జే గంటలు అనే సినిమాకు సంబంధించిన విషయాలు చాలా ఇంట్రస్టింగ్ వే ఉన్నాయి.
విజయబాపినీడు, కాట్రగడ్డ మురారి కలసి సినిమా తీయాలనుకున్నారు.
కథ మాటలు పాటలు బాధ్యత ఆత్రేయ మీద పెట్టారు.
ఆయన సహజంగానే పట్టించుకోలేదు.
దాంతో వేటూరితో పాటలు రాయించారు.
పాటలకు అనుగుణంగా కథ రాసుకున్నారు.
ఈ సినిమాలో హీరో వేషానికి చిరంజీవి కూడా వెళ్లాడు.
విచిత్రమేమంటే తర్వాత రోజుల్లో చిరంజీవితో గ్యాంగ్ లీడర్, మగమహారాజు లాంటి హిట్స్ తీసిన విజయబాపినీడు హీరోగా చిరంజీవిని కాదన్నారు. దీంతో రామ్ జీ అనే దాసరి కాంపౌండ్ నటుడ్ని తీసుకున్నారు.
అతనికి రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పాడు.
దర్శకుడుగా సింగీతం శ్రీనివాసరావును తీసుకున్నారు.
ఆయన వైఖరి నచ్చక దర్శకత్వం ఎస్. శ్రీనివాసరావు అని టైటిల్స్ లో వేసి తన కసి తీర్చుకున్నాడు మురారి.
ఆ తర్వాత చిరంజీవి పెద్ద హీరో అయ్యాక…
చిరంజీవితో సిన్మా తీయకపోవడం వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నట్టు మురారి –
మురారి సిన్మాలో నటించకపోవడం వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నట్టు చిరంజీవి చెప్పుకున్నారు పాపం.
Ads
మురారి మేనల్లుడు భార్గవ్ రామ్ చిరంజీవి భారతీ రాజా కాంబోలో ఆరాధన మొదలుపెట్టి అరవింద్ కు అమ్మేసుకున్నాడు పాపం.
అది పెద్దగా ఆడలేదు అంతకన్నా పాపం.
భారతీరాజా కలుక్కుం ఈరమ్ లో నటించిన అరుణను హీరోయిన్ గా తీసుకున్నారు.
ఈ సినిమాకు వంశీ అసిస్టెంటు డైరక్టర్ గా పనిచేశారు.
కొన్ని సీన్లు ఆయనే రాశారు కూడా.
తనకి తన పెదనాన్న కాట్రగడ్డ మధుసూదనరావు గారికీ ఉన్న కాన్‌ఫ్లిక్ట్ తో హీరో పాత్ర డిజైన్ చేసుకుని మురారి తృప్తి పొందారు.
మహదేవన్ సంగీతం వేటూరి సాహిత్యం పాటలు మాత్రం చాలా పెద్ద హిట్టయ్యాయి.
సినిమా మాత్రం అట్టర్ ఫ్లాపయ్యింది.
1981లో విడుదలైన ఈ సినిమా చాలా చేదు అనుభవాలు మిగిల్చిందంటారు సింగీతం. సత్యానంద్ గారి మాటల్లో మురారి అసలు సింగీతాన్ని డైరక్ట్ చేయనీయలేదు.
ఇది ఆమని సాగే చైత్ర రధం అనే ఓ అద్భుతమైన గీతం ఈ సినిమాలోదే.
మురారిది ఓ బ్యాక్ గ్రౌండు.
బాపినీడుది మరో రకం నేపధ్యం.
ఈ ఇద్దరూ కలసి జ్యోతి చిత్ర అనే పేరు పెట్టుకుని తీసిన ఈ సినిమా పాటలు యూట్యూబులో పెట్టడం చాలా బాగుంది… (రంగావఝల భరద్వాజ)
Share this Article