.
ఇజ్రాయేల్ Vs హెజ్బొల్లా part 5.
ఇరాన్ ఒత్తిడికి తలవంచింది!
తన స్వంత మనుషులని ఇజ్రాయేల్ కి అప్పచెప్పింది!
వినడానికి ఇబ్బందిగా ఉన్నా వాస్తవం ఇదే!
ఇరాన్ లోని దౌత్య, ఇంటెలిజెన్స్, విద్యా రంగ ప్రముఖులలో ప్రస్తుతం వేడిగా, వాడిగా జరుగుతున్న చర్చ ఏమిటంటే……..
తనని తాను కాపాడుకోవడానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతోల్లా అలీ ఖోమేని హెఙబొల్లా, హమాస్, హుతిలని ఇజ్రాయేల్ కి అప్పచెప్పాడు.
Ads
హెలికాప్టర్ లో పేజర్ పేలి అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం సుప్రీం లీడర్ ఆయుతోల్లా అలీ ఖోమేనిని ఆత్మ రక్షణలో పడేసింది. తన స్వంత మనుషులే మోస్సాద్ తరుపున పని చేశారు అంటే సుప్రీం లీడర్ గా తనకి రక్షణ ఉంటుందా?
ఏమో! తన చుట్టూ ఉండే తన అంగరక్షకులలో ఎవరో ఒకరు మోస్సాద్ కి సహాయం చేయకుండా ఉంటారని ఎలా అనుకుంటాడు?
So! తనని తాను రక్షించుకోవడానికి మూడు దశబ్దాలుగా డబ్బులు, ఆయుధాలు ఇచ్చి పెంచి పోషించిన హెజ్బొల్లా, హమాస్, హుతీలని ఇజ్రాయేల్ కి వదిలేశాడు ఆయుతోల్లా అలీ ఖోమేని!
*******
దాదాపుగా రెండు నెలల క్రితమే తన ముఖ్య అనుచరుడి ద్వారా అమెరికాతో ఒప్పందం చేసుకున్నాడు ఖోమేని! అయితే ఇది అక్టోబర్ 7, 2023 న హమాస్ ఇజ్రాయేల్ మీద దాడి చేసిన తరువాత ఒప్పందం జరిగింది!
అసలు ఇజ్రాయేల్ మీద దాడి విషయంలోనే హమాస్ కి ఖోమేనికి అభిప్రాయ విబేధాలు వచ్చాయి. ఎందుకు?
హమాస్ దాడి చేయడానికి పధకం వేసినపుడు ఖోమేనితో చర్చలు జరిగాయి. ఖోమేని ఇజ్రాయేల్ మీద దాడి చేయడానికి అంగీకరిస్తూ, ఆస్థులు ధ్వంసం చేయాలని, సైనిక, పోలీసు డ్రస్ లో ఉన్నవాళ్ళని మాత్రమే చంపాలని కండిషన్ పెట్టాడు!
ఎందుకంటే సామాన్య ప్రజలని చంపితే ఇజ్రాయేల్ ఎలా రియాక్ట్ అవుతుందో ఖోమేనికి బాగా తెలుసు. అది తిరిగి తిరిగి ఇరాన్ మీద దాడి చేసే వరకు వస్తుందనీ తెలుసు. ఇజ్రాయేల్ కనుక ఇరాన్ మీద దాడి చేస్తే అది తన దేశంలో తిరుగుబాటుకి దారి తీస్తుంది కాబట్టి… ఖోమేని అధికారం కోల్పోతే అది అమెరికాకి, ఇజ్రాయేల్ కి లాభం. ఇస్లామిక్ స్టేట్ అఫ్ ఇరాన్ కాస్తా డెమోక్రాటిక్ రిపబ్లిక్ అఫ్ ఇరాన్ గా మారిపోతుంది. ఇలా జరగడం ఖోమేనికి ఇష్టం లేదు.
కానీ హమాస్ నాయకులు ఖోమేనికి హామీ ఇచ్చి అక్టోబర్ 7, 2023 న ఇజ్రాయేల్ మీద దాడి చేశారు. ఇరాన్ అండగా ఉంటుంది అనే భరోసాతో సామాన్య పౌరులని 1139 మందిని చంపడమే కాకుండా మరో 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఇదే ఖోమేనికి హమాస్, హెజ్బొల్లా, హుతిల మధ్య దూరం పెరగడానికి కారణం అయ్యింది!
తిరిగి ఇరాన్ మీద ఇజ్రాయేల్ దాడి చేయకుండా ఉండడానికి అమెరికాతో ఖోమేని ఒప్పందం చేసుకున్నాడు! హమాస్, హెఙబొల్లా, హుతిలకి ముందు ముందు ఎలాంటి ఆర్ధిక, ఆయుధ సహాయం చేయనని, హమాస్, హెజ్బొల్లా నాయకుల కదలికల గురుంచి సమాచారం ఇస్తాను అనే ఒప్పందం చేసకున్నాడు ఖోమేని!
*******
గత రెండు దశబ్దాలుగా నజరల్లాని మట్టు పెట్టడానికి మోస్సాద్ ప్రయత్నిస్తున్నా ఎందుకు విజయం సాధించలేక పోయింది? వారం క్రితం ఎందుకు సఫలం అయ్యింది మోస్సాద్?
ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ నజరల్లాహ్ కదలికలని మోస్సాద్ కి ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చాడు. ఇరాన్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అహ్మదినెజాద్! Mahmoud Ahmadinejad (2005-2013).
ఈ మాజీ అధ్యక్షుడు బహిరంగంగానే ఒక విషయం ప్రకటించాడు…….. మోస్సాద్ కోసం ఇరాన్ లో ఎవరు ఎవరు పనిచేస్తున్నారో గుర్తించి వాళ్ళని హత్య చేయడానికిగాను కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ని ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ లో మొత్తం 21 మంది పనిచేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ చీఫ్ తో పాటు అందులో పనిచేస్తున్న 20 మంది కూడా మోస్సాద్ కి ఎజెంట్స్ గా మారిపోయారు. ఈ విషయం ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కి కూడా తెలుసు.
ఇంటెలిజెన్స్ చీఫ్ సుప్రీం లీడర్ ఖోమేనికి ఈ విషయం చెప్పకుండా ఉంటాడని నేను అనుకోను. So! ఆయుతోల్లా అలీ ఖోమేని అమెరికాతో రహస్య ఒప్పందం చేసుకొని స్వంత మనుషులని బలి పశువులుగా మారుస్తున్నాడు!
4,000 పౌండ్ల బరువు ఉండే బంకర్ బస్టర్ బాంబులని అప్పటికప్పుడు F-15 ఫైటర్ జెట్ లకి బిగించడం సాధ్యం కాదు. మొత్తం 20 బంకర్ బస్టర్ బాంబులని ప్రయిగించింది IAF. నజరుల్లాహ్ బీరూట్ లోని హెడ్ క్వార్టర్ కి వెళ్ళడానికి రెండు గంటల ముందే ఇరాన్ ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని మోస్సాద్ కి తెలియచేసింది!
నజరుల్లా హెడ్ క్వార్టర్ లోకి చేరుకోవడానికి ఇంకా 10 నిముషాలు పడుతుంది అనగా చివరి అప్డేట్ ఇచ్చింది ఇరాన్. దక్షిణ ఇజ్రాయేల్ నుండీ F-15 లు బీరూట్ చేరుకోవడానికి 6 నిముషాల సమయం చాలు. నజారుల్లా తన బంకర్ లోకి వెళ్ళాడు అక్కడే ఉన్నాడు అన్న మెసేజ్ రాగానే వెంటనే బాంబుల వర్షం కురిపించాయి F-15 లు.
చుట్టూ పలు అంతస్తుల రెసిడెన్షియల్ భవనాలు నాలుగు ఉండగా మధ్యలో 80 అడుగుల లోతులో రీఇన్ఫోర్సెడ్ కాంక్రీట్ తో నిర్మించిన బంకర్ ఉంది. నజరల్లా బాంబుల శబ్దానికి గుండె ఆగి మరణించాడు!
నజరల్లా అక్కడికి రాకముందే లెబనాన్, సిరియా, యేమెన్ లకి చెందిన కమాండర్లు 15 మంది ఉన్నారు. అందరూ చనిపోయారు. అంటే లెబనాన్, సిరియా, యెమెన్ లలో తమ దళాలని ముందు ఉండి నడిపించే కమాండర్లు అందరూ చనిపోయారు!
*******
నజరుల్లా చనిపోయాక ఇరాన్ ప్రతీకార దాడి చేయాలని హెజ్బొల్లా, హమాస్, హుతీ ల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చింది ఖోమేని మీద! కానీ ఖోమేని ఎలాంటి తీవ్ర ప్రతీకార దాడికి దిగలేదు వెంటనే! రహస్య ఒప్పందం జరిగింది అని తెలుసుకోవడానికి కొన్ని బలమైన ఋజువులు ఉన్నాయి!
1.అక్టోబర్ 7, 2023 న హమాస్ దాడి చేసి సాధారణ ఇజ్రాయేల్ పౌరులని చంపి 250 మందిని బందీలుగా తీసుకెళ్లినా ఇజ్రాయేల్ ఇరాన్ మీద దాడిచేయలేదు!
2. మధ్యదరా సముద్రంలో హుతీల కోసం ఆయుధాలు తీసుకొస్తున్న రెండు బోట్లు మాయం అయ్యాయి కానీ వాటిల్లో ఆయుధాలు లేవు. బోట్లు మాయం అవుతున్నాయి కాబట్టి మేము ఇక సముద్రమార్గం ద్వారా ఆయుధాలు సరఫరా చేయలేము అంటూ ఇరాన్ బుకాయించింది! నిజానికి ఇరాన్ నుండీ ఇద్దరు ఇంజినీర్లు ఆ బోట్లలో కొద్దిగా ఆయుధాల విడిబాగాలతో ప్రయాణించారు ఇంతవరకు నిజం. మధ్యదరా సముద్రంలో అమెరికన్ నావీ వాటిని ముంచేసింది!
*****
ప్రెజర్ పాయింట్!
నజరల్లా చనిపోయిన తరువాత ఉత్తర లెబనాన్, సిరియాలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు! గత రెండు దశబ్దాలుగా సిరియాలో హెజ్బొల్లా అక్కడి సున్నీ తెగ ముస్లిమ్స్ మీద దాడులు చేస్తూ వస్తున్నది. నజరుల్లా మరణ వార్త విని లేబనాన్, సిరియాలోని సున్నీ ముస్లిమ్స్ వీధులలోకి వచ్చి స్వీట్స్ పంచారు బహిరంగంగా!
ఇది హెజ్బొల్లా ఫైటర్స్ కి అవమానంగా అనిపించింది! మీరు దాడులు చేస్తారా లేక మేమే ఇజ్రాయేల్ లోకి వెళ్లి యూదులతో యుద్ధమ్ చేస్తాము అని ఇరాన్ ని హెచ్చరించారు! యెమెన్ లోని హుతీలు కూడా ఇరాన్ కి ఎదురుతిరిగే ప్రమాదం ఉంది అని తెలుసుకున్న ఖోమేని తీవ్ర ఒత్తిడికి లోనయ్యి ఇజ్రాయేల్ మీద దాడులకి ఆదేశాలు ఇచ్చాడు!
ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ నుండి కూడా ఒత్తిడి వచ్చింది! హెజ్బొల్లాకి సహాయం ఆపేస్తే అది నేరుగా సిరియా మీద ప్రభావం పడుతుంది! పుతిన్ కి సిరియా అవసరం ఎంత ఉందో సిరియాకి పుతిన్ అవసరం అంతే ఉంది! మధ్యదరా సముద్రంలో పుతిన్ కి ఉన్న నావీకి అండగా సిరియా లోని రష్యన్ ఎయిర్ బేస్ లు ఉన్నాయి.
ఒకవేళ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ బలహీనపడితే సిరియా అమెరికా, ఇజ్రాయేల్ నీడలోకి వెళ్ళిపోతుంది! ఖోమేని అన్ని వైపుల నుండీ వస్తున్న ఒత్తిడికి తలవొగ్గి ఇజ్రాయేల్ మీద దాడికి ఆదేశాలు ఇచ్చాడు! . Contd.. Part 6…… (పొట్లూరి పార్థసారథి)
Share this Article