నిజానికి రజినీ శ్రీ పూర్ణిమ బాగానే పాడింది… తన గొంతుకు సూటయ్యే పాటల్నే ఎంచుకుని మంచి సాధన చేసి మరీ పాడుతోంది… ఈసారి కూడా అంతే… కాకపోతే గతవారం పర్‌ఫామెన్స్‌కు శ్రోతలు వేసిన వోట్లు ఆమెను ఎలిమినేట్ చేసినట్టున్నాయి… ఏమో, థమన్ ఏది చెబితే అది, ఎవరి పేరు మీద ఇంటూ మార్క్ వేస్తే వాళ్లు ఔట్… ముందే అనుకుంటాడేమో ఏ వారం ఎవరిని పంపించాలో…
పైగా చివరలో అంటాడు, నీ వాయిస్ కల్చర్‌కు తగిన పాట దొరికినప్పుడు, పిలిచి నేనే నీకు చాన్స్ ఇస్తాను అని..! ఏదో ఓ కంటితుడుపు..!! శ్రీ ధృతి, స్కంధ లక్కీలీ ఎస్కేప్‌డ్… నిజానికి వాళ్లూ బాగానే పాడారు… కానీ క్లాసికల్ మీద కొంత టచ్ ఉన్నవాళ్లకే ఎక్కువ మార్కులు వేస్తున్నట్టున్నారు… ఫస్ట్ ఎలిమనేషన్ కుశాల్ శర్మ అన్ ట్రెయిన్డ్, కానీ పాడుతుంటే తేడా తెలియదు… ఐనా పంపించేశారు… తరువాత హరిప్రియ… ఇప్పుడు రజినీ శ్రీ పూర్ణిమ…
Ads
ఈసారి అనిరుధ్ సుస్వరం పాట బాగనిపించలేదు… తను లీస్ట్ పర్‌ఫార్మర్స్‌లో ఉంటాడని అనిపించింది ఓ దశలో… తన గొంతు చికుబుకు రైలే పాటకు సూట్ కాలేదు అసలు… థమన్ జడ్జిమెంట్‌లాగే తన పాట కూడా వెరీ మచ్ కన్‌ఫ్యూజింగ్… ఇప్పటి కంటెస్టెంట్లలో మెజారిటీ గతంలో పాడుతా తీయగా, జీసరిగమప, స్టార్ మా సూపర్ సింగర్ వంటి షోలలో పాడి, ఈ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో తెలిసినవాళ్లే… అందుకే ఎలిమినేషన్ సందర్భాల్లో కూడా పెద్ద ఫీల్ కావడం లేదు, ఇదంతా సహజమే అన్నట్టుగా…!
ఫాఫం, శ్రీరామచంద్ర ఎలిమినేషన్ సమయంలో ఏదో సస్పెన్స్ బిల్డప్ చేయబోతున్నా సరే, చాలా కృతకంగా ఉంటోంది… సరే, ఈసారి శివమణి ఎపిసోడ్ పార్ట-2 లో థమన్, శివమణి కలిసి జుగల్‌బందీ తరహాలో డ్రమ్స్‌తో కాసేపు ఆడుకున్నారు, బాగుంది… పాపం శమించుగాక, ఎందుకోగానీ శివమణికన్నా ఆ ఆర్కెస్ట్రాలోని పవన్ కొంత బెటరేమో అనిపించింది… వాయిద్యాలు వేరు కావచ్చుగాక… వినిపించే బీట్‌ను బట్టి అలా…
చిరాకు పుట్టించేది ఏమిటంటే..? ఎక్కువగా డబ్బింగ్ పాటల్ని ఎంచుకోవడం… ఆ సాహిత్యం వినబుద్ధి కాదు, తెలుగు పదాల్ని అక్కడక్కడా ట్యూన్లలో ఇరికించడం తప్ప స్ట్రెయిట్ తెలుగు పాటలోని సొగసు మనకు డబ్బింగ్ పాటల్లో ఏం దొరుకుతుంది..? పైగా తెలుగు పదాల ఉచ్ఛారణలో స్పష్టత కూడా గాయకులకు ఓ పరీక్షాంశమే… శృతులు, సంగతులు, పిచ్చింగ్ ఎట్సెట్రా సాంకేతికాంశాలకన్నా… పాట భావాన్ని బట్టి ఉద్వేగ ప్రదర్శన కూడా ముఖ్యం… ఏమో, అది అస్సలు పట్టించుకుంటున్నట్టు లేరు ఈసారి… ఖర్చు, హంగామా, కామెడీ ఎక్కువపోయి అసలు పాటపరీక్ష పక్కదోవ పడుతున్నట్టుంది రానురాను..!!
కంటెస్టెంట్లు కేవలం పాటను సాధన చేసి, ప్రజెంట్ చేయడంతోనే సరిపోదు… బిగ్‌బాస్ వోటింగును మేనేజ్ చేసుకోవడానికి హౌజ్‌మేట్స్ బయట ఆర్మీలు, సోషల్ మీడియా టీమ్స్ ఏర్పాటు చేసుకున్నట్టే… రాను రాను ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షో కంటెస్టెంట్లు కూడా వోటింగు ఏర్పాట్లు చేసుకోవాలి… కాస్త ఖర్చయినా సరే… అలా చేసుకోగలిగితే ఇక్కడ కూడా పల్లవి ప్రశాంతులే గెలుస్తారు..!!
Share this Article