కాస్తోకూస్తో బెటర్ అనుకున్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌ను విజయవంతంగా భ్రష్టుపట్టించారు కదా… ఇప్పుడిక హఠాత్తుగా జీసరిగమప, ఈటీవీ పాడుతా తీయగా చాలా బెటర్ అనిపిస్తున్నాయి… నిజం…
కంటెస్టెంట్లు గతంలో పలు పోటీల్లో పాల్గొన్నవాళ్లే… చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచీ పాడుతున్నవాళ్లే… కానీ ఈ షో కోసం ఎంపిక చేయబడిన పాటల్లో పెద్ద వైవిధ్యం లేదు, నిజంగా కంటెస్టెంట్లను పరీక్షించే భిన్న ప్రయోగాల పాటలు కానే కావు అవి… పైగా పాటల ట్రెయినర్ రామాచారి, ఆయన శిష్యురాలు గీతామాధురి అభిమానాలు, ఆయన కొడుకు సాకేత్ పైరవీలు ప్లస్ థమన్ తాలూకు రాగద్వేషాలు… తీర్పులను ప్రభావితం చేస్తున్నాయని బలంగా అనిపిస్తోంది…
Ads
కొన్ని వీడియోలు చూస్తుంటే కీర్తన అనే కాకినాడ అమ్మాయి పాల్గొన్న పాడుతా తీయగా వీడియోలు కనిపించాయి… ఓ పాట అయిపోగానే విజయప్రకాష్, సునీత వెళ్లి ప్రేమగా, అభినందనగా ఆలింగనం చేసుకున్నారు… ఎస్పీ చరణ్ కూడా అంతే… అంత బాగా పాడింది… ఆమే తెలుగు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ ఇప్పుడు, టాప్ ఫైవ్… కానీ అంతటి మెరిటోరియస్‌కు తుది విజేత కిరీటం దక్కలేదు… సేమ్, శ్రీకీర్తి కూడా… ఆమెకూ అన్యాయమే…
నజీరుద్దీన్ గతంలో ఎస్పీ బాలు పాడుతా తీయగా షోలో పార్టిసిపేట్ చేసినవాడే, ప్రతిభావంతుడే… కానీ థమన్, గీత, కార్తీక్ తనను ఇంకా క్లాసిక్ నేర్చుకో, అది బలమైన పునాది వేస్తుంది అని చెబుతూనే ఫైనల్ కిరీటం పెట్టేశారు… ఇటు జీసరిగమప విషయానికి వస్తే కొత్త సీజన్ స్టార్ట్ చేస్తున్నారు… ఎస్పీ శైలజ, కోటితోపాటు ఈసారి గీత రచయిత కాసర్ల శ్యామ్ కనిపిస్తున్నాడు జడ్జిగా… హైపిచ్‌లో కయ్ కయ్ అని అరిచే శ్రీముఖే హోస్ట్…
రేవంత్, రమ్య బెహరా… మెంటార్లేమో బహుశా… లాంచింగ్ షోకు చిన్మయిని పట్టుకొచ్చారు… తెలుసు కదా, తల చుట్టూ బోలెడు వివాదాలు… ఆమె తెలుగు టీవీ కార్యక్రమాల్లో కనిపించేది తక్కువే… ఓన్లీ లాంచింగ్ గెస్టు మాత్రమేనా..? షోలో ఇన్వాల్వ్ చేస్తారా..? ఆమెతోపాటు విజయ్ ఏసుదాసు కూడా కనిపిస్తున్నాడు ప్రోమోలో… ఈసారి లోకల్ టాలెంట్, ఫోక్ సింగర్స్‌కు ప్రాధాన్యం ఉంటుందేమో బహుశా… ఈసారి తీన్మారే అంటున్నాడు శ్యామ్… అయితే పెద్ద ఆశలేం అక్కర్లేదు… పక్కా కమర్షియల్, ఫన్ బేస్డ్, ఎంటర్‌టెయిన్‌మెంట్ బేసిక్ షో… శ్రీముఖి అరుపుల్ని తట్టుకునేవాళ్లు చూడొచ్చు…
పాడుతా తీయగా ఆమధ్య గాడితప్పినట్టు అనిపించింది… మళ్లీ ఈమధ్య మెరుగుపడింది… ఎస్పీ చరణ్ హోస్టింగ్ కూడా హుందాగా, సరదాగా బాగుంది… సునీత కాస్త ఓవరాక్షన్ అనిపిస్తుంది గానీ జయప్రకాష్ వోకే… తెలుగు ఇండియన్ ఐడల్‌కు సాయి ఆర్కెస్ట్రా ఎంత బలమో, పాడుతా తీయగాకు బాలు బాపతు పాత ఆర్కెస్ట్రా టీమే ప్రధాన బలం… అవునూ, స్టార్ మా కూడా మళ్లీ ఓ మ్యూజిక్ రియాలిటీ షో స్టార్ట్ చేయొచ్చుగా..!!
Share this Article