ప్రదీప్ గుప్తా ఏడ్చేసిన ఈ రోజు గుర్తుందా..? – ఈ సాయంత్రం హర్యానా జమ్మూ & కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్
Axis My India విశ్వసనీయమైన సంస్థ. మొత్తం 74 ఎన్నికల్లో 69 అంచనాలు నిజమయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆంధ్రాలో టీడీపీ కూటమి 21-23 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు . కానీ NDA కూటమికి 361- 401వస్తాయని చెప్పింది , వాస్తవంలో బీజేపీకి 240 సీట్లు, NDA కూటమికి 293 మాత్రమే వచ్చాయి.
కౌంటింగ్ రోజు India Today డిబేట్ లో రాజ్ దీప్ సర్దేశాయ్ దీని మీద Axis My India సీఈవో ప్రదీప్ గుప్తాను గుచ్చి గుచ్చి అడిగాడు, ప్రదీప్ ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చేశాడు . ఒక విధంగా రాజ్ దీప్ సర్దేశాయ్ professional jealousy తోనే ప్రదీప్ ను ఏడిపించాడు. డిబేట్లో చూపవలసిన బాలన్స్ ను రాజ్ దీప్ సర్దేశాయ్ చూపలేదు.
Ads
తదనంతర పరిణామాలతో Axis My India సీఈవో ప్రదీప్ గుప్తా తొమ్మిదేళ్లుగా ఇండియా టుడేతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాడు. ఈ సాయంత్రం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను కొత్తగా ప్రారంభించిన “Red Mike” అనే యూట్యూబ్ ఛానల్‌లో వెల్లడిస్తానని ప్రకటించారు.
సెఫాలజిస్టులు , సర్వే సంస్థల అంచనాలు నిజం కావొచ్చు లేక కొన్నిసార్లు తప్చొచ్చు కానీ Axis My India మరియు C Voter మాత్రమే 365 రోజులు ఏదో ఒక సర్వే చేస్తూ ఉంటాయి. సైన్టిఫిక్ గా అంచనాలు వేస్తాయి. జ్యోతిష్యం సెఫాలజి ఒకటి కాదు .. నేను చెప్పింది జరిగింది అనేది జ్యోతిష్యం.. దాన్ని నమ్మి ఏ పార్టీ పెట్టుబడి పెట్టదు .
సెఫాలజిని వందల కోట్ల ఇండస్ట్రీ గా మార్చిన ప్రశాంత్ కిషోర్ ను ఇకపై రాజకీయ నాయకుడిగానే చూడాలి, సెఫాలజిస్ట్ గా ఆయన ప్రయాణం ముగిసినట్లే. సునీల్ కనుగోలు టీం గ్రౌండ్ వర్క్ బాగుంటుంది, వాళ్ళు సర్వేల మీద కన్నా పార్టీ గెలుపు కోసం ఏమి చేయాలి అనే దాని మీదనే ఎక్కువ దృష్టి పెడతారు. ఇలాంటి పనిచేయగల సంస్థలు చాలా తక్కువ కానీ వీరిదే భవిషత్తు… (శివ రాచర్ల)
Share this Article