అదితిరావు హైదరీ, సిద్ధార్థ్ జంట పెళ్లిబంధంతో అధికారికంగా ఒక్కటయ్యారు… ఇన్నేళ్ల ప్రణయం, సహజీవనానికి చట్టబద్ధత కల్పించుకున్నారు, అదీ హిందూ సంప్రదాయ వివాహ పద్ధతిలో… అదీ ఓ ఆలయ ప్రాంగణంలో… అదీ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో… అదీ మరెవరికీ ప్రవేశం లేని కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ…
ప్రత్యేకించి మీడియా హడావుడి లేదు… అట్టహాసాలు లేవు, ఆడంబరాలు లేవు… బందోబస్తుల్లేవు… ఎడాపెడా ఖర్చుల్లేవు… అభిమానులు, హంగామాలు, తోటి సినిమా కళాకారులు, పెద్దల రాకపోకలు గట్రా ఏమీ లేవు… సింపుల్‌గా వాళ్లు ఒక్కటయ్యారు… కొన్ని ఫోటోలు పబ్లిక్ డొమెయిన్‌లోకి పెట్టేశారు…
పెద్ద పెద్ద తారలు వందల కోట్ల ఖర్చులతో, అతిశయపు పెళ్లిళ్లు చేసుకుంటే… ఊళ్లో పెళ్లికి అన్నట్టు… మీడియా ఊకదంపుడు కవరేజీలు… తీరా ఆ కవరేజీ వీడియోలను ఆ జంట ఏ మీడియా వాడికో అమ్మేయడం… చివరకు అన్నీ కమర్షియలే కదా ఈరోజుల్లో… మరీ సెలబ్రిటీల పెళ్లిళ్లు సొసైటీకి ఓ పెద్ద చికాకు యవ్వారంగా మారిపోయింది కదా…
Ads
నచ్చింది ఏమిటంటే..? సింపుల్ పెళ్లి… ఆమె తన పాత రాజాస్థానం బాపతు సంప్రదాయాన్ని, నమ్మకాల్ని, వారసత్వాన్ని, స్థానికతను గౌరవించింది… నిశ్చితార్థాన్ని ఏ 400 ఏళ్ల గుళ్లో జరిపించుకుందో, అక్కడే దాదాపు అంతే గోప్యంగా… ఏ షోపుటప్పులూ లేని వాతావరణంలో పెళ్లి జరిపించుకుంది… బాగుంది… మిడిల్, లోయర్ మిడిల్ క్లాస్ పెళ్లిళ్లు కూడా భారీ ఖర్చులతో జరుగుతున్న ఈ రోజుల్లో ఇద్దరు సెలబ్రిటీలు నిరాడంబర పెళ్లితో స్పూర్తిగా నిలవడం నచ్చింది…
అఫ్‌కోర్స్, ఇద్దరికీ ఇదేమీ తొలి పెళ్లి కాదు… మరీ సిద్ధార్థ్‌కు ఎన్నో పెళ్లో అస్సలు తెలియదు… తను పాత యవ్వారాలు గట్రా పరిశీలిస్తే ఏమాత్రం నమ్మదగని కేరక్టర్… సరే, ఏం నమ్మిందో తను చేరువైంది… పెళ్లికి సిద్ధపడ్డారు… శుభం పలకరా అంటే ఏదో అన్నట్టు గాకుండా నాలుగు రోజులు స్థిరంగా సంసారం చేసుకోవాలనే విషెస్ చెబుదాం…
ఆమెది భిన్నమైన కుటుంబ నేపథ్యం… ముస్లిం, హిందూ, బౌద్ధ సమ్మేళనం… వనపర్తి సంస్థానం… రెండేళ్ల వయస్సులోనే తల్లిదండ్రుల విడాకులు… తల్లే పెంచింది… పేరు విద్యారావు… రైటర్, శాస్త్రీయ గాయని… అదితి భరతనాట్యంలో ట్రెయిన్‌డ్… అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది… కొన్ని మంచి పాత్రలు పడ్డాయి… పేరొచ్చింది… తొలి వివాహం ఫెయిల్… ఇవన్నీ సరే, మరీ ఈ సిద్ధార్థుడికి ఎలా చిక్కింది అంటారా..? ప్రేమ గుడ్డిది కదా… ఆమెది మరోతరహా కాలిక్యులేటెడ్ గుడ్డి ప్రేమ..!!
Share this Article