నమస్తే తెలంగానలో ఓ స్టోరీ కనిపించింది… అయిదు కాలాల వార్త అంటే… చాలా ప్రయారిటీ ఇచ్చినట్టే… అదీ ఓ పార్టీ కరపత్రంలో..! ఈమధ్య కొన్ని జాతీయ, అంతర్జాతీయ స్టోరీలు కనిపిస్తున్నాయి… సొల్లు సోది రాజకీయ వార్తల నడుమ బెటర్ రిలీఫ్… అయితే..?
ఈ స్టోరీ సారాంశం ఏమిటంటే..? ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఇర్రి) శాస్త్రవేత్తలు మధుమేహానికి చెక్ పెట్టే వరి వంగడం కనిపెట్టారట… వాటిని త్వరలో భారత్‌కు కూడా తీసుకొచ్చి, ఇక్కడ విస్తారంగా పండించేందుకు వీలుగా వంగడాల్ని బాగా అందుబాటులోకి తీసుకొస్తారట… గుడ్… ఏమిటీ ఆ వరి వంగడం ప్రాధాన్యత..? నిజంగానే మధుమేహానికి చెక్ పెడుతుందా..?
నెవ్వర్… అతిశయోక్తి… ఈ వరి వంగడాల జీఐ ఇండెక్స్… ఒకటేమో 55, మరొకటేమో 51.1 అట… జీఐ ఇండెక్స్ లెక్కల్లో ఇది తక్కువే… జీఐ తక్కువ కాబట్టి త్వరగా సుగర్ లెవల్స్ పెరగవు, మెల్లిమెల్లిగా సుగర్ రిలీజ్ అవుతుంది… ఎస్, జీఐ లెవల్స్ తక్కువ ఉంటే డయాబెటిక్స్‌కు మంచిదే… 45 లోపు ఉంటే అతితక్కువ, 56 నుంచి 69 నడుమ ఉంటే మధ్యస్తం… అంతకుమించితే ఎక్కువ అని కేటగిరీస్తారు…
Ads
సో, మధుమేహులు కూడా మూడు పూటలా నిరభ్యంతరంగా తినొచ్చు అన్నట్టుగా రాయడం కరెక్టు కాదు… వరి అంటేనే కార్బొహైడ్రేట్స్, అంటే మధుమేహులకు అవాయిడ్ చేయదగిన ఆహారం… జీఐ తక్కువగా ఉన్నా సరే, అదేమీ మధుమేహానికి మందు కాదు, చెక్ పెట్టడమూ కాదు… అన్నింటికీ మించి ఇది కొత్త వంగడమేమీ కాదు… మరీ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ గొప్పలు చెప్పుకునేంత ఉత్కృష్ట పరిశోధన కూడా కాదు…
ఇదే నమస్తే తెలంగాణ అప్పట్లో తెలంగాణ సోనా అనే వెరయిటీ గురించి పొట్టు పొట్టు వార్తలు రాసింది… అది మన రాజేంద్రనగర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డెవలప్ చేసిన వెరయిటే… అదీ మనం బాగా ఇష్టపడే సోనా మశూరి పొడవుతో… అంటే సన్నరకం… ఇప్పుడు ఇర్రి చెబుతున్న వంగడాలు చిన్న గింజలు… మనకు అంత రుచించవు…
మన తెలంగాణ సోనా గురించి అప్పట్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు… ఇదుగో ఇప్పటిలాగే మధుమేహానికి ఔషధం అన్నట్టుగా కూడా రాసుకొచ్చారు చాలామంది… యూనివర్శిటీతో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి… బోలెడు బ్రాండ్ల పేరుతో మన మామూలు సన్నిబియ్యానికి దాదాపు రెట్టింపు ధరల్లో అమ్ముతున్నాయి… ఈ వెరయిటీ బియ్యం జీఐ ఇండెక్స్ కూడా 51.5 అని వర్శిటీ శాస్త్రవేత్తలు చెప్పారు…
మరి ఇర్రి ఇప్పుడు విశేష పరిశోధన, అభివృద్ధిగా చెప్పుకుంటున్న వెరయిటీల్లో ఒక దాని జీఐ 55… మరొకటి 51.1… అంటే మన సోనాయే బంగారం కదా… మనమే మంచి నాణ్యమైన మన సన్నరకాల నుంచే ఈ డయాబెటిక్ రైస్ డెవలప్ చేసుకున్నప్పుడు… ఇక ఇర్రి అంతకు ఎక్కువ జీఐ ఉండే వరిని డెవలప్ చేస్తే ఇంత ప్రాధాన్యం దేనికి..? మన తెలంగాణ సోనాను మించిన విశేషం ఏముంది ఆ వంగడాల్లో… వాటికి ఈ ప్రచారం దేనికి..? చూడబోతే గతంలో ఇదే పత్రిక ఏం స్టోరీలు ఇచ్చిందో కూడా ఎవరికీ సోయి లేనట్టుంది..!!
Share this Article