1) మన దేశంలో ఎగ్జిట్ పోల్స్ ఏమాత్రం జనం నాడిని అంచనా వేయలేకపోతున్నాయి… శాస్త్రీయత లేదు… ఊకదంపుడు లెక్కలు పేర్చడం తప్ప మరొకటి కాదు… హర్యానా ఫలితాలు మరోసారి తేల్చిచెప్పిన నిజం…
2) దేశంలో కాంగ్రెస్ పుంజుకుంటున్నది అనేది ఓ అబద్ధం… గత లోకసభ ఎన్నికల్లో యాంటీ బీజేపీ వోట్లు చీలకుండా జాగ్రత్తపడ్డారు కాబట్టి ఆమాత్రం ఫలితాలు వచ్చాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పుంజుకోలేదు, దేశప్రజానీకానికి రాహుల్ గాంధీ నాయకత్వం మీద ఇంట్రస్టు లేదు…
3) పొద్దున జిలేబీలు పంచుకున్నారు, తీరా తరువాత బీజేపీ లీడ్‌లోకి వచ్చి, స్పష్టమైన మెజారిటీ వచ్చాక… ఏం చెప్పుకోవాలో అర్థం కాక, ఓటమి అంగీకరించలేక ఎన్నికల కమిషన్ మీద ఎప్పటిలాగే ఏడ్చింది కాంగ్రెస్… తరువాత మళ్లీ ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయనే పాత శుష్క వాదనను తలకెత్తుకుంది…
Ads
4) నిజంగానే బీజేపీకి ఈవీఎంలు ట్యాంపర్ చేయడం చేతనైతే జమ్ము కశ్మీర్‌లో చేసుకోలేకపోయిందా..? సో, ఈవీఎంల మీద తప్పులు నెట్టేయడం మళ్లీ మళ్లీ కాంగ్రెస్, ఇతర విపక్షాలు కొనసాగిస్తున్న మూర్ఖత్వ పోకడ…
5) జమ్ము కశ్మీర్‌లో కూడా నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్ అలయెన్స్ యాంటీ బీజేపీ వోటు చీలిపోకుండా జాగ్రత్తపడినందువల్లే ఆ గెలుపు… అచ్చంగా అది నేషనల్ కాంగ్రెస్ గెలుపు… దాని తోకగా వ్యవహరించడం తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదు…
6) హెజ్‌బుల్లా చీఫ్ హత్యకు నిరసనగా ఓరోజు ప్రచారం బంద్ పెట్టిన పీడీపీని జనం అడ్డంగా తిరస్కరించారు… ఆ పార్టీకి ఈరోజుకూ ఉగ్రవాద సమర్థన తప్ప వేరే సిద్ధాంతం లేదు… చివరకు ముఫ్తి మెహబూబా బిడ్డ కూడా ఓడిపోయింది…
7) మరీ ప్రాంతీయ, ఉప-ప్రాంతీయ పోకడలతో… వారసత్వపు ధోరణులతో నడిపించిన ఓం చౌతాలా పార్టీ ఐఎన్‌ఎల్‌డీని జనం తిరస్కరించారు… దాని పిల్ల పార్టీ దుష్యంత్ చౌతాలా పార్టీ జేజేపీని కూడా జనం తొక్కిపడేశారు… గుడ్…
8) రెండు టరమ్స్ అధికారంలో ఉన్నా సరే, బీజేపీ మీద హర్యానాలో యాంటీ ఇంకంబెన్సీ ప్రభావం లేదు… పైగా గతంలోకన్నా సీట్లు ఎక్కువ గెలుచుకుంది… ఇది చెప్పుకోదగిన విశేషం…
9) అన్నింటికీ మించి మన ప్రజాస్వామ్యానికి ఊరట ఆప్ ఓటమి… ఖలిస్థానీ వేర్పాటువాదానికి మద్దతుగా ఉన్న ఆప్ ఓటమి ఓ శుభసంకేతం… నేను ఆడే ప్రతి ఆటా జనాన్ని మభ్యపెట్టగలదు, నన్ను గెలిపించగలదు అనుకున్న మద్యం స్కామ్ దళారి కేజ్రీవాల్ సీఎం రాజీనామా నాటకాన్ని జనం అడ్డంగా ఛీకొట్టారు…
10) వినేశ్ ఫోగట్ ఒలింపిక్స్ అనర్హతకు మోడీయే వెయింగ్ మెషిన్ మీద రహస్యంగా కాలు పెట్టి కుట్ర చేశాడన్నట్టుగా దేశమంతా సోకాల్డ్ యాంటీ మోడీ ప్రాపగాండిస్టులు ప్రచారం చేశారు కదా, ఆమె కాంగ్రెస్ అనుకూల ధోరణితో, అనర్హతపై సానుభూతి చెప్పాలనుకున్నా సరే మోడీ కాల్ రిసీవ్ చేసుకోలేదు కదా… కాంగ్రెస్‌లో చేరి పోటీచేసింది కదా… తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొని ఎట్టకేలకు 6 వేల మెజారిటీతో గట్టెక్కింది… జనం ఆమె మాటల్ని పెద్దగా విశ్వాసంలోకి తీసుకోలేదు… పైగా నిజం గెలిచిందని వ్యాఖ్య… ఏ నిజం గెలిచింది తల్లీ..?
11) జమ్ములో బీజేపీ ప్రాబల్యం కొనసాగింది… కశ్మీర్‌లో నేషనల్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను చూపించింది… ఒమర్ అబ్దుల్లా సీఎం కాబోతున్నాడు… నిజం చెప్పాలంటే,.. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ అధికారాలే పరిమితం… ఢిల్లీ, పాండిచ్చేరిలో తరహాలో అరకొర అధికారాలే… కీలకమైన అధికారాలన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీవే…
12) బీజేపీ ఈమాత్రం, అంటే ఈ 29 సీట్లను కూడా అంచనా వేయలేదు నిజానికి… నేషనల్ కాంగ్రెస్‌ను మినహాయిస్తే అక్కడ బీజేపీయే సొంతంగా రెండో స్థానంలోకి వచ్చేసింది… పీడీపీని తొక్కేసి…!!
13) కిస్త్‌వార్ అని ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం… అక్కడ షగున్ పరిహార్ అనే మహిళకు బీజేపీ టికెట్టు ఇచ్చింది… ఆమె తండ్రిని, అంకుల్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు… ఆమె నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచింది… జనం ఉగ్రవాదాన్ని తిరస్కరించిన ఓ సంకేతం…
14) సిక్స్ గ్యారంటీలు, సెవెన్ గ్యారంటీలు అంటూ జనం కళ్లకు మాయగంతలు కట్టేసి, ప్రలోభపెట్టేస్తే కర్నాటక, తెలంగాణల్లోలాగే హర్యానాలోనూ గెలుస్తాం అనుకున్న కాంగ్రెస్ పిచ్చి భ్రమల్ని జనం బద్దలు కొట్టారు… కర్నాటకలో బీజేపీ తిరస్కార వోటు, తెలంగాణలో కేసీయార్ తిరస్కార వోటుతో గెలిచామనే నిజాల్ని మరిచిపోయింది కాంగ్రెస్… ఎలాగైతేనేం… ఇకపై ప్రతి పార్టీ జనాకర్షక హామీలపై దూకుడుగా వెళ్లకుండా దేశాన్ని కాపాడినట్టయింది..!!
Share this Article