Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వర్గపోరాటం కథ… జయప్రద తొలి సినిమా… ప్రభాకర్‌రెడ్డిని ‘ముంచేసింది’…

August 8, 2024 by M S R

Class war movie . గాంధీ పుట్టిన దేశం , భూమి కోసం సినిమాల్లాగా ఎర్ర సినిమా . ప్రముఖ నటుడు ప్రభాకరరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకుడు . ప్రభాకరరెడ్డి 27 సినిమాలు తీస్తే , కమర్షియల్ గా రెండు సినిమాలు నష్టాలు తెచ్చాయట . ఆ రెండింటిలో ఇది ఒకటి . సుమారు పది లక్షల రూపాయల నష్టం వచ్చిందట .

జయప్రద మొదట బుక్ అయిన సినిమా ఇదేనట . ప్రభాకరరెడ్డే జయప్రద అనే పేరు పెట్టింది . ఆమె రెండో సినిమా అయిన భూమికోసం ముందు రిలీజయింది . జయప్రదకు జంటగా వేసిన రవికాంత్ స్టోరీ కూడా ఇదే . అతనికి ఇదే మొదటి సినిమా అయినా , శ్రీదేవికి జోడీగా వేసిన అనురాగాలు ముందు రిలీజయింది . ఈ సినిమా టైటిల్సులో రవికాంత్ , జయప్రదలను నూతన జంట అనే పరిచయం చేసారు . పోస్టర్లలో ఉన్నది ఆ జంటే .

ఈ సినిమాకు షీరో షావుకారు జానకే . ఆమె పాత్ర , నటన , డైలాగులు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి . పెత్తందారుగా పల్లె జనాలను పీక్కుతింటున్న భర్తతోనే విబేధించి , ఎదురు తిరిగి , భర్త చేతుల్లోనే తుపాకీ గుళ్ళతో చనిపోయే పాత్ర . గణేష్ పాత్రో డైలాగులను బాగా ఎరుపెక్కించారు . షావుకారు జానకి బాగా నటించింది . ఆమె తర్వాత రెబల్ హీరోగా కృష్ణంరాజు బాగా నటించారు .

Ads

ప్రభాకరరెడ్డి , గుమ్మడి , నాగభూషణం , త్యాగరాజు , కాకరాల , పద్మనాభం , రాజబాబు , అల్లు రామలిఃగయ్య , రావు గోపాలరావు , మాడా , ప్రభ , శుభ , కె విజయ ప్రభృతులు నటించారు . కాకినాడ , ఉప్పాడ ప్రాంతాలలో ఔట్ డోర్ షూటింగంతా తీసారు .

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు ఎర్రగానే ఉంటాయి . సి నారాయణరెడ్డి వ్రాసిన ఏమాయె ఏమాయె పిల్లా , బతకనివ్వరురా వున్నోళ్ళు పాటలు బాగుంటాయి . గోపి వ్రాసిన సోతంత్రం వచ్చింది మన పంతం నెగ్గింది , ఎంకీ నే సూడలేనే ఎలుతురులో నీ రూపు , ఏయ్ నాయుళ్ళ సిన్నోడు నడిమింటి చంద్రుడు పాటలు బాగుంటాయి . దాశరధి వ్రాసిన ఓహో మా గంగమ్మ తల్లి ఓ బంగారు తల్లి పాట బాగుంటుంది .

సినిమా యూట్యూబులో ఉంది . ఎర్ర సినిమాల అభిమానులు , కృష్ణంరాజు అభిమానులు చూడవచ్చు . కమర్షియల్ గా ఫెయిల్ కావలసిన సినిమా కాదు . సినిమా బాగానే ఉంటుంది . జనానికి నచ్చలేదు , పట్టలేదు , ఎక్కలేదు .

1980s దాకా ఎర్ర సినిమాలు , సందేశాత్మక సినిమాలు బాగానే ఆడాయి . తర్వాత తర్వాత జనం , ముఖ్యంగా మధ్య తరగతి జనం కలల్లో విహరించటం పెరిగిపోయాక ఈ సినిమాలకు ఆదరణ తగ్గింది . బహుశా దేశంలో సామాజిక , రాజకీయ , ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పులు వచ్చి ఉండాలి .  #తెలుగుసినిమాలు…….. [ By దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్టార్ హీరో ఇమేజ్, డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్లు ఉండగానే సరిపోదు..!!
  • కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా..! తెలంగాణకు కేసీయార్ జలద్రోహం- నిజాలు..!!
  • ‘ట్రంపరితనం’… ప్రపంచానికే వినాశకరం… ఏదో ముంచుకొస్తోంది…
  • వ్యాపిస్తున్న దుర్గంధం… తిట్ల పర్వంలో జాతీయ నేతలనూ వదలడం లేదు…
  • ఒకటి బాసట…! మరొకటి కబళింపు..! ఇదే అమెరికాకూ ఇండియాకూ తేడా..!!
  • శివశంకర ప్రసాద్ గారు… మీ ‘గెస్చర్’ మనసుని గెలుచుకుంది..!
  • సంక్రాంతి ఎప్పుడు..? ఎందుకు మీమాంస..? మళ్లీ సందిగ్ధత..!!
  • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
  • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!
  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions