పొడుపు కథల తరహాలో… ట్రిక్కీ క్వశ్చన్స్… ఈ టాస్క్ కొంచెం రక్తికట్టించింది బిగ్‌బాస్ షోలో… ఎలాంటివి అంటే..? కాళ్లు ఉంటుంది కానీ నడవలేదు… నత్తి బుర్ర విష్ణుప్రియ సోఫా, మంచంకాళ్లు, మోకాళ్లు అని మూణ్నాలుగు ఆన్సర్లు చెప్పింది… రోహిణి సింపుల్‌గా కుర్చీ అని చెప్పింది… విష్ణుప్రియ చెప్పిన దాంట్లో మోకాళ్లు అనేది కరెక్టు కాదు, కానీ నాలుగు విసిరితే ఏదో ఒకటి తగలకపోదు అనుకుంది… గెలిచింది…
ఇద్దరు తండ్రులు, ఇద్దరు కొడుకులు, కానీ ముగ్గురే ఉన్నారు అక్కడ… ఎలా..? ఇది ఇంకో ప్రశ్న… టేస్టీ తేజ వేగంగా చెప్పాడు… తాత, తండ్రి, కొడుకు అని… నిఖిల్ అన్ని టాస్కుల్లోనూ భీమసేనుడే, కానీ దీన్ని వెంటనే పట్టుకోలేక ఓడిపోయాడు… వైల్డ్ కార్డ్ ఎంట్రీల రాయల్ క్లాన్‌కు గంగవ్వ లయబులిటీ తప్ప వీసమెత్తు ఫాయిదా లేదు అని చెప్పడానికి కూడా ఇదే టాస్క్ మరో ఉదాహరణ…
మూణ్నాలుగుసార్లు చెప్పినా ఆమెకు ప్రశ్నే అర్థం కాలేదు… ఇక విసిగిపోయి వాళ్లే వదిలేశారు… (గంగవ్వ బయటికి వచ్చేసే అవకాశం ఉందని కొన్ని వార్తలొచ్చాయి… ఎందుకంటే..? ఆమెతోపాటు మై విలేజ్ షో నిర్వాహకుడిపై ఎవరో జంతుప్రేమికుడు కేసు పెట్టాడు కదా… చిలుక జోస్యం ఎపిసోడ్ పేరిట చిలుకను హింసించారని… ఏ సెక్షన్లు పెట్టారో, వాటి తీవ్రత ఎంతో తెలియదు…)
Ads
ఒకటీరెండు వారాలు ఆగినా పెద్ద ఫరక్ పడేదేమీ లేదు… పైగా చిలుక జ్యోతిష్కులు వందల మంది తిరుగుతూ ఉంటారు, అందరి మీదా ఇలాగే కేసులు పెట్టారా..? ఐనా అందులో హింసించేదేముంటుంది..? దసరా రోజున పాలపిట్టను బుట్టల్లో పెట్టి తిరుగుతూ డబ్బులు అడుక్కుంటారు కొందరు… సరే, పోలీసులు కాస్త ఈ కేసులో ఓవరాక్షన్ చేసి, విచారణ పేరిట ఆమెకు నోటీసు పంపిస్తే ఆమె హౌజు నుంచి బయటికిరాక తప్పదు… అరెస్ట్ చేసేంత తీవ్రమైన సెక్షన్లు పెట్టారో లేదో తెలియదు…)
డిసైడింగ్ ప్రశ్న… కోతి, ఉడుత, పిట్ట… వీటిల్లో ఏది కొబ్బరిచెట్టు ఎక్కి వేగంగా అరటిపండు కోసుకుని రాగలదు..? ఇటు టేస్టీ తేజ, అటు ప్రేరణ… ఆమె త్వరపడి బజర్ నొక్కి, ఆ తరువాత తాపీగా తనకు ప్రశ్న మొత్తం అర్థం కాలేదని కొర్రీ పెట్టింది… సరే, సంచాలక్ నిఖిల్… సేమ్, క్లాన్… ఆమె కూడా వెంటనే తేరుకుని ఆ మూడూ కోసుకురాలేవు అని చెప్పింది… దీనికి ఇతరుల అభ్యంతరాలు… గంటసేపు మళ్లీ పంచాయితీ… ఇలాంటివి మొత్తం 11 ప్రశ్నలు… (ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, వేలాడుతుంది కానీ గబ్బిలం కాదు… కొన్ని నెలలకు 31, కొన్ని నెలలకు 30 ఉంటాయి, కానీ 28 ఉండేవి ఎన్ని..? ఇలాంటి ప్రశ్నలన్నమాట…)
ఇక్కడ మెచ్చుకోవాల్సింది కన్నడ బ్యాచ్‌ను… ఒకరికొకరు కూడా తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు… తెలుగు బాగా ఫ్లుయెంట్‌గా మాట్లాడుతున్నారు… కాకపోతే ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వెంటనే వాళ్లకు వెలగదు… దైనందిన ఉపయోగంలోని పదాలు తప్ప, కొత్త పదాలు విన్నప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతారు… ప్రేరణ స్థితి అదే… ఐనాసరే, ప్రేరణ, యష్మి తెలుగువాళ్లకు దీటుగా ఆడారు… ఈ కంటెస్టెంట్లకు భాష డిజండ్వాంటేజ్ అవుతుంది… సేమ్ లెవల్ ఆఫ్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు… అందుకే సరళమైన ప్రశ్నలే పొందుపరచాల్సింది…
మెగా చీఫ్ కంటెండర్ అనే పోటీలో రకరకాల టాస్కులు పెడితే హౌజులో ఉన్న ఒరిజినల్ కంటెండర్లే దుమ్మలేపారు… తోపులు అనుకుని లోపలకు తీసుకొచ్చిన పాతకాపులు వెలవెలబోయారు… ఎస్, ఈరోజుకైతే నిఖిల్, ప్రేరణ టాప్‌లో ఉన్నారు… ఆటలో… వోట్లలో…!!
Share this Article