ఓ టీం… అందులో బ్యూరోక్రాట్లు, పొలిటికల్ లీడర్లు, జర్నలిస్టులు ఉన్నారు… సియోల్ వెళ్లింది ఆ టీం… ఎందుకు..?
ఆ నగరంలో ఒక ప్రవాహాన్ని ఆ ప్రభుత్వం పునరుజ్జీవింపచేసిన తీరు చూడటానికి..! ఎస్, అధ్యయనం చేయడానికి..! ఆ టీంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, మేయర్ కూడా ఉన్నారు…
మీడియా టీమ్‌లో ఉన్న జర్నలిస్టులు కూడా సీనియర్లు… చాలామంది బ్యూరో చీఫ్‌లు… ఏం రాయాలో, ఏం రాయవద్దో తెలిసినవాళ్లు… ప్రజలకు విషయాల్ని చెప్పగలిగినవాళ్లు… విశ్లేషణ సామర్త్యం ఉన్నవాళ్లు… దీనిపైనా కేటీయార్ విషం… అదీ వ్యంగ్యంగా… ఇలా…
Ads
పర్యావరణవేత్తలు, హైడ్రాలజిస్టులు, ఇంజనీర్లు, నిపుణులు, బ్యూరోక్రాట్లు ఉన్న టీమ్ అని ఎద్దేవా… ఎగతాళి… వెటకారం… వీళ్లంతా ప్రజాధనం వెచ్చించి సియోల్ వెళ్లి వచ్చి, లక్షన్నర కోట్ల మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును సమర్థించేలా అద్భుత ఫలితాల్ని సూచించే రిపోర్టు ఇస్తారిక… అని ట్వీటాడు… పైగా దానికి మూసీలూటిఫికేషన్ అని ఓ ట్యాగ్ లైన్…
కేటీయార్ మారడు, మారలేడు… అదే అహం… అదే పోకడ… ఎందుకు మీడియా మీద ఈ అక్కసు..? అధికారంలో ఉన్నన్నిరోజూ ఆయనతోపాటు ఆయన డాడీ గారు కేసీయార్ పదే పదే పలు సందర్భాల్లో జర్నలిస్టులను పురుగుల్లాగా తీసిపారేసేవాళ్లు… జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సంగతి తెలిసిందే కదా… ఇప్పుడూ అదే ధోరణి..? ఎందుకు జర్నలిస్టులంటే అంత హీనంగా చూడటం..?
ఏం..? రాజకీయ నాయకులకన్నా ఏం తక్కువ..? బ్యూరోక్రాట్లకన్నా ఏం తక్కువ..? రేప్పొద్దున మూసీ పనులు స్టార్టయితే వాటిపై విశ్లేషణ కథనాలు రాసేవాళ్లు వీళ్లే కదా… జనంలోకి వెళ్లేవి వీళ్ల రాతలే కదా… ఓ సిమిలర్ ప్రాజెక్టు మీద అవగాహన ఉంటే తప్పేమిటి..? ఎస్, హైడ్రాలజిస్టులు, పర్యావరణవేత్తలు, ఇంజనీర్లు, నిపుణులు వెళ్తే మంచిదే, రెండో దశలో వాళ్లూ వెళ్తారేమో గానీ… మూసీ పునరుజ్జీవం అంటే అది అనేక రంగాలకు సంబంధించిన అంశం…
ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు, హైడ్రాలజిస్టులు మాత్రమే అంచనాలు వేసి, అధ్యయనాలు చేసి, రిపోర్టులు ఇస్తేనే అయిపోదు… అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, వ్యర్థాల పంపింగ్, హుసేన్ సాగర్ శుద్ధి పేరిట వందల కోట్ల వృథా ఖర్చు, కాలుష్యం, మురికి… ఎన్నో అంశాలు… ఒక ప్రాజెక్టును వ్యతిరేకించాలీ అనుకుంటే, పొలిటికల్ కోణంలో వోకే, అర్థం చేసుకోవచ్చు… కానీ నడుమ మీడియా ప్రతినిధులను కించపరచడం దేనికి..? ఇక వీళ్లు వెళ్లి ఉద్దరించే ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చి, లక్షన్నర కోట్ల ఖర్చును జస్టిఫై చేస్తారనే వెక్కిరింపు దేనికి..?
కేటీయార్ ట్వీట్‌కు ప్రతిగా కాంగ్రెస్ శిబిరం గతంలో కేటీయార్ ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లాడో వివరాలతో ఎదురుదాడికి దిగాయి… తన వ్యక్తిగత వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు ప్రజాధనం ఖర్చుతో విదేశాలకు వెళ్లాడనేది ఆ దాడి సారాంశం… తనతోపాటు వెళ్లిన టీమ్స్‌లలో సబ్జెక్టులవారీగా అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం ఉన్నవాళ్లు ఎవరెవరు వెళ్లారనేది ఇక్కడ అప్రస్తుతం… ఆ ఎదురుదాడి అంశాల్లోకి ఇక్కడ వెళ్లడం లేదు…
ఎటొచ్చీ… ఇక్కడ ఒక స్టడీ టీం సియోల్ వెళ్లడాన్ని, జర్నలిస్టుల్ని కూడా సియోల్ సందర్భనకు తీసుకెళ్లాలనే ప్రభుత్వ సంకల్పాన్ని తప్పుపట్టడం లేదు… కానీ కేటీయార్ పోకడ, జర్నలిస్టుల్ని తేలికగా తీసిపడేసిన తీరును మాత్రమే చెప్పుకుంటున్నాం… అఫ్‌కోర్స్, ఈ టూర్ కండక్ట్ చేస్తున్న మున్సిపల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎవరెవరిని తీసుకుపోవాలనే విషయంలో అడ్డదిడ్డంగా వ్యవహరించింది… సరైన వ్యూహం లేదు, సరైన ప్రణాళిక లేదు, సరైన ఎంపికలూ లేవు… ఆ దిక్కుమాలిన పనితీరుకు రేవంత్ టీం సమాధానం చెప్పుకోలేక నానా పాట్లూ పడుతోంది…!!
Share this Article