8 మంది పాతవాళ్లు హౌజులో ఉంటే మరో 8 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌజులోకి జొప్పించారు కదా… వాళ్లూ పాత కాపులే… ఈ ఎంట్రీలను రీలోడ్ పేరిట ఆరో తేదీన స్పెషల్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు… మూడూమూడున్నర గంటల ఎపిసోడ్.,. ఐతేనేం..? రేటింగుల్లో తుస్సు… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఆరు రేటింగులలోపే… శనివారం వీకెండ్ షో రేటింగ్స్ ఐదులోపు… మిగతా రోజుల్లో 3.5 నుంచి 4 వరకు… దసరా స్పెషల్ కూడా హంగామా చేశారు మొన్న… ఆ రేటింగ్స్ ఎలా వస్తాయో చూడాలి…
అవును, ముంబై టీమ్స్ దింపినా… పాత కాపుల్ని ప్రవేశపెట్టినా… ఎంత ఖర్చు పెడుతున్నా… ఎంత అట్టహాసం ప్రదర్శిస్తున్నా… బిగ్‌బాస్ పట్ల ప్రేక్షకుల ఆదరణ పెరగడం లేదు… రేటింగ్స్ రావడం లేదు… గత సీజన్‌లాగే ఫ్లాప్ సూచనలు కనిపిస్తున్నాయి…
కర్ణుడి చావుకు అనేక కారణాలున్నట్టు… సరైన కంటెస్టెంట్ల ఎంపిక లేకపోవడం ఒక ప్రధాన కారణం కాగా… మొక్కుబడిగా, ఏ క్రియేటివిటీ లేకుండా అవే పాత గేమ్స్, అవే పాత టాస్కులు… రొటీన్… సగటు స్టార్ హీరో తెలుగు రొడ్డకొట్టుడు సినిమాలాగా మారిపోయింది…
Ads
పోనీ, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలనైనా సరిగ్గా ఎంపిక చేసుకున్నారా అంటే… నయని పావని మరో మణికంఠ అయిపోయింది… ఊరకే ఏడుస్తుంది… ప్రేరణను టార్గెట్ చేసిన బ్యాచులో చేరి పిచ్చి వాదనలు చేస్తుంటుంది… హోప్ లెస్… మెహబూబ్ కమ్యూనిటీ వోటింగు చర్చకు తెరలేపిన సంగతి తెలిసిందే…
గౌతమ్ కృష్ణ మరో తిక్క కేసు… అరుస్తాడు, వాదనలో పాయింట్స్ ఉండవు, ఆవేశం… ఇది మరీ హోప్ లెస్ కేసు… ఆమధ్య మైక్ విసిరేసి బదనాం అయ్యాడు కదా… నిన్న ఏదో టాస్కులో అరుస్తూ నేను హౌజ్ నుంచి వెళ్లిపోతా అని అరుస్తున్నాడు… ఉన్నంతలో అవినాష్, రోహిణి బెటర్… ఆట మీదే గాకుండా ఫన్, ఎంటర్‌టెయిన్‌మెంట్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు… వాళ్లతో పోలిస్తే హరితేజ పూర్… గంగవ్వకు పరిమితులున్నాయి కాబట్టి ఆమె మీద విశ్లేషణ అనవసరం… ఆమె ఈ హౌజులో ఫిట్ కాదు, ఎందుకు తెచ్చారో ఎవరికీ తెలియదు…
అప్పుడెలా హరితేజ పాపులర్ అయ్యిందో తెలియదు గానీ… ఈసారి మాత్రం పెద్దగా ఆకట్టుకోవడం లేదు… ఆ పాత హరికథలాంటిదే మణికంఠకు వినిపించి ఓ చార్జింగ్ పాయింట్ కొట్టేసింది గానీ… ఆ కథలో పంచ్ లేదు, రక్తికట్టలేదు… వోట్లు కూడా దయనీయంగా ఉన్నాయి ఆమెకు… నిజానికి మణికంఠ మొదట్లో పిచ్చిపిచ్చిగా చేసినా ఇప్పుడు మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నాడు… అవినాష్ టీం ఎంత టెంప్ట్ చేసినా సరే, నా కాన్షియస్ అంగీకరించదు, నా క్లాన్‌కు మోసం చేయలేను… అని కోవర్టుగా మారడానికి ససేమిరా అని మార్కులు కొట్టేశాడు…
గతంలో ఇలాంటి టాస్కులోనే దివిని లోపలకు బంధించి మార్కులు కొట్టేసినట్టే… ఈసారి యష్మిని అలాగే లోపల బంధించి నిర్బంధంగా తన బ్యాటరీని దోపిడీ చేశారు… చెత్త టాస్క్… వాడి బొంద టాస్క్…
మొత్తంగా నిఖిల్ మాత్రమే స్థిరంగా, కూల్‌గా, దూకుడుగా తనదైన స్ట్రాటజీతో వెళ్తున్నాడు… మొన్న గౌతమ్ కృష్ణ ఎత్తి సోఫా మీదకు విసిరేసిన నిఖిల్ నిన్న ఎవరో లేడీ కంటెస్టెంట్ చేతిలోని దిండును బలవంతంగా లాగేయడం కనిపించింది… రఫ్‌గా వెళ్తున్నట్టున్నాడు కూడా… కానీ ఈరోజుకూ తనదే ముందంజ… నబిల్ పర్లేదు… ఉన్నంతలో కన్నడ బ్యాచే బాగా ఆడుతున్నారు… యష్మి, ప్రేరణ వోకే… విష్ణుప్రియ ఓ ఒక్క సినిమా పాటల గేమ్‌లో తప్ప మిగతా ఏ చోట కూడా తన ఇంపాక్ట్ చూపించలేదు… వెరసి ఈసారి బిగ్‌బాస్ సీజన్ కూడా పూర్ ఇన్ పాపులారిటీ..!!
#biggboss8 #boggboss8telugu
Share this Article