ఆ రాజకీయాలు ఎంత పాప పంకిలం అయినా సరే… సీతారాం ఏచూరి అంటే నాకు అభిమానం…
ఈ దేశానికి హిందుత్వ రాజకీయాలు ఫాసిస్టు రాజకీయాలు వేరు కాదు అని మూడు దశాబ్దాల కిందనే చెప్పిన మేధావి. తరువాత ఆ పార్టీ ఎంత దిగజారి పోవాలో అంత పోయింది .
వాళ్ళు నందిగ్రాంలో జన సంఘ్ గా, ఆంధ్రాలో తెలుగు దేశంగా , తెలంగాణలో భారత రాష్ట్ర సమితిగా … మొత్తంగా యే పార్టీకీ దగ్గర కాదు అని చెబుతూ ఫాసిస్టు పార్టీ ఎదుగుదలకే దోహదపడిన గొప్ప పార్టీ వాళ్లది.
Ads
చదువుకున్న తరం అంతరించి పోలేదు అని ఎప్పటికీ రుజువు చేసిన ఏచూరి . ఫాసిస్టు పార్టీని ఓడించాలి అంటే కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకొని పోవాలి అనేవాడు . ఆ శక్తులు విడిపోతే అంతిమంగా ఫాసిజమే రాజ్యం సొంతం చేసుకునే ప్రమాదం ఉంటది అనేది ఆయన థీసిస్.
కానీ, వాళ్ళు ఏనాడూ ఏచూరి ఆలోచనలను గౌరవించ లేదు… ఆయన స్ఫూర్తిని దెబ్బ తీశారు. తీస్తూనే ఉన్నారు. ఇక యధేచ్చగా పని చేస్తారు.
సర్, మీకు బాగా లేదు అని వారం కింద తెలిసింది . నిన్న రాత్రి ICU లో నీ పక్కనే ఉన్న మిత్రుడు ఒక మంచి మాట చెప్పాడు. ఆయనకు బాగానే ఉంది వెంటిలేటర్ తీసేసారు అని, సంతోషపడ్డా . ఇంతలోనే ఈ వార్త…
మిమ్మల్ని లక్షలాది మంది నిజమైన కామ్రేడ్స్ మిస్ అవుతారు . కుల రొచ్చులో కొట్టుకుని కునారిల్లుతున్న అభినవ మార్క్స్ , లెనిన్, జింగుచకా గాళ్ళు మా పార్టీ ఇక నుంచి అన్ని పార్టీలకు సమదూరం అవుతూ .. మానవ సమాజానికి కాంతి సంవత్సరాల దూరంలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటారు…
సిపిఎం పోలిట్ బ్యూరో మెంబర్ , ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గంట కింద ఎయిమ్స్ లో వూపిరి తిత్తులు మొరాయించి మనకు దూరం అయ్యాడు. హైదారాబాద్ లో జరిగిన జాతీయ మహాసభ లో జరిగిన జుగుప్సాకరమైన క్యాంప్ రాజకీయాలలో మైనారిటీ తీర్మానాన్ని గెలిపించిన ధీరుడు అతను కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో అదొక చారిత్రక ఘటన.
చివరిగా ఒక మాట చెప్పగలను… ఈ దేశం లో INDA కూటమికి ఏచూరి ఒక అదనపు సొబగు. ఇప్పుడు CPM అంతటి ప్రభావవంతమైన నాయకులు అసలే లేరు, పైగా ఫాసిజానికి మినియేచర్లు ఇప్పటి నాయకులు . ఈ దేశానికి ఈ కాలానికి అవరమైన నాయకుడు ఏచూరి.
I can say It’s an irreplaceable loss to left camp and social democracy. రెస్ట్ ఇన్ పవర్ కామ్రేడ్… అల్విదా….. (గుర్రం సీతారాములు)
Share this Article