థమన్ బహుశా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్‌కు రాకపోవచ్చు… ఏమో, కార్తీక్ కూడా అంతేనేమో… ఎందుకీ డౌట్ వచ్చిందీ అంటే, జవాబు వెంటనే చెప్పలేం… పేరుకు ఈసారి సీజన్ అత్యంత భారీ ఖర్చు అన్నారు… భారీ ఆడిషన్స్ అన్నారు…
తీరా కొత్త మొహాలేమీ లేవు… చిన్నప్పటి నుంచీ చాలా పోటీల్లో పాల్గొంటున్నవాళ్లనే ఎంపిక చేశారు, కొత్త మొహాల్లేవు… రెండో సీజన్‌లో ఏదో ఉండీలేనట్టుగా ఉంటూ, తిక్క జడ్జిమెంట్లు వెలువరిస్తూ చిరాకు పుట్టించిన గీతా మాధురి ఈ సీజన్‌ను పూర్తిగా డామినేట్ చేసింది… అన్నింటికీ మించి ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది…
నజీరుద్దీన్ విజేత కావడం వెనుక ఆమె ఉంది… అఫ్ కోర్స్, నజీరుద్దీన్‌లో ప్రతిభ ఉంది, మంచి గొంతు ఉంది… వరుసగా ఆరేడుసార్లు బ్లాక్ బస్టర్ పర్‌ఫామెన్స్ ఇచ్చాడు… విజేతకు అక్షరాలా అర్హుడే… కానీ..?
Ads
అందరికీ సినిమా పాటలు ఎలా పాడాలో నేర్పించే రామాచారి శిష్యుడు తను… రామాచారి కొడుకు సాకేత్ తనను స్వయంగా ఆడిషన్లలో తీసుకువచ్చాడు… ఇన్‌ఫ్లుయన్స్… అదే రామాచారి శిష్యురాలైన గీతామాధురి ఆ ప్రభావంలో పడింది… పదే పదే నువ్వు నా ఫేవరెట్ సింగర్ అని కీర్తిస్తోంది… ఇవన్నీ విజేత వెలుతురు వెనుక చీకటి…
ఎస్, థమన్ తనతో ఆల్రెడీ ఓ పాట పాడించాడు… సరే, దీన్ని ఇక్కడ కట్ చేస్తే… ఈసారి మైనస్సులు ఓసారి చెప్పుకుందాం… ఫస్ట్ సీజన్‌ను బాలయ్యతో ఫినాలే చేశారు, తరువాత ఏమైందో ఏమో, అల్లు అరవింద్ దాన్ని ఫినాలే అనుకుండా చిరంజీవిని పిలిచి విజేతను ప్రకటింపజేసి ఏదో హంగామా క్రియేట్ చేసి, బావకు మర్యాద ఇచ్చాడు…
సెకండ్ సీజన్ అల్లు అర్జున్ అనుకుంటా… కానీ మరి మూడో సీజన్‌కే మొహం మొత్తిందా..? చీఫ్ గెస్టు లేకపోవడం ఏమిటి..? ఇంత భారీ ఖర్చు, ఇంత భారీ వోటింగు, ఇంత భారీ వ్యూస్, భారీ ట్రెండింగ్ అన్నప్పుడు ఎవ్వరూ గెస్టు లేకపోవడమేమిటి..? ఎక్కడో థమన్‌కూ ఈ ప్రోగ్రామ్‌కు తేడా కొట్టినట్టు అనిపించింది… తను వద్దన్న ఓ కంటెస్టెంటును అమెరికా నుంచి రప్పించి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పించినప్పుడే దెబ్బతిన్నట్టుంది… అదలా కొనసాగింది…
చీఫ్ గెస్టు లేని ఫినాలే పూర్తిగా కళ తప్పింది… దీనికితోడు ఈసారి పిచ్చి పిచ్చి డ్రెస్సులతో, ఓ మేల్ శ్రీముఖిలాగా అరుస్తూ శ్రీరామచంద్ర కూడా చిరాకెత్తించాడు… మరి ప్లస్ పాయింట్లు… ఫినాలే గురించే చెప్పుకుందాం… ఫినాలే మొదట్లోనే ఆర్కెస్ట్రా పర్‌ఫామెన్స్ పెట్టారు… అదే పవన్, అదే కామాక్షి, అదే సాయి… చెవుల్లో అమృతం పోసినట్టు… సూపర్… నిజం చెప్పాలంటే ఈసారి సీజన్ సంయుక్త విజేతలు కామాక్షి, పవన్… నో డౌట్…
కార్తీక్ పాట… తోడుగా శాండిల్య వయోలిన్, రోల్ రైడా ర్యాపర్… జుగల్ బందీ… చిన్మయి ఎప్పుడు చెప్పినా కార్తీక్ ఆడ ఆపేక్షల గురించి ఆరోపణలు చేస్తుంటుంది కానీ… ఓ సింగర్‌గా కార్తీక్ ఎక్సలెంట్… చివరగా ఓ విశేషం చెప్పాలి…
థమన్ ఓ తమిళ సినిమాలో నటించబోతున్నాడు… దానికి సంగీత దర్శకుడు కూడా తనే, సహజంగానే… తను ఈ ఫినాలేలో స్వయంగా ఓ పాట బాగా పాడాడు… స్కంధ అనే కంటెస్టెంటుకు ఆ సినిమాలో చాన్స్ ఇవ్వబోతున్నాడు… గుడ్… కంపోజర్, డ్రమ్మర్, సింగర్, యాక్టర్, క్రికెటర్… వావ్ థమన్…!!
Share this Article