ఇజ్రాయెల్ మీద హుతీల డ్రోన్ ఎటాక్! సమద్ -3 (Samad -3) ఇది ఇరాన్ డ్రోన్! సమద్ -3 డ్రోన్ రేంజ్ 800 km కానీ ఇరాన్ దీనికి మార్పులు చేసి లాంగ్ రేంజ్ డ్రోన్ గా అభివృద్ధి చేసింది! మోడిఫై చేసిన సమద్ 3 డ్రోన్ ను హుతీ లకి సరఫరా చేసింది!
హుతీలు నేరుగా సమద్ 3 డ్రోన్ ను ఇజ్రాయెల్ మీద ప్రయోగించారు! సమాద్ 3 డ్రోన్ నేరుగా టెల్ అవీవ్ లోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ మీద పడి పేలిపోయింది ఫలితంగా ఒక ఇజ్రాయేల్ పౌరుడు మృతి చెందాడు!
*******
యెమెన్ నుండి డ్రోన్ ఇజ్రాయెల్ వరకూ ఎలా వెళ్లగలిగింది? ఎర్రసముద్రం ఒడ్డున ఉన్న యెమెన్ మధ్యధరా సముద్రం వరకూ వెళ్లి ఇజ్రాయేల్ మీద దాడి చేయగలిగింది! ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ IAF దీని మీద విచారణ చేసి వివరాలు వెల్లడించింది!
Ads
హుతీలు చాలా పకడ్బందీగా పథకం రచించారు ఇలా.. పశ్చిమ యెమెన్ నుండి డ్రోన్ ను ఎర్రసముద్రం మీదుగా వెస్ట్ సూడాన్ మీదుగా ఎరిట్రియా దేశం, అటు నుండి ఈజిప్టు మీదుగా మధ్యధరా సముద్రం మీదకి వెళ్లి అటు నుండి నేరుగా టెల్ అవీవ్ మీద దాడి చేశారు!
********
ఇజ్రాయెల్ రాడార్లు గుర్తించలేదా?
1.IAF (Israel Air Force) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం డ్రోన్ మధ్యధరా సముద్రం మీద ఎగురుతున్నపుడు IAF రాడార్లు గుర్తించాయి కానీ అది పెద్ద సైజులో ఉండే పక్షి అని అనుకున్నారు రాడార్ ఆపరేటర్లు!
2.డ్రోన్లకి ఉండే సానుకూల అంశం ఇదే! అందుకే తేజస్ ఫైటర్ జెట్ ను చాలా చిన్నదిగా ఉండేలా డిజైన్ చేశారు!
3. సమద్ 3 డ్రోన్ గంటకి 140 నుండి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఇంత తక్కువ వేగంతో జెట్ ఫైటర్ ప్రయాణించలేదు! కాబట్టి రాడార్ ఆపరేటర్లు తికమకపడ్డారు.
4. డ్రోన్ మధ్యధరా సముద్రం మీద ఎగురుతున్నపుడు ఓ నాలుగు నిమిషాల పాటు రాడార్ ఆపరేటర్లు గుర్తించారు, దానిని ట్రాక్ చేసే లోపు డ్రోన్ రాడార్ మీద నుండి అదృశ్యం అయింది!
5. మధ్యధరా సముద్రం మీద ఎంతవరకూ IAF రాడార్ రేంజ్ ఉంటుంది అనేది డ్రోన్ ఆపరేట్ చేసిన వాళ్ళ దగ్గర సమాచారం ఉంది! షాడో రేంజ్ లోకి వెళ్ళే ముందు 4 నిముషాలు గుర్తించ గలిగే రేంజ్ లో ఉంటుంది అని ఇరాన్ నిపుణులకి తెలుసు.
6. అందుకే సమద్ 3 డ్రోన్ మధ్యధరా సముద్ర జలాలలోకి ప్రవేశించే సమయానికి ఇరాక్ నుండి మరో డ్రోన్ మధ్యధరా సముద్రం మీదకి వచ్చింది. అంటే సమద్ డ్రోన్ కి ఫ్రీ పాస్ ఇవ్వడానికి ఇరాక్ నుండి మరో డ్రోన్ మధ్యధరా సముద్ర మార్గంలోకి వచ్చింది. IAF రాడార్ ఆపరేటర్లు దానిని గుర్తించి అలర్ట్ చేశారు. IAF జెట్లు దానిని కూల్చివేశాయి. ఈ లోగా పక్షి అనుకొని వదిలేసిన సమద్ 3 డ్రోన్ టెల్ అవీవ్ లోకి వెళ్లి దాడి చేసింది!
*********
ఈ మొత్తం ఆపరేషన్ ను ఇరాన్ కి చెందిన నిపుణులు దగ్గరుండి హుతీల చేత చేయించారు! మెచ్చుకో తగ్గ మిషన్ ను పూర్తి చేయగలిగారు ఇరాన్ నిపుణులు! హాట్స్ ఆఫ్!
జరిగింది ఉగ్ర దాడి అని చూడకుండా ఒక మిలటరీ ఆపరేషన్ గా చూస్తే ఎవరైనా మెచ్చుకోక తప్పదు! నేను ఈ కోణంలోనే హ్యాట్స్ ఆఫ్ చెప్పాను, ఎందుకంటే ఉగ్ర దాడి అయినా మిలటరీ ఆపరేషన్ అయినా టైమింగ్, ఇంటెలిజెన్స్, పేషన్స్ (ఓర్పు), కాలిక్యులేషన్ అనేవి కావాలి, అప్పుడే దానిని ప్రొఫెషనలిజం అంటారు!
ఈ ఆపరేషన్ నిర్వహించిన తీరును చూస్తే డిఫెన్స్ రంగంలో ఉన్న ఎక్సపర్ట్స్ మెచ్చుకొని తీరాల్సిందే! ఎందుకు మెచ్చుకోవాలి? యెమెన్ నుండి ఇజ్రాయెల్ లోని టెల్అవీవ్ కి సమద్ 3 మోడిఫైడ్ డ్రోన్ ప్రయాణించింది 2,600 km. మొత్తంగా 16 గంటల పాటు డ్రోన్ గాలిలొ ఎగురుతూనే ఉంది కానీ ఈజిప్ట్, ఇజ్రాయెల్ రాడార్లు పసిగట్టలేకపోయాయి! Time and Distance!
సమద్ 3 డ్రోన్ మధ్యధరా సముద్రం మీదికి వచ్చే సమయానికి ఇరాక్ నుండి మరో డ్రోన్ మధ్యధరా సముద్రం మీదికి రావాలి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ ను ఖచ్చితంగా లెక్కకట్టాలి, దాని కోసం సమద్ 3 డ్రోన్ వేగాన్ని పెంచుతూ, తగ్గిస్తూ ఆపరేట్ చేశారు.
ఇజ్రాయెల్ IAF ను బోల్తా కొట్టించిన విధం!
ఇజ్రాయిల్ దగ్గర ఇరాన్ కి చెందిన అన్ని డ్రోన్ల డాటా ఉంది వాటి మోడల్ నంబర్స్, టెక్నికల్ డాటాతో సహా! కానీ సమద్ 3 డాటా కూడా ఉన్నా దాని సైజ్, షేప్ లని మార్చింది ఇరాన్. దాంతో IAF రాడార్ ఆపరేటర్లు కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే IAF డాటాలో ఉన్న దానితో సమద్ 3 మ్యాచ్ అవ్వలేదు. దాంతో రాడార్ ఎలాంటి వార్నింగ్ సిగ్నల్ ఇవ్వలేదు! హుతీ డ్రోన్ దాడి తరువాత ఒక్కో రాడార్ దగ్గర మరో ఇద్దరు అనలిస్ట్ లని నియమించింది IAF!
*******
ఇరాన్ – హుతిల సంయుక్త డ్రోన్ ఆపరేషన్ ను చాలా సీరియస్ గా తీసుకున్న ఇజ్రాయెల్ తనదైన శైలిలో ప్రతిస్పందించింది.. ఏం చేసింది..? చెప్పుకుందాం… తరువాత భాగంలో… …….. [ పోట్లూరి పార్థసారథి ]
(ఇజ్రాయిల్‌కు కంట్లో నలుసులా ఉండే ఇద్దరు ముఖ్యనేతలు గంటల వ్యవధిలో హతమయ్యారు… 1) హెజబుల్లా కమాండర్ ఫుయాద్ షుకూర్, 2) హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియె…!)
Share this Article