.
వరుణ్ తేజ తన తాజా సినిమా మట్కా ఫంక్షన్‌లో బన్నీ మీద ఏం విసుర్లకు దిగాడు..? ఇది కాదు వార్త… ఎలాగూ బన్నీకి, మెగా క్యాంపుకీ నడుమ దూరం పెరుగుతూనే ఉంది… నాగబాబు కొడుకు కదా, వరుణ్ తేజ బన్నీపై దాదాపు స్ట్రెయిట్‌గానే కామెంట్స్ చేస్తున్నాడు… అదంతా వేరే కథ…
కానీ తనకు చాన్నాళ్లుగా ఓ హిట్ లేదు… ఇంత బలమైన మెగా క్యాంపు బ్యాక్ గ్రౌండ్, సపోర్టు, అసంఖ్యాక మెగా ఫ్యాన్స్ మద్దతు ఉన్నా సరే వరుణ్ తేజ సినిమాలు పెద్దగా ఆడటం లేదు… ఎఫ్1 ఎఫ్2 తన సోలో సినిమాలుకావు… గాండీవధారి, ఆపరేషన్ వాలెంటైన్ గురించి చెప్పుకోనక్కర్లేదు…
Ads
తనకు అర్జెంటుగా ఓ హిట్ కావాలి… ఇప్పుడు మట్కా సినిమా కోసం లుక్స్ మార్చాడు… డైరెక్టర్ కరుణకుమార్ వరుణ్ తేజతో నాలుగైదు గెటప్పుల కథను చిత్రీకరించాడని సమాచారం… అన్నింటికీ మించి సినిమాలో మీనాక్షి చౌదరి ఉంది, ఆమెకు మొన్నమొన్ననే లక్కీ భాస్కర్ అనే హిట్ పడింది…
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఉంది… జీవీ ప్రకాష్ సంగీతం… ఇలా హంగులన్నీ బాగానే ఉన్నాయి కానీ… సినిమాకు ఆశించినంత హైప్ రాలేదు… మరీ ఒక సమాచారం విస్మయకరంగా ఉంది… అడ్వాన్స్ బుకింగులు మరీ నిరాశాపూరితంగా ఉన్నాయి…
కంగువ సినిమాకు తెలుగులో 238 షోలకు గాను 33 శాతంతో 80 లక్షల రూపాయల మేరకు అడ్వాన్స్ బుకింగులు నమోదు కాగా… మట్కా 338 షోలయినా సరే కేవలం 4.4 శాతంతో 10 లక్షలు… అంతే… చాలా తక్కువ ఓపెనింగ్స్… ఏమాత్రం హైప్ లేనట్టే లెక్క…
సరే, కంగువ విషయంలో డిస్ట్రిబ్యూటర్ల మాఫియా బలంగా తన ప్రభావం చూపిస్తోందట, ఆ కథ జోలికి ఇక్కడ పోవడం లేదు… కానీ మట్కాకు రెస్పాన్సే దయనీయంగా ఉంది… ఇది మెగా క్యాంపుకు నిరాశ కలిగించేదే… అద్భుతం జరిగితే తప్ప ఈ లో రెస్సాన్స్ ఫిగర్స్ ఆశాజనకంగా మారే సిట్యుయేషన్ కనిపించడం లేదు…
ఎక్కడో తేడా కొడుతోంది వరుణ్ తేజ విషయంలో… తనకు ఓసారి మథనం అవసరం… సరైన ఫీడ్ బ్యాక్ కూడా అవసరం… మెగా హీరో అనే ముద్ర కొంతవరకే పనిచేస్తుంది… సినిమాలో దమ్ముంటే తప్ప ఎవరూ లాగలేరు… తన అనుభవం, తన పరిణతి తన ఫెయిల్యూర్ల మీద తనకు అంచనా కలిగించలేకపోవచ్చు… నాగబాబో, చిరంజీవో పూనుకోవాలి ఇక..!!
Share this Article