాడి చూపించింది…
నిజం… శ్రీకీర్తి… వయసు పదహారేళ్లు… చిన్న పిల్ల… మొదట తను వచ్చి ఏదో పాట పాడింది… అందరూ చప్పట్లు కొట్టారు, మెచ్చుకున్నారు, నిజంగా ఆమె జీనియస్ సింగింగ్… సూక్ష్మ రంధ్రాన్వేషి గీతామాధురి కూడా తన పాటలో చిన్న లోపం పట్టలేకపోయింది, పైగా తను ఆ పాట ఒరిజినల్ సింగర్ కూడా…
ఏమో, మంచి కోరిక సాకారం అవుగాక… మొదటి సీజన్‌లో వాగ్దేవి… రెండో సీజన్‌లో సౌజన్య… ఏమో, ఈ మూడో సీజన్‌లో శ్రీకీర్తి అవుతుందేమో విజేత… కానీ కాకపోనీ, ఆ మెరిట్ ప్రదర్శిస్తోంది అమ్మాయి… ఆమె ఇన్‌స్టా చెక్ చేస్తే స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ టాప్ 6 అని కనిపించింది… పలికెద భాగవతము షో సెకండ్ రన్నరప్…
Ads
తన పాట తరువాత మరో కంటెస్టెంట్ సాయివల్లభ రోజా సినిమాలోని ఓ పాట పాడుతుంటే శ్రీకీర్తి కోరస్ పాడింది.., ఆలాపన అల్టిమేట్… పాపం శమించుగాక, ఒరిజినల్ పాటగాడికన్నా ఈ కోరస్‌గత్తె సూపర్‌గా ఆ పాటను ఎలివేట్ చేసింది… రజినీ శ్రీ పూర్ణిమ, కీర్తన, నజీరుద్దీన్ పాటలకు కూడా కోరస్ పాడింది ఆమె… ఆహా… ఎంత అందమైన కాన్సర్ట్ వినిపిస్తున్నారు బ్రదర్… సూపర్…
ఫస్ట్, సెకండ్ సీజన్లలో కోరస్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నిర్వాహకులు… మైకులు నాసిరకం… కానీ ఈసారి అసలు పాటపాడేవాళ్ల మైకుల్లాగే కోరస్ మైకుల నాణ్యత కూడా చూసుకున్నారు… మొన్నామధ్య కుర్చీ మడతబెట్టి సాంగ్ టిపికల్ కోరస్ కూడా భలేపాడారు… వావ్… ఈసారి దాదాపు ప్రతి పాట కోరస్ ప్రధానమే…
ఈసారి కార్తీక్ షోకు రాలేదు, తన బదులు విజయ్ ఏసుదాసు గెస్ట్ జడ్జిగా వచ్చాడని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా… ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అనిరుధ్‌తో కలిసి ఆయన ఓ పాట పాడాడు… ఎవరే ఎవరే అంటూ… సేమ్, జేసుదాస్ టోన్… బహుశా హెరిడిటరీ వాయిస్ … బాగుంది మాస్టారూ… కాస్త లౌడ్ అనిపించినా సరే…
నజీరుద్దీన్ పాట ఎత్తుకోలేక, గొంతు పట్టేసినప్పుడు మొత్తం టీం సపోర్ట్ గా నిలిచిన తీరు కూడా బాగుంది…
కడప జిల్లా ఫోక్ సింగర్ లక్ష్మి పాడిన పాట కూడా బాగుంది… తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న పవన్ కల్యాణ్ సినిమా ఓజీలో ఒక పాట పాడించడానికి వెంటనే అప్రూవల్ ఇచ్చి, అడ్వాన్స్ అక్కడే ఇవ్వడం ఈ ఎపిసోడ్ కొసమెరుపు…! ఐడల్ సెల్యూట్ పేరిట ఆమెను, ఆమె టీంను సన్మానించడం కూడా బాగుంది…!
Share this Article