Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందమైన ఆ సీత పక్కన… ఆ రాముడు నప్పలేదు… వెరసి అప్పట్లోనే ‘ఆదిపురుష్’…

September 30, 2024 by M S R

మరో సీతా కల్యాణం . సీతా కల్యాణానికి కొనసాగింపే ఈ సీతారామ వనవాసం . బాపు గారి సినిమాకు పేరు , అవార్డులన్నా వచ్చాయి . కమలాకర కామేశ్వరరావు గారి ఈ సినిమాకు పేరు ఏమయినా వచ్చిందేమో కాని , డబ్బులు, అవార్డులు మాత్రం రాలేదు . సినిమా అంత నాసిదేమీ కాదు . అయినా నిర్మాత పింజల సుబ్బారావుకు ధన ప్రాప్తి ఉన్నట్లుగా లేదు .

రెండు సినిమాలలోనూ శ్రీరాముడిగా రవి నటించారు . సీతా కల్యాణం సినిమా ద్వారా తమకు ఆయన నచ్చలేదని ప్రేక్షకులు చెప్పాక కూడా ఈ సినిమాలో పింజల తీసుకోవటం హాశ్చర్యమే . సీతాకల్యాణంలో శ్రీరాముడి పాత్రకు డైలాగ్స్ లేవు , ఈ సినిమాలో ఉన్నాయి . రవి కాకుండా ఏ శోభన్ బాబు వంటి నటుడినో పెట్టుకుని ఉంటే ఆడేదేమో !

ఈ సినిమాలో దర్శకుడు చాలా ప్రయోగాలే చేసారు . కైకగా విజయలలిత , లక్ష్మణుడిగా ప్రసాద్ బాబు వంటివి . సినిమాలో నాగరాజు , జమున ఎలాగూ ఉన్నారు . పాత్రలని మారిస్తే సరిపోయేది . దీనికన్నా నాకు అసలు నచ్చని సీన్ ఏమిటంటే సీతారామ కల్యాణం తర్వాత తొలి రేయి సీన్ . శ్రీరాముడికి లవ్ సీన్లు , ఫస్ట్ నైట్ సీన్లు ప్రేక్షకులకు నచ్చవు .

Ads

జనం దృష్టిలో రాముడు విష్ణువుని మించిన దేవుడు . కృష్ణుడు కొంటెవాడు . ఆయనకు ఎలాంటి సీన్లు ఉన్నా అల్లరి కృష్ణుడు కాబట్టి ఓకే . దీని గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం సరికాదు .

ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవలసింది సత్యనారాయణ రావణుడిగా అద్భుతంగా కనిపించారు . యస్వీఆర్ తర్వాత యస్వీఆర్ అంతటి వాడు . జయప్రద సీతగా చాలా అందంగా , బాగా నటించింది . మహానుభావుడు గుమ్మడి ఎన్ని సినిమాల్లో దశరధుడిగా నటించాడో ! ఈ సినిమాతో సహా .

కౌసల్యగా అంజలీదేవి , సుమిత్రగా ఝాన్సీ , మండోదరిగా బి సరోజాదేవి , శబరిగా జమున , అనసూయగా పండరీబాయి నటించారు . రామాయణం మీద ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కే లేదు . బాహుబలి , RRR , కల్కి వంటి సినిమాల రోజుల్లో కూడా ఆదిపురుషుడు సినిమా వచ్చింది కదా !

జాగ్రత్తగా తీస్తే ఇంకా ఇంకా చూసేందుకు జనం సిధ్ధంగానే ఉన్నారు . హిందీలో జానకిరాముడు అని ఓ మెగా సీరియల్ వచ్చింది . తెలుగులో కూడా ప్రసారం అయింది . ఎంత సూపర్ హిట్టయిందో !

1977 లో వచ్చిన ఈ సీతారామ వనవాసం సినిమాకు సంగీత దర్శకుడు కె వి మహదేవన్ . పాటలు థియేటర్లో శ్రావ్యంగా ఉంటాయి . చిల్లర భావనారాయణ కధను , మాటల్ని వ్రాసారు . జయప్రద అభిమానులు చూడవచ్చు . యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)


పింజల సుబ్బారావు అంతకు ముందు జానపదాలు తీసి నాలుగు డబ్బులు సంపాదించి తర్వాత ఇట్లాంటి పౌరాణిక సినిమాలు తీసి పూర్తిగా నష్టాల పాలై చిత్ర పరిశ్రమకు కూడా దూరమైపోయారు, సినిమాయలో దెబ్బ తిన్న మంచి హిట్లు ఇచ్చిన నిర్మాత, ఈ సినిమాతో పూర్తి గా దెబ్బ తిన్నాడు… ఓ పాఠకుడి వివరణ…)


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అనుకోని అనుకూలతలు – లేకపోతే మధ్యప్రాచ్యం మండిపోయేది!
  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions