అభిజ్ఞ… ఈ పేరు గుర్తుందా..? ఆమధ్య తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ కోసం వచ్చింది… రిజెక్టయింది… మళ్లీ ఏ పైరవీతోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది… అహం దెబ్బతిన్న థమన్ రెండువారాలకే మళ్లీ ఇంటికి పంపించేశాడు… అందుకే ఇక తదుపరి సీజన్‌కు తను జడ్జిగా ఉండకపోవచ్చు… ఈ ఫినాలేకు కూడా చీఫ్ గెస్టు లేడు, ఏదో ముగించాం అంటే ముగించాం అన్నట్టుగా ముగించేశారు…
అదే అభిజ్ఞ ఇప్పుడు జీసరిగమప కొత్త సీజన్‌లో పాటపాడుతూ కనిపించింది… 29 నుంచి స్టార్ట్ అనుకుంటా… మొన్న చెప్పుకున్నాం కదా… కోటి, కాసర్ల, శైలజ జడ్జిలు… రమ్య బెహరా, చిన్మయి, అనుదీప్, రేవంత్ మెంటార్స్ కావచ్చు… హైపిచ్ శ్రీముఖి హోస్ట్… అభిజ్ఞ ఏదో ఒక కంపిటీషన్‌లో దుమ్మురేపి పోవాల్సిందే అన్నట్టు కనిపిస్తోంది… బాగానే పాడుతోంది కూడా…
ఆమె వర్జీనియా నుంచి వచ్చింది… సేమ్, గత సీజన్‌లో శృతి నండూరి న్యూజెర్సీ నుంచి వచ్చింది… తనూ మెరిటోరియసే… కానీ వాళ్లు లోకల్ సోషల్ మీడియా గ్రూపుల్ని మేనేజ్ చేసుకోలేక వోటింగులో వెనకబడతారు… ఈసారి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కేశవరామ్‌కూ ఇదే మైనస్… (అసలు వోటింగుతో మెరిట్ లెక్కించే పక్షంలో ఇక జడ్జిలు దేనికి..? కుళ్లు పంచు జోకులతో వినోదం పంచేందుకా..?) సరే, ఈ షోలలో పాత వాళ్లే అటూఇటూ మారుతున్నారు తప్ప నిజంగా కొత్తవాళ్లు తక్కువ… ఆల్రెడీ కంపిటీషన్లలో అనుభవం ఉన్నవాళ్లే… మరిక కొత్త ప్రతిభ వేట అని థమన్ అనడంలో నిజం ఏముంది..?
Ads
ఎక్కువ మంది చిన్నప్పటి నుంచీ పాడుతా తీయగా పోటీతో స్టార్ట్ చేసినవాళ్లే… ఇండియన్ ఐడల్ ఈ సీజన్ విజేత నజీరుద్దీన్ కూడా గతంలో పాడుతా తీయగాలో పాడినవాడే… కీర్తన చాలా పోటీల్లో… శ్రీకీర్తి కూడా… అనిరుధ్ సుస్వరం ఏకంగా ఇండియన్ ఐడల్ హిందీ ఆడిషన్ల దాకా వెళ్లి వచ్చినవాడే… అంతెందుకు, ఆల్రెడీ సినిమాల్లో పాటలు పాడినవాళ్లు కూడా గత ఐడల్ సీజన్లలో కంటెస్టెంట్లుగా వచ్చారు… గత సీజన్ విజేత సౌజన్య కూడా సినిమాలకు పాడిందే… అనుభవం ఆమెకు ప్లస్ కదా, కొత్తవాళ్లు ఎలా పోటీపడాలి…
ఫస్ట్ సీజన్ వైష్ణవి, వాగ్దేవి కూడా చాలాా పోటీల్లో పార్టిసిపేట్ చేసినవాళ్లే… చెబుతూ పోతే అనేక మంది… ఇక్కడ ప్రశ్న ఏమిటీ అంటే..? నిజంగా కొత్త వాళ్లను తెర మీదకు తీసుకురావడం లేదెందుకు..? గత సీజన్‌లో ఓ ఉత్తర కోస్తా జవాను పాల్గొన్నాడు, ఏ శిక్షణ లేకపోయినా కొన్ని వారాలు అదరగొట్టాడు… ఈ సీజన్‌లో ఓ ధర్మపురి సింగర్, ఏ శిక్షణా లేదు, ఎవరికీ తీసిపోలేదు… అలా కొత్తవాళ్లను కదా ఎంకరేజ్ చేయాల్సింది… ఆల్రెడీ శాస్త్రీయంలో శిక్షణ ఉండి, పలు పోటీల్లో పాల్గొన్న అనుభవం, సినిమాల్లో పాడిన సీనియారిటీ ఉన్నవాళ్లను అటూఇటూ మార్చి మార్చి ఈ టీవీ మ్యూజిక్ షోలు ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాముల్లో తీసుకోవడం వల్ల ‘అసలైన పోటీ థ్రిల్’ ఏముంటుంది..? నువ్వేమంటవ్ థమన్ భయ్..!!
Share this Article