Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పురస్కారాల పందేరం వద్దు… అవార్డుల వైపు అందరి చూపు..!

February 25, 2026 by M S R

.

Mohammed Rafee … పురస్కారాల పందేరం వద్దు… – అవార్డుల వైపు అందరి చూపు!
ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అవార్డుల పరిమళాలు గుప్పుమంటున్నాయి! తెలంగాణలో గదర్ ఫిల్మ్ అవార్డ్స్, ఆంధ్రప్రదేశ్ లో ఉగాది కళారత్న అవార్డులకు సమయం దగ్గరపడింది! దరఖాస్తులు సమర్పించుకుని ఎదురు చూస్తున్నారు! ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ ఏర్పాటై ప్రసాద్ ల్యాబ్ థియేటర్ లో స్క్రీనింగ్ కూడా జరుగుతోంది! ఆంధ్రప్రదేశ్ లోనూ ఉగాది, కళారత్న దరఖాస్తులు వెల్లువెత్తాయి! అక్కడ స్క్రూటిని జరుగుతోంది!

ఈ నేపథ్యంలో చాలామంది ప్రభుత్వ అవార్డుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్ని ప్రైవేట్ అవార్డులు వచ్చినా ప్రభుత్వం ఇచ్చే పురస్కారమే కళాకారులకు అసలైన గుర్తింపుగా, తమ ప్రతిభకు గీటురాయిగా భావిస్తారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గదర్ ఫిల్మ్ అవార్డ్స్ పై మిశ్రమ స్పందన ఉంది. చాలామంది సినిమా రంగానికి గదర్ అవార్డులు, అంతంత డబ్బులు ఖర్చు చేయడాన్ని ఇష్టపడటం లేదు.

Ads

కేవలం తెలంగాణ నటులకు, సాంకేతిక నిపుణులకు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలకు మాత్రమే ఈ అవార్డు ఇవ్వాలనేది అధిక శాతం మంది వాదన! అసలు తెలంగాణ సినిమాను ప్రోత్సహించే చర్యలు లేకుండా గదర్ అవార్డుల పేరిట ఆంధ్ర సినిమా వాళ్ళకు సత్కారాలు ఏంటి? లక్షల బహుమతులు ఏమిటని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

కానీ, హైదరాబాద్ లోనే సినీ పరిశ్రమ ఉంది కాబట్టి, వారందరికీ ఇక్కడే ఓటు హక్కు ఉంది కాబట్టి తెలుగు సినిమా తెలంగాణ సినిమాగా భావిస్తున్నామనేది ప్రభుత్వ అభిప్రాయం. అందుకే ఇది రెండవ సంవత్సరం అవార్డుల సందడి మొదలైంది. ఉగాది పండుగ రోజు గదర్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కళారత్న, ఉగాది పురస్కారాల పంపిణీలో హైదరాబాద్ లో ఉంటున్న వారికి తమ ఖాతాలో ఇవ్వొద్దని అక్కడి కళాకారులు బాహాటంగా చెబుతున్నారు. అక్కడ సినిమా నటుల కేటగిరీతో పాటు కవులు కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, సామాజిక వేత్తలు ఇలా అనేక రంగాల వారికి ఉగాది పండుగ రోజే అవార్డుల వేడుక జరగనున్నది.

ఈ అవార్డులు దక్కించుకునేందుకు తెలిసిన వాళ్ళు తమకు తోచిన రీతిలో పైరవీలు చేసుకుంటున్నారు. కొందరు ఏం చేయాలో తెలియక వారిని వీరిని ఆరా తీస్తూ ఎదురు చూస్తున్నారు. సహజంగా ప్రభుత్వ పురస్కారాలకు పైరవీల తాకిడి అధికంగా ఉంటుంది! ఈ నేపథ్యంలో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో, ఎవరి పేరు తుది జాబితాలో ఉంటుందో ప్రకటించే వరకు చెప్పలేం.

గదర్ అవార్డుల పంపిణీలో తాము పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అంటున్నారు. ప్రతిభకు మాత్రమే పట్టం కడతామని సృజనాత్మక సంస్కృతి సమితి సిఇవో మల్లికార్జునరావు చెబుతున్నారు.

కొసమెరుపు ఏమిటంటే… ప్రభుత్వం కాబట్టి కనీసం 40 శాతం పైరవీలకు కేటాయించినా మిగిలిన 60 శాతం ప్రతిభకు మాత్రమే పురస్కారం ఇవ్వాలనేది నా ప్రధాన సూచన. అలాగే గతంలో పురస్కారాలు తీసుకున్న వారికి మళ్ళీ మళ్ళీ ఇవ్వొద్దని మనవి.

కష్టపడే వారికి, కళా ప్రతిభను చాటుకుంటున్న వారికి, ఆయా రంగాల్లో విశేష కృషి చేస్తున్న, చేసిన వారిని మాత్రమే నిజాయితీగా గుర్తించి పురస్కారం ప్రకటిస్తే ఆ పురస్కారం ద్విగుణీకృతం అవుతుంది. ఇరు ప్రభుత్వాలకు ప్రశంసలు లభిస్తాయి. పురస్కారాల్లో రిజర్వేషన్లు, పైరవీలకు ప్రాధాన్యం ఇవ్వొద్దు. పురస్కారాలను ప్రాంతాల వారీగా పందేరం చేయొద్దు! – డా. మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలు చక్రం తిప్పిన స్టాలిన్ సర్… మీకు మెనీ మెనీ థాంక్స్…
  • అవునూ, ఇంతకీ ఈ కథలో అసలు వ్యభిచారి ఎవరు..?
  • మోడీ సూత్రాలు..! ఏదో ఆర్థిక తుఫాన్‌కు ముందు మోగే సైరన్లు..!!
  • రెండు కళ్ళ సిద్ధాంతానికి కాలం చెల్లింది… అటో ఇటో తేల్చుకోవల్సిందే…
  • తెలంగాణ బరిలోనూ ఎన్డీయే కూటమి..? రేవంత్‌రెడ్డి నెత్తిన పాలు..!!
  • ఏమో అనుకుంటాం గానీ… శోభన్‌బాబుకూ కులగజ్జి ఎక్కువే…
  • కర్కోటక అవినీతి జయలలిత… చివరకు ఏం సాధించినట్టు..?
  • అంతరిక్షంలో ఎఐ యుద్ధాలా..? ఇండియా కూడా రెడీ..!
  • ఆ చివరి ఓవర్…. ఐపీఎల్ థ్రిల్లెస్ట్… ముంబై ఇంటికి… బెంగుళూరు టాప్ వన్…
  • విద్వేషం లేదు- విషం లేదు..! సరైన దిశలో ఒక పీఎం- ఒక సీఎం…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions