సోనియా చేసిన తప్పు ఏమిటంటే..? బిగ్‌బాస్ ఆడే గేమ్ ఫెయిర్‌గా ఉంటుందని భ్రమపడటం..! అది టీఆర్పీలు, రెవిన్యూ కోసం సాగే వికృత క్రీడ… వాడే గొడవలు క్రియేట్ చేస్తాడు, జనాభిప్రాయంతో లింకేమీ ఉండదు, ఎవరిని చెడుగా ప్రొజెక్ట్ చేయాలో చేస్తాడు, ఫలానా వాళ్లతో లవ్ ట్రాక్ నడపాలని ఆదేశిస్తాడు… ఎవరిని నెత్తిన మోయాలో మోస్తాడు… అన్నీ ముందస్తు ఒప్పందాలు, పక్కా స్క్రిప్టెడ్ షో…
ఈసారి టవ్ ట్రాకులు, బూతులతో షోను పెంట పెంట చేయాలని ఫిక్సయ్యారు… అందుకే మొదట 14 మందినీ జంటలుగా పంపించారు… కానీ అక్కడేమీ ఎవరూ లవ్వుల్లో పడిపోలేదు… ఇక సోనియాను టార్గెట్ చేశారు, పృథ్వితో, నిఖిల్‌తో ఏదో జరుగుతోందని జనం భ్రమపడేట్టుగా ఫీడ్ ఎడిట్ చేశారు… చివరకు ఇంటర్వ్యూ కళ వీసమెత్తు లేని అర్జున్‌తో బిగ్‌బాస్ బజ్‌లో కూడా పిచ్చి ప్రశ్నలు వేయించి, అవీ ఎడిట్ చేసి ప్రసారం చేశారు…
ఇప్పుడు సోనియా మండిపడితే ఎలా…? హౌజులోకి వెళ్లడమే తప్పు… వెళ్లాక ఆ మురికిలో దిగకతప్పదు, వాడు చెప్పిందే చేయకతప్పదు, వాడేం బయటికి చూపిస్తున్నాడో లోపలున్నవాళ్లకూ తెలియదు… బిగ్‌బాస్ మేనేజ్డ్ సోషల్ సైట్స్, చానెల్స్, టీమ్స్ ఉంటాయి కొన్ని, వాడేది కోరుకుంటే అదే రాస్తారు, తనెవరిని టార్గెట్ చేస్తారో అలాగే టార్గెట్ చేసి రాస్తుంటారు… చూపిస్తుంటారు… సోనియా దానికి బలైంది… బయటికి వచ్చాక ఇక బిగ్‌బాస్ మీద తను ఏం చెప్పినా, ఏం ఆరోపణలు చేసినా దానికి విలువ ఉండదు, అది సోనియా మరిచిపోయింది…
Ads
నిన్న కూడా నిఖిల్‌ను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి ఏదేదో అడుగుతూ, బయటికి వెళ్లినవారిలో ఎవరు ఇష్టం అంటూ ఎవరినీ అడగని ప్రశ్న వేసి గెలకాలని ట్రై చేశాడు బిగ్‌బాస్… నిఖిల్ చాలా కూల్‌గా, హుందాగా సమాధానం ఇచ్చాడు, సోనియా అంటే ఎందుకు ఇష్టమో చెప్పాడు… అసలక్కడ ఊహించిన బూతు, లవ్వులు, కిస్సులు, హగ్గులు గట్రా వర్కవుట్ కావడం లేదని ఇక పృథ్వికి విష్ణుప్రియకు నడుమ ఏదో ఆదేశించాడు… విష్ణు ఒకటి చెబితే పది చేసే తత్వం కదా…
పోయి పోయి నైనిక, సీతలతో ఎవరికీ సెట్ కాదు, సో మెల్లిగా యష్మిని కూడా పృథ్వికి అటాచ్ చేయడం మొదలుపెట్టాడు బిగ్‌బాస్… ఆమె తింగరి కదా… బిగ్‌బాస్ ఏదో చెబితే ఈమె ఇంకేదో చేస్తుంది… మణికంఠకు హౌజులో నేనున్నాను అని మొదలుపెట్టింది… అందరూ మెంటల్ అంటారు తనను… నామినేషన్లలో పెడుతుంటారు, ఇదే యష్మి మణికంఠను ప్రతిసారీ నామినేట్ చేస్తాను అని చెప్పిందే… ఇప్పుడేమో నీ నవ్వుకే మొదట పడిపోయాను, కానీ నీకు పెళ్లాం బిడ్డ ఉన్నారని తెలిసి వదిలేశాను అంటుంది… పక్కా మెంటల్… కొసమెరుపు ఏమిటంటే… లవ్వు మన్నూమశానం అంది కదా యష్మి తీరా మణికంఠ పెళ్లాం ఏదో డిష్, మెసేజ్ పంపించిందీ అంటే, దాన్ని వదిలేసి షాక్ ఇచ్చింది… సేమ్, మణికంఠ కూడా యష్మి డిష్, మెసేజ్ వదిలేసి రివెంజ్ తీర్చుకున్నాడు…
ఒకవైపు నేను నా పెళ్లాం కోసమే హౌజుకు వచ్చాను, నేను గెలిస్తే బిడ్డ, పెళ్లాం మళ్లీ నా దగ్గరకు వస్తారు అని మణికంఠ మొత్తుకుంటుంటే… నేను నీకు ఉన్నాను అనే రాగాలు ఏమిటో బిగ్‌బాస్‌కు తెలియాలి, యష్మికి తెలియాలి… మణికంఠ జోస్యాల ఎపిసోడ్‌లోనూ కంటెస్టెంట్లతో అవే ప్రశ్నలు వేయించారు… వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఎవరితోనైనా లంకె కుదురుతుందా అని..! గంగవ్వ ఓల్డేజ్, రోహిణితో ఎవరికీ సెట్ కాదు, హరితేజకు పెళ్లయింది, సంతానం… నయని పావని, గౌతమ్ కృష్ణ ఏమో మరి… ప్చ్, బిగ్‌బాస్ ఎంత రొమాంటిక్ కంటెంట్ ఆశించినా వర్కవుట్ కావడం లేదు… అవి లేకపోతే టీఆర్పీలు ఎలా అనేది వాడి బాధ… దానికి తగ్గట్టే గత సీజన్‌లాగే ఈసారి కూడా దరిద్రపు టీఆర్పీలు నమోదవుతున్నాయి…
మెహబూబ్ వస్తున్నాడు కదా… నబీల్ కు దోస్త్… ఎవరికి పులిహోర కలిపిస్తాడో బిగ్ బాస్… చూడాలి…
Share this Article