ఎమోషన్స్‌ను తెరపై బలంగా ప్రజెంట్ చేయగల ఓ దర్శకుడు వేణులో ఉన్నాడని చాలామందికి బలగం సినిమా వచ్చేవరకూ తెలియదు… అప్పటిదాకా తను జస్ట్, ఓ జబర్దస్త్ బాపతు కమెడియన్ మాత్రమే… కానీ బలగం వచ్చాక తనలో రియల్ టాలెంట్ లోకానికి అర్థమైంది… తనను ఐదారు మెట్లు ఎక్కించింది ఆ సినిమా ఒకేసారిగా…
వోకే, గుడ్, ట్రెమండస్… ఫస్ట్ సినిమా తనను ఇండస్ట్రీలో నిలబెట్టింది… కానీ వాట్ నెక్స్‌ట్..? అసలు పెద్ద పెద్ద దర్శకులకు ద్వితీయ గండం ఉంటుంది… ఫస్ట్ సినిమాతో పోలిక ఉంటుంది… అంచనాలు ఉంటాయి… ఏమాత్రం తగ్గినా కిందపడటమే… బలగం సినిమాకు ఏరకంగానైతే తెలంగాణ విలేజ్ కల్చర్‌ను నేపథ్యంగా తీసుకున్నాడో, సేమ్ తన రెండో సినిమాకూ అలాంటి కథనే రాసుకుని, దానికి ఎల్లమ్మ అనే టైటిల్ కూడా ముందే ఫిక్స్ చేసుకున్నాడు…
ఇక్కడి వరకూ వోకే… బలగం సినిమాను కమర్షియల్ లెక్కల్లో హిట్టా ఫ్లాపా అని లెక్కించకూడదు… అది పల్లెపల్లెకూ తప్పకుండా వీక్షించాల్సిన ఓ కథాచిత్రంగా మారి… ఊరూరా ఉచిత బహిరంగ ప్రదర్శనలు సాగాయి… ప్రజెంట్ జనరేషన్‌లో ఆ సినిమాది ఓ విశిష్ట రికార్డు… మరి ఎల్లమ్మ అదే రేంజులో ఉంటుందా…? ఉండాలి… కానీ ఎల్లమ్మకు రోజులు బాగాలేవు… దానికి కారణం కూడా వేణే…
Ads
బలగం సినిమాలో ప్రియవర్శి తప్ప మిగతా వాళ్లెవరూ పెద్ద పేరున్న నటీనటులు కారు… మంచి నటులే… వారిలోని నటనను పిండుకోవడానికి, తను అనుకున్నట్టుగా కథనం, సీన్లు రావడానికి వేణు మంచి స్వేచ్ఛ అనుభవించాడు… కానీ పెద్ద నటులైతే వేణుకు ఆ స్కోప్ ఉండదు, రకరకాల పరిమితులు తనను బంధించేస్తాయి… ఎప్పుడైతే పెద్ద హీరో కావాలని అనుకున్నాడో అప్పట్నుంచే ఎల్లమ్మకు కష్టాలు స్టార్టయ్యాయి…
నాని అన్నారు… ఆల్రెడీ దసరాలో తెలంగాణ యువకుడి పాత్ర పోషించాడు… కానీ ఫుల్లు తాగుడు, హింస… పైగా దానికి తెలంగాణ సినిమా అని ముద్ర… నాని మళ్లీ తెలంగాణ పాత్ర దేనికిలే అనుకున్నాడేమో వద్దన్నాడు… తెలంగాణ ప్రాంతీయుడు నితిన్ కూడా మొదట్లో రెఫ్యూజ్ చేశాడు… తరువాత తేజ సజ్జా… రిజెక్ట్… హనుమాన్ తరువాత రేంజ్ పెరిగినట్టుంది… ఇక కథ మళ్లీ నితిన్ వద్దకు… తను కథలో మార్పులు చెప్పాడు… చివరకు వేణు సరేనన్నాడు… ఇప్పుడు మొదలైంది రాజీపడటం… తను అనుకున్నట్టుగా సినిమా వస్తుందనేది అనుమానమే…
ఈ సినిమాకు కూడా మామూలు తారాగణాన్ని ఎంచుకుంటే వేణు అనుకున్నట్టుగా కథ, సీన్లు వచ్చేవి… వోకే, పెద్ద నటీనటులు ఉంటే కమర్షియల్, మార్కెటింగ్ కోణంలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయనేది వేణు భావన కావచ్చు… కానీ పెద్ద పెద్ద హీరోల సినిమాలే బొక్కబోర్లా పడుతున్నయ్… ఐనా మన పెద్ద హీరోలు మారరు… ఐనా బలగం సినిమాను మామూలు తారలతో సూపర్ హిట్ చేయలేదా..? అదే కోణంలో వేణు ఆలోచించి ఉంటే… అడుగులు వేసి ఉంటే… ఇప్పటికే ఎల్లమ్మ థియేటర్లలో శిగమూగుతూ ఉండేది..!!
Share this Article