NTR ఖాతాలో మరో వంద రోజుల సినిమా . NTR సినిమా వంద రోజులు ఆడకపోతే న్యూస్ . ప్రేక్షకులు లాగిస్తారు . దానికి తోడు సంసారం టైటిల్లో కూడా ఓ మేజిక్ ఉంది . 1950 లో యల్ వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం సినిమా 11 సెంటర్లలో వంద రోజులు ఆడింది . సిల్వర్ జూబిలీ కూడా చేసుకుంది . ఆనాటి ఉమ్మడి రాష్ట్రం మద్రాసు రాష్ట్రానికి రాజధాని , దక్షిణ భారత సినిమా రాజధాని అయిన మద్రాసులో 224 రోజులు ఆడింది . NTR , ANR , లక్ష్మీరాజ్యంలు నటించారు .
1988 లో శోభన్ బాబు , శారద , జయప్రదలతో మరో సంసారం సినిమా కూడా సూపర్ హిట్టయింది . ఇంక సంసారం సాగరం , ఆ సాగరం , ఈ సాగరం టైటిల్సుతో చాలా సినిమాలు వచ్చాయి . తెలుగు ప్రేక్షకులు అన్నింటినీ సాదరించారు . 1975 లో వచ్చిన ఈ NTR సంసారం సినిమాను కూడా సాదరించారు .
తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ఈ రంగుల సినిమాలో NTR , జమున , రోజారమణి , జయసుధ , మిక్కిలినేని , పుష్పకుమారి , జగ్గయ్య , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , పద్మనాభం , రత్న , రావి కొండలరావు , పి జె శర్మ , ప్రభాకరరెడ్డి ప్రభృతులు నటించారు . జయసుధది రావి కొండలరావు కూతురి పాత్ర . లక్ష్మణరేఖ సినిమా ఈ సినిమా తర్వాతదే అనుకుంటాను .
Ads
తాతినేని చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . దాశరధి వ్రాసిన మా పాప పుట్టిన రోజు పాట బాగా హిట్టయింది . జైల్లో ఖైదీల మద్యపానం వద్దని ప్రబోధించే పాటని కొసరాజు వ్రాసారు . సందేశాత్మకంగా ఉంటుంది . ఒకనాడు మద్యపానం పదాన్ని కూడా ఉఛ్ఛరించేవాళ్ళు కాదు . That was considered not only a health hazard but also a social stigma . Thanks to our rulers and leaders .
ఇప్పుడు చక్కగా మద్యం బ్రాండ్ల మీద , ఓ సాదాసీదా మనిషి ఎన్ని పెగ్గులు తాగాలి , తాగవచ్చు , ఏ బ్రాండ్లు తక్కువ హానికరం వంటి అంశాలను బహిరంగంగా , విపులంగా చర్చించుకుంటున్నాం . ఏదో చాటుగా లాగించేది రోడ్ల మీదకు వచ్చేసింది . పెరేడ్ చేయిస్తున్నాం . మిగిలిన పాటలు థియేటర్లో బాగానే ఉన్నాయి కానీ బయట హిట్ కాలేదు .
NTR కు మారువేషం లేకపోతే ప్రేక్షకులకు నచ్చదు గాక నచ్చదు . ఈ సినిమాలో కూడా సింగపూర్ రౌడీ భాక్రాగా క్లైమాక్సులో ఆయన మార్కు ఏక్షన్ ఆయన చేసిపడేస్తారు . మొత్తం మీద సినిమా NTR రేంజ్ కాకపోయినా బాగుంటుంది , బాగానే ఆడింది . కాస్త డబ్బుకు లోకం దాసోహం సినిమా వాసన ఉంటుంది .
సినిమా యూట్యూబులో ఉంది . NTR అభిమానులు ఎవరయినా చూసి ఉండకపోతే ఇప్పుడు చూడవచ్చు . సింగపూర్ రౌడీ భాక్రాని చూడకపోతే ఎలా !? #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…… [ By దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]
Share this Article