Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టాలీవుడ్ పెద్ద తలలూ… సిగ్గుతో పాతాళానికి వంగిపోయాయా..? థూమీబచె..!!

August 16, 2024 by M S R

థూమీబచె… ఈ మాట అనడానికి సంకోచం లేదు, సంశయమూ లేదు… మొత్తం ఇండియన్ సినిమాను శాసించేంత సాధన సంపత్తి ఉంది తెలుగు ఇండస్ట్రీలో… కళాకారుల ప్రతిభను కొదువ లేదు… మస్తు క్రియేటివిటీ, మస్తు కష్టపడే తత్వం ఉన్నాయి… కానీ ఎటొచ్చీ మన టాలీవుడ్ ఓరకమైన కమర్షియల్, సోకాల్డ్ మాస్ మసాలా, దిక్కుమాలిన ఇమేజీ బిల్డప్, ఫార్ములా నదిలో పడి కొట్టుకుపోతోంది… ఎందుకొచ్చిన స్టార్‌డమ్..?

సినిమా అంటే ఇంకా నెత్తిమాసిన మూర్ఖ స్టెప్పులు, మడతపెట్టే బూతు పాటలు, వెగటు కథలు, వెకిలి మాటలు, దిక్కుమాలిన ఫైట్లు, వికారపు కామెడీ… ఇదే ధోరణి… ఇదే పోకడ… వేల కోట్లు సంపాదించినా సరే, ఒక్కడికీ కాస్త మొహం తెలుపెక్కి మెరిసే ఆలోచన లేదు, అడుగు లేదు…

సింపుల్‌గా చెప్పాలంటే… తెలుగు నిర్మాతకు లెక్కలు ముఖ్యం, దందా ప్రధానం… ఇక్కడి సిండికేట్లకు టేస్ట్ లేదు… కేవలం సినిమాలు అంటే డబ్బును ముద్రించే మార్గాలు… అంతే… అందుకే, ఈరోజు ప్రకటించిన జాతీయ సినిమా అవార్డుల్లో ఒక్కటంటే ఒక్క అవార్డూ లేదు టాలీవుడ్‌కు… సిగ్గుపడండర్రా… సామూహికంగా…

Ads

అదేమిటీ ..? కార్తికేయ-2 సినిమాకు వచ్చింది కదా అంటారా..? అది ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రం… తెలుగు సినిమాకే ఇవ్వక ఏం చస్తారు..? తెలుగు జాబితాలో ఉంది కాబట్టి, ఏదో ఒకటిలే అనుకుని ఇచ్చారు… అంతేతప్ప, మెచ్చుకుని మేకతోలు కప్పడం కాదు ఇది… ఒక్కడంటే ఒక్కడికి కాలర్ ఎగరేసే సందర్భమే రాలేదు… సిగ్గుచేటు…

ఒక్కసారి ఈ జాబితా చదివేయండి…



70వ జాతీయ అవార్డులు గెలిచిన ఫీచర్ సినిమాల జాబితా
ఉత్తమ సినిమా – ఆట్టం (మలయాళం)

ఉత్తమ దర్శకుడు – సూరజ్ ఆర్ బడ్జాత్య (ఉంచాయ్ – హిందీ)

ఉత్తమ నటుడు – రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ)

ఉత్తమ నటి – నిత్యామీనన్ (తిరుచిత్రాబలం – తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్)

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం – కాంతార (కన్నడ)

ఉత్తమ సహాయ నటుడు – పవన్ రాజ్ (ఫౌజా)

ఉత్తమ సహాయ నటి – నీనా గుప్తా (ఉంచాయి – హిందీ)

ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: ప్రమోద్ కుమార్ (ఫౌజా – హిందీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: రవివర్మన్ (పొన్నియన్ సెల్వన్ 1 – తమిళం)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – బ్రహ్మాస్త్ర పార్ట్-1 (హిందీ)

ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) – ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర పార్ట్-1 – హిందీ)

ఉత్తమ సంగీత దర్శకుడు (బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్) – ఏఆ రహమాన్ (పొన్నియిన్ సెల్వన్-1, తమిళం)

ఉత్తమ స్క్రీన్‍ప్లే – ఆనంద్ ఏకాదశి (ఆట్టం, మలయాళం)

ఉత్తమ మాటల రచయిత – అర్పితా ముఖర్జీ, రాహుల్ వీ చిట్టెల (గుల్‍మోహర్ – హిందీ)

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ – అన్బరివ్ (కేజీఎఫ్ చాప్టర్ 2, కన్నడ)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – సోమనాథ్ కుందు (అపరాజితో)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – నిక్కీ జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్, హిందీ)

ఉత్తమ లిరిక్స్ – నౌషాద్ సర్దార్ ఖాన్ (ఫౌజాలో సలామీ పాట, హిందీ)

ఉత్తమ గాయకుడు – అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ 1లో కేసరియా పాట, హిందీ)

ఉత్తమ గాయకురాలు – బాంబే జయశ్రీ – (సౌదీ వెల్లక్కలో చాయుమ్ వెయిల్, మలయాళం)

ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫీ – జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్ (తిరుచిత్రాంబలంలోని మేఘం కరుకత పాట, తమిళం)

ఉత్తమ ఎడిటింగ్ – మహేశ్ భువనేంద్ (ఆట్టం, మలయాళం)

ప్రత్యేక జ్యూరీ అవార్డు – మనోజ్ బాజ్‍పేయ్ (గుల్‍మోహర్, హిందీ), సంజయ్ చౌదరి (కాధికాన్, హిందీ)

జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను చాటిన ఉత్తమ చిత్రం – కచ్ ఎక్స్‌ప్రెస్ (హిందీ)

ప్రాంతీయ విభాగంలో జాతీయ అవార్డులు
తెలుగులో ఉత్తమ సినిమా – కార్తికేయ 2

తమిళంలో ఉత్తమ సినిమా – పొన్నియిన్ సెల్వన్ 1

కన్నడలో ఉత్తమ సినిమా – కేజీఎఫ్ 2

మలయాళంలో ఉత్తమ సినిమా – సౌదీ వెల్లక్క

హిందీలో ఉత్తమ సినిమా – గుల్‍మోహర్



borse

మనకు ఇలాంటి సిగ్గుమాలిన స్టెప్పులు, క్రియేటివిటీ చాల్లెండి… ఇంకేం ఆశిస్తారు..? పైన జాబితా చూడండి… తమిళ, మలయాళ, హిందీ, కన్నడ సినిమాలు ఎలా పోటీలు పడ్డాయో… మన నిత్యామేనన్‌కు అవార్డు, కానీ తమిళ సినిమాకు… మన రెహమాన్‌కు ఉత్తమ బీజీఎం అవార్డు, కానీ తమిళ సినిమాకు… మన జానీ మాస్టర్‌కు అవార్డు, కానీ తమిళ సినిమాకు… అంతే, అలా భుజాలు చరుచుకోవాల్సిందే… లోలోపల సిగ్గుతో ముడుచుకోవాల్సిందే…! తీయండి, ఇంకా తీయండి… మిస్టర్ బచ్చన్‌లూ… డబుల్ ఇస్మార్ట్‌లూ… మీ దుంపతెగ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…
  • నకిలీలకే ‘మెరుపు’లెక్కువ..! ముగ్గురు గరల్‌ ఫ్రెండ్స్, గర్భాలు..!!
  • తెలంగాణ గ్రామీణ వోటరు ఏం చెబుతున్నాడు..? ఇదీ క్లారిటీ..!!
  • హీరో మెటీరియలే..! కానీ ‘ఆది’ నుంచీ ‘డ్రైవ్’ కుదరడం లేదు పాపం…
  • మసక మసక చీకటిలో… మళ్లీ ఆనాటి స్మిత నయగారాలు, నయా రాగాలు…
  • బాలకృష్ణ అఖండ తాండవాలకు బీజం పడింది ఈ సినిమాతోనే..!!
  • మెస్సి టూర్ – నిజమైన సార్ధకత ఎక్కడుంది..? | Khelo India రియాలిటీ చెక్…
  • తగ్గొద్దు… రేవంతన్నా… ఏదేమైనా కానీ… ఈ స్పీడ్ ఆగొద్దు….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions