సాయంత్రం ఏడు గంటలకే మొదలుపెట్టి… ఓ మారథాన్ ఇన్నింగ్స్‌లాగా గంటల తరబడీ దసరా స్పెషల్ బిగ్‌బాస్ వీకెండ్ నడిపారు నిన్న… ఏదో పూలచొక్కా ప్లస్ లుంగీ కమ్ ధోతి కట్టుకుని వచ్చాడు సోగ్గాడు నాగార్జున… రావడం గ్రూపు డాన్సర్లతో…
ఫుల్లు ఖర్చు, మసాలాలు దట్టించి… ఫన్ ప్రధానంగా ఈ ఎపిసోడ్ నడపటానికి ట్రై చేశారు నిర్వాహకులు… కానీ కొత్తదనం లేదు, ఏమాత్రం ఆసక్తి కలిగించలేదు, షో రక్తికట్టలేదు… ఎవరిదో (అమృత..?) దాండియా అన్నాడు… మళ్లీ మళ్లీ దాన్ని దాండియా అన్నారంటే నార్త్ వాళ్లు బిగ్‌బాస్ హౌజ్ మీద దాడి చేసి సెట్ మొత్తం పీకి పందిరేసే ప్రమాదం ఉంది…
డింపుల్, ఫరియాల డాన్సులు, స్టెప్పులు, ఏవో పిచ్చి పాటలు, గ్రూపు డాన్సులు… అస్సలు బాగా లేవు… మధ్యలో గోపీచంద్, శ్రీను వైట్ల వచ్చారు… విశ్వం సినిమా ప్రమోషన్ల కోసం… సహజంగానే ఓ ట్రెయిలర్ వేస్తారు కదా, వేశారు… మధ్యలో మంగ్లీ వచ్చింది… నాలుగు పాటలు పాడింది… బ్యాక్ గ్రౌండ్‌లో మళ్లీ గ్రూప్ డాన్సర్లు…
Ads
తను హౌజులోకి వెళ్లేటప్పుడు కూడా గ్రూపు డాన్సర్లు… అంటే మొత్తం షోలో ఆరేడేసార్లు గ్రూప్ డాన్సర్లు… ఏదో ఈటీవీ వాడి ఢీ షో చూస్తున్నట్టు అనిపించింది… దసరా స్పెషల్ కదా, వీలైనంతవరకూ కంటెస్టెంట్లను ఆడిస్తూ ఫన్ జనరేట్ చేయడానికి ప్రయత్నించారు… నాలుగైదు ఆటలు… పర్లేదు… కాకపోతే ఒకటే తరీఖ… పాటలు వినిపించి, అది గుర్తొచ్చే ఏదో వస్తువు పట్టుకురమ్మనడం… ఆడాళ్లను మగాళ్లు ఎత్తుకుని లెటర్స్ తీసుకురావడం, రిస్ట్ పవర్ చూపించడం వంటి ఏవో సోది గేమ్స్…
కానీ ఏమాటకామాట… అవినాష్, రోహిణి వచ్చాక షోలో ఎంటర్‌టెయిన్‌మెంట్ పెరిగింది… ఫుల్ యాక్టివ్ వాళ్లు… కాస్త హరితేజ కూడా వోకే… ఎటొచ్చీ మెహబూబ్ ఎవరితోనూ పెద్దగా మింగిల్ కాడు, వీక్… గేముల్లో వోకే… నబీల్ ఫస్ట్ నుంచీ అంతే… ఈసారి విన్నర్ అనే రేంజులో ఫోకసైన నిఖిల్ హఠాత్తుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీల రాకతో బాగా చల్లబడిపోయాడు… నిన్న హోటల్ టాస్కులో ఇరగదీసిన యష్మి కూడా దసరా స్పెషల్‌లో ఉనికే లేనట్టుగా ఇనాక్టివ్ అయిపోయింది…
సరే, గంగవ్వకు పరిమితులున్నాయి… కానీ బతుకమ్మ పేర్చడం పోటీలో ఆమే నెగ్గింది… సహజం… ఆమె ఎన్నో ఏళ్లుగా బతుకమ్మను పేరుస్తుంది, పూజిస్తుంది… ఆమెకు బతుకమ్మను పేర్చడం నీళ్లు తాగినంత ఈజీ… మిగిలినవాళ్లలో కొందరు కన్నడ, కొందరు ఆంధ్రా… బతుకమ్మతో టచ్ లేదు… సో, మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీల తరువాత బిగ్‌బాస్ పాత ముఖచిత్రం వేగంగా మారిపోయింది…
తింగరి బుచ్చి మాటలతో విసుగెత్తించే నత్తి బుర్ర విష్ణు పాటలు-వస్తువుల పోటీలో ఊహించనంత వేగాన్ని కనబరిచింది… ఈ దసరా స్పెషల్‌లో బాగా ఫోకసైన కంటెస్టెంట్ ఆమే… కాకపోతే హఠాత్తుగా రెండేసి మార్కులు అని చివరలో ట్విస్టు ఇచ్చి విష్ణును డౌన్ చేసి, మెహబూబ్ టీమ్‌ను ఎందుకు గెలిపించారో బిగ్‌బాస్‌కే తెలియాలి… ఇంత సుదీర్ఘమైన ఎపిసోడ్‌కు ఎన్ని రేటింగ్స్ వస్తాయో చూడాలిక..!! (ఎందుకంటే..? 50 రోజులు అవుతున్నా సరే, షోకు ఆశించినంత రేటింగ్స్ రావడం లేదు…)
.
అన్నట్టు… నబీల్ గుడ్… ఏదైనా కోరుకో అని బిగ్ బాస్ ఓ ఆఫర్ ఇచ్చినప్పుడు… ఇమ్మ్యూనిటి కోరుకోలేదు… హౌజ్ లో అందరికీ సరిపడా ఫుడ్ కావాలన్నాడు… నాగ్ ఎంత టెంప్ట్ చేసినా సరే…
Share this Article