.
నో డౌట్… పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి, తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిన మాట నిజం… పుష్ప-2 షూటింగ్ వివాదాలు, మనస్పర్థలు, కంపోజర్ల మార్పులు గట్రా ఎన్ని ఉన్నా సరే, ఆ సీక్వెల్ మీద దేశవ్యాప్తంగా ఓ అసాధారణ హైప్ క్రియేటై ఉంది…
తనకు ఎలాగూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫాలోయింగ్ ఉంది… అది సహజమే, మనవాడు కాబట్టి, వరుసగా బ్లాక్ బస్టర్లు ఇస్తున్నాడు కాబట్టి..! మలయాళంలో కూడా చాన్నాళ్లుగా బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది… తన డబ్బింగ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది…
Ads
కానీ పుష్ప తరువాత దేశవ్యాప్తంగా… పక్కా నార్తరన్, సెంట్రల్ హిందీ బెల్ట్‌లోకి కూడా చొచ్చుకుపోయాడు… నిన్న బీహార్‌లో ప్రిరిలీజ్ ఈవెంట్‌కు దాదాపు 2 లక్షల దాకా జనం విరగబడ్డారంటే బన్నీ ఎదుగుదల ఎంత వేగంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు… ఇండియన్ సినీ సర్కిళ్లు మొత్తం విస్తుపోయి చూశాయి…
పుష్ప సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి, అసలు దాని గురించి కాదు… నార్తరన్ బెల్ట్ తమ సంప్రదాయ హీరోలను కాదని కొత్త హీరోల కోసం నిరీక్షిస్తోంది… నిజానికి హిందీ ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి తెలుగు లేడీ స్టార్స్ కావాలి తప్ప మగ స్టార్లు మాత్రం వద్దు… చాలామంది సౌత్ స్టార్లు ప్రయత్నించారు కానీ సక్సెస్ కాలేదు…
కానీ ఇప్పుడు ఆ ధోరణికి భిన్నంగా వాళ్లకు ఓ కొత్త మొహం కావాలి… ప్రభాస్ దాన్ని ఓమేరకు అందిపుచ్చుకున్నాడు… రాధేశ్యామ్, ఆదిపురుష్ ఏమాత్రం బాగున్నా తన రేంజ్ ఇంకా పెరిగి ఉండేది… కల్కి అమితాబ్ సినిమా… సో, తనకు మళ్లీ ఓ సాలిడ్ హిట్ పడితేనే తన స్టేటస్ పదిలంగా ఉంటుంది…
ఇక బన్నీ నెక్స్ట్… పుష్ప సీక్వెల్ హిట్టయితేనే తను రియల్ పాన్ ఇండియా స్టార్‌గా నిలబడతాడు… అందుకే పుష్ప సీక్వెల్‌కు మునుపెన్నడూ లేని రేంజులో ప్రిరిలీజ్ ఫంక్షన్లు ప్లాన్ చేశారు… 7 నగరాల్లో నిర్వహిస్తారట… పెద్ద బాలీవుడ్ స్టార్లే ఇలాంటి ఫంక్షన్లకు గుడ్ బై చెప్పి, టీవీ ఇంటర్వ్యూలు, మీడియా చిట్‌చాట్‌లతో ప్రమోషన్లు నడిపించేస్తున్నారు…
మళ్లీ ఇప్పుడు బన్నీ జైత్రయాత్రతో మళ్లీ మొదలు… ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు, పుష్ప బ్లాక్ బస్టర్ బన్నీని ఉత్తరాది జనంలోకి బలంగా తీసుకుపోయాయి.., ఇప్పుడు ఈ స్టేటస్ కాపాడుకోవడమే పెద్ద పరీక్ష తనకు… తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ సమరం మరో కథ… కానీ తనిప్పుడు నాట్ వోన్లీ జస్ట్ తెలుగు స్టార్… పాన్ ఇండియా స్టార్…
అల్లు అరవింద్ కూడా తన ఇమేజ్ పదిలంగా ఇంకా వేళ్లూనుకునేలా ప్లాన్లు చేస్తున్నాడు… ఈ పుష్ప-2 ప్రిరిలీజు ఫంక్షన్ల ఉద్దేశం అదే… కానీ పుష్ప-2 సక్సెసయితేనే ఈ ప్లాన్లు వర్కవుట్ అవుతాయి, బన్నీ మార్కెట్‌కు మరింత బూస్ట్… సరిగ్గా ఈ దశలోనే జాగ్రత్తలు అవసరం…
అందుకే దేవిశ్రీప్రసాద్ బదులు కొత్త కంపోజర్లను (థమన్) కూడా టీమ్‌లోకి తెచ్చుకోవడం, ఎక్కడా రాజీపడకుండా రీషూట్ చేయించడం… ఈ దిశలో సుకుమార్‌తో రీవర్క్ చేయించడం… చూడాలిక… బన్నీ ఆశలు ఏమేరకు నెరవేరతాయో..!
అన్నట్టు… నిన్న బీహార్‌లో సభ సీన్ చూశారా..? ఇదుగో లింక్… https://www.facebook.com/reel/1803347566738121
Share this Article