Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్ పాట మారింది- ట్యూన్ మారింది…. ఇప్పుడిక ‘హంగ్ రాగం !!

November 27, 2026 by M S R

.

నవ్వు రాలేదు గానీ, కాస్త జాలేసింది… పాపం కేసీయార్ అనీ అనిపించింది… ఆ పార్టీ ఈరోజు తమ అధికారిక నమస్తే తెలంగాణ రెండు పేజీల్లో గుమ్మరించిన పైత్యం… ఈ వ్యాఖ్య కటువుగానే ఉండవచ్చుగాక… కానీ ఆప్ట్… ముందుగా ఆ జాలేసిన వాక్యం, వివరణ చూద్దాం…

‘‘17కు 17 స్థానాలు కారు గెలిస్తేనే తెలంగాణకు లాభం’’… గుడ్, సంకల్పంలో దరిద్రం ఉండొద్దు నిజమే… కానీ ఒకప్పుడు యాదికి ఉందా..? సారు, సర్కారు, కారు, పదహారు అదీ నినాదం… అంటే హైదరాబాద్‌ను ఎవరూ అడగకుండానే పాపం మజ్లిస్ దోస్తులకు ఏదో రాసిచ్చినట్టు, త్యాగం చేసినట్టు బిల్డప్…

Ads

ఐనా జూనియర్ ఒవైసీ కూడా అప్పట్లోనే చెప్పాడు కదా. కారు వాళ్లది, కానీ స్టీరింగ్ మాదే అని… ఇప్పుడు ఆ మజ్లిస్ కాస్త రేవంత్ రెడ్డిని హమారా దోస్త్ అంటోంది కదా… (కాంగ్రెస్‌తో కాదు)… దాంతో ఒవైసీ కూడా కేసీయార్ శతృవు, సారీ, ప్రత్యర్థి అయిపోయాడు హఠాత్తుగా… దాంతో తెలంగాణ లోకసభ సీట్ల నుంచి డిలిట్ కొట్టేసిన హైదరాబాద్ సీటును మళ్లీ యాడ్ చేసుకుంది అర్జెంటుగా…

nt

సంతోషం… వై నాట్ హైదరాబాద్..? ఈ ధోరణి తీసుకుని, నిజంగా నిలబడితే దమ్మున్న పార్టీ అనే అనుకుందాం…. పాపం, జగన్ అనుకోలేదా…? వై నాట్ 175 … వై నాట్ కుప్పం … తీరా జరిగింది ఏమిటి..? గ్రేట్ ఎలెవన్..!

అఫ్‌కోర్స్, ఇప్పుడు లోకేష్ కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు బహుశా, వై నాట్ పులివెందుల… స్థానిక ఎన్నికల్లో అదే ప్రచారం చేసుకున్నారు కదా… నెక్స్ట్ రిజల్ట్ అంటారా..? ఇంకా చాలా టైముంది జనరల్ ఎన్నికలకు..? అప్పటికి రాజెవరో, బంటెవరో…

కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం రేపో మాపో ఎన్నికలు అన్నట్టుగా జ్వరమొచ్చేసింది… అసెంబ్లీలో ఎలాగూ గెలిచేస్తాం, కానీ మనకు ఎంపీ సీట్లు కావాలి, 17కు 17 గెలవాలి, అంతేకాదు, ఢిల్లీలో హంగ్ రావాలి, అప్పుడు మనం చక్రం తిప్పాలె… ఇలా సాగిపోయింది ఓ కల… కేసీయార్ ఏ కలలో ఉన్నాడో, ఏ కళనున్నాడో, ఇవి రాయించుకుంటున్నాడు హఠాత్తుగా…

అసలు డీలిమిటేషన్ పూర్తయితే… బీజేపీ జమిలి మీద కాన్సంట్రేట్ చేస్తుంది… సో, లోకసభ, అసెంబ్లీ రెండూ కలిసే వస్తాయి… ఇంకా దాదాపు మూడేళ్లు… మరి ఇప్పటి నుంచే ఎందుకీ కూతలు, రాతలు..? బీజేపీ, కాంగ్రెస్ మనకెందుకు అంటున్నాడు కేసీయార్ ఈ కథనంలో..? ఉంటాడా ఈ మాట మీద..? నెవ్వర్…

ఒకవేళ బీజేపీకి కొన్ని సీట్లు తక్కువ పడి, హంగ్ వస్తే, అర్జెంటుగా ఢిల్లీలో తేలేది కేసీయారే, అందరికన్నా ముందే అమిత్ షా అడ్డాలో ప్రత్యక్షం అవుతాడు, నో, నో, అంతదాకా ఎందుకు..? వచ్చే ఎన్నికల్లోనే అవగాహనో, పొత్తో, ఒప్పందమో, రహస్యంగా అవయవదానమో…. ఏమో, కవిత అనుమానిస్తున్నట్టు విలీనమో జరగొచ్చు కూడా.,.

ఎలాగూ జాతీయ పార్టీ, దేశవ్యాప్తంగా విస్తరణ భ్రమలన్నీ బద్దలు కొట్టేశారు కదా తెలంగాణ జనం… ఒక్కటంటే ఒక్క సీటైనా మర్యాదకు కూడా ఇవ్వలేదు కదా గత ఎన్నికల్లో… అందుకని ఆ జాతీయ దుకాణం బంద్ పెట్టేసి… ఇక హంగ్ పాట అందుకున్నాడు…

అంటే, బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు… అందరూ కేసీయార్ వంటి కుటుంబ పార్టీలే ఒక్కచోట చేరి, పాతకాలం నాటి ఒక దేవగౌడ, ఒక చంద్రశేఖర్, ఒక గుజ్రాల్ జమానాను తీసుకొచ్చి, ఎవరి స్వార్థపు ఆటను వాళ్లు ఆడుతారట… దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి…! ఇదీ బీఆర్ఎస్ వర్తమాన జాతీయ విధానం… ప్రస్తుతానికి… అందుకే చెప్పింది… 2 పేజీల ‘నయా మానిఫెస్టేషన్’ కథనాలతో నవ్వు కూడా రాలేదు అని..!!

ఐనా కలాం ఎప్పుడూ చెప్పేవాడు కదా… కలలు కనాలని… సేమ్, నేనూ ఒక చంద్రశేఖర్ కాలేనా..? ఒక గుజ్రాల్ కాలేనా..? అని కేసీయార్ కలగంటే తప్పుపట్టాల్సిన పనేమీ లేదులే… ఏమో, గుర్రమెగురావచ్చు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ పాట మారింది- ట్యూన్ మారింది…. ఇప్పుడిక ‘హంగ్ రాగం !!
  • దేవుడా- ఓ మంచి దేవుడా… మాకెందుకయ్యా ఈ ఇండిగోను ఇచ్చావ్
  • మూడుసార్లు దెయ్యాన్ని చూశా! నరక ద్వారాలూ కనిపించాయి !!
  • పెద్ద నంబర్ గేమ్ మళ్లీ ! ఈసారి సినిమాలో చాలా ట్విస్టులు!!
  • అసలు అదొక పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రం
  • గుప్త దానం ‘బహిరంగ’ ప్రచారమైందెలా? ఫోటోలు, వీడియోల వెనుక అసలు కథ!
  • ఇక ఇండియాపై చైనా- పాక్ జాయింట్ ఉపగ్రహ నిఘా!!
  • Miss & Mrs Universe… ఏడేళ్ల కూతురికి తల్లి… ఈసారి విశ్వసుందరి!
  • 26/11 ముంబై ఉగ్రవాద దాడి… ఇది మరో కుట్రకోణం !!
  • ఈ హీరోలతో ఇక పనేంటి బాసూ..! కొత్త ‘హీరో’లు వచ్చేస్తున్నారు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions