చామకూర మల్లారెడ్డి, తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరూ చంద్రబాబును కలిశారు… తోడుగా తీగల కృష్ణారెడ్డి ఉన్నాడు… కలిసొచ్చాక తాను టీడీపీలో చేరబోతున్నాననీ, పూర్వ వైభవం తీసుకొస్తాననీ తీగల చెప్పాడు… కానీ మల్లారెడ్డి మాత్రం అబ్బే, మా ఇంట్లో పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికి మాత్రమే కలిశానని చెప్పాడు…
బయటికి ఏం చెప్పినా సరే… ఇదొక ఆసక్తికరమైన చర్చ… ఒరేయ్ రేవంతూ, గూట్లే, బట్టెబాజ్, సాలే వంటి తిట్లతో మూడేళ్ల క్రితం ఇదే మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి తొడగొట్టి సవాళ్లు విసిరారు… సీన్ కట్ చేస్తే రేవంత్ సీఎం అయ్యాడు… ఇక మల్లారెడ్డి అక్రమాల వేట స్టార్టయింది… అబ్బే, రేవంత్ మనవాడే అని ప్లేటు ఫిరాయించాడు మల్లారెడ్డి (ఫిరాయింపులు తనకు అలవాటే)… బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పట్లో బాగుపడేది లేదని ఫిక్సయ్యాడు…
కబ్జాలు, అక్రమార్జనల నుంచి రక్షణకు రేవంత్ రెడ్డి శిబిరంలో చేరడమే బెటర్ అనుకున్నాడు… పైగా కాంగ్రెస్‌కు పొలిటికల్ అవసరం… హైదరాబాదులో బీఆర్ఎస్ బలం తగ్గించడం, ఓవరాల్‌గా బీఆర్ఎస్‌ను ఇంకా తొక్కడం కాంగ్రెస్ అవసరం… అక్కడే రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేశాడు… అక్రమాల్ని గుర్తించడం, బుల్ డోజర్లు నడిపించడం మొదలైంది… తరువాత కన్నడ డిప్యూటీ సీఎం డీకే దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నాడు… అటునుంచి నరుక్కురావాలని అనుకున్నాడు…
Ads
ఏమైందో, డీకే ఏం చెప్పాడో గానీ మల్లారెడ్డిని వేటాడే విషయంలో రేవంత్ రెడ్డి ప్రజెంట్ హైడ్రాలాగే చల్లబడ్డాడు… ఐనా సరే, మల్లారెడ్డి స్థిమితంగా లేడు… అందుకే టీడీపీ వైపు చూస్తున్నాడు… పాత కాపే… తెలంగాణలో మళ్లీ జెండా ఎగరేయాలనుకుంటున్న చంద్రబాబుకు ఇలాంటోళ్లే అవసరం… చేరదీస్తున్నాడు… కానీ ఎప్పుడైతే చంద్రబాబు తన యాక్టివిటీ ఎక్కువ చేస్తాడో అది బీఆర్ఎస్ నెత్తిన పాలుపోసినట్టే… చంద్రబాబు పడగ నీడను ఇకపై తెలంగాణ సహించదు…
పునర్వైభవం వంటి తీగల మాటలు ఉత్త భ్రమలు… హైదరాబాద్ ఉజ్వల అభివృద్ధి చంద్రబాబు ఘనతే అంటున్నాడు కదా, మరిన్నాళ్లు టీడీపీని ఎందుకు వదిలేసినట్టు..? ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు దాస్యం దేనికి..? నిజానికి మల్లారెడ్డి వంటి అక్రమార్కులు ఫస్ట్ ఆలోచించేది ఏమిటంటే, బీజేపీలో చేరి ప్రొటెక్షన్ కోరుకోవడం…! ఈటల అడ్డుపడ్డాడో లేక మల్లారెడ్డికే ఇష్టం లేదో గానీ బీజేపీ వైపు పోలేదు… ఇప్పుడు అసలు చర్చ ఏమిటంటే..?
ఎప్పుడైతే మల్లారెడ్డి టీడీపీలో చేరతాడో ఇక డీకే రక్షణ కూడా మాయం అయిపోతుంది… రేవంత్ రెడ్డి వేట మళ్లీ మొదలవుతుంది… శిష్యా, రేవంతూ, మా మల్లారెడ్డిని వదిలెయ్ అని చంద్రబాబు చెబుతాడా..? చెబితే రేవంత్ వింటాడా..? ఒక పరిమితి మేరకే గురుశిష్యుల బంధం, ఆబ్లిగేషన్… ఎలాగూ చంద్రబాబు బీజేపీ క్యాంపు, దానికి పూర్తి విరుద్ధమైన క్యాంపు రేవంత్… అన్నిచోట్లా సయోధ్య కుదరదు… రేవంత్ ఎప్పుడైనా సరే తన పొలిటికల్ లిమిటేషన్స్, నీడ్స్ కోణంలోనే కదలకతప్పదు… దానికి తన గురువే అడ్డుపడితే గురువుతోనూ పోరు తప్పదు… బహుశా మల్లారెడ్డి ఇవన్నీ ఆలోచించి ఉండడు… తీగల కథ వేరు… మల్లారెడ్డి కథ వేరు… కలగలపొద్దు..!!
Share this Article