.
కాంట్రవర్సీతో కాసులు కొల్లగొట్టు డాక్యుమెంటరీ:
పసుపు, చింతపండుకు కూడా పేటెంట్లు, చిన్న వీడియోలకు కూడా కాపీరైట్లు తీసుకుంటున్న ఈ డిజిటల్ యుగంలో విజువల్స్ కి వీడియోఫుటేజ్ కి ఉన్న విలువ అవి సంపాదించే ఆదాయం గురించి తెలియని వారుండరు…..
Ads
కంటెంట్ క్రియేషన్ అనేది ఒక మెయిన్ స్ట్రీం ఇండస్ట్రీగా రూపాంతరం చెంది ఈ కాలంలో అలాంటి కంటెంట్ పై హక్కులను క్రియేట్ చేసిన వ్యక్తులకు/ సంస్థలకు ఉండేలా copyright act 1957లోనే రూపొందించింది… దానిని 1958 లో అమల లోకి తెచ్చింది… తదుపరి 2012 లో amend చేస్తూ
అమల్లోకి తెచ్చింది భారత్…
ఈ చట్టం ఏం చెప్తుంది :
కాపీరైట్, మేధో సంపత్తి చట్టం యొక్క ఒక రూపం , కవిత్వం, నవలలు, చలనచిత్రాలు, పాటలు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ మరియు ఆర్కిటెక్చర్ వంటి సాహిత్య, నాటకీయ, సంగీత మరియు కళాత్మక రచనలతో సహా రచయిత యొక్క అసలైన రచనలను రక్షిస్తుంది. (Act is available in internet pls refer)
ఇక నయనతార బయోగ్రఫీ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్ విషయానికి వస్తే…. నయనతార తన డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని 2022 లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి ముందే తన పెళ్ళి వేడుకను ఏదైనా చానల్ కి ఓటీటీ కి అమ్మాలని కూడా నిర్ణయించుకున్నారు.
తన PRO publicist company సూచన మేరకు ఈ వేడుకకు అన్ని సినిమారంగాల నుండి అతిరథులను గెస్ట్ లుగా పిలవాలని నిర్ణయించారు. సహజంగానే పెళ్ళి అనగానే అందరూ హాజరవుతారు. అందునా లేకలేక జరిగే వేడుక ఆయే…. !
ఈ వేడుకను exclusive గా కొనుకోడానికి నెట్‌ఫ్లిక్స్ ముందుకొచ్చింది. దాదాపు పాతిక కోట్లకు ఒప్పందం కూడా జరిగింది. నెట్‌ఫ్లిక్స్ రంగంలోకి రాగానే గెస్ట్ లిస్ట్ ని అదే నిర్ణయించింది. బాలీవుడ్ నుండి షారుఖ్ మొదలు సౌత్ దిగ్గజాలు రజనీ, మముట్టి, మోహన్‌లాల్, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోలతో లిస్ట్ తయారు చేసారు.
అంతా అనుకున్నట్లుగానే సాగిపోతోంది. పెళ్ళి జరిగిన రెండుమూడు వారాల్లోనే ఈ డాక్యుమెంటరీని రిలీస్ చెయ్యాలని డిసైడ్ చేసారు కూడా…. అందుకు తగినట్లుగానే టీజర్స్, ట్రైలర్స్, ఫ్లయర్స్, పోస్టర్స్ అన్నీ రెడీ అయ్యాయి.
జూన్ 9, 2022 లో వెడ్డింగ్ జరిగింది. ఆ ఈవెంట్ కు సంబంధించిన ఎలాంటి వీడియోలను క్లిప్ లను ఎటువంటి సాటిలైట్ ఛానల్ కు గానీ యూట్యూబ్ చానెల్స్ కు గాని రిలీస్ చెయ్యలేదు. కేవలం ఫోటోలను మాత్రమే రిలీస్ చేసారు.
ఈలోగా జులైలో నెట్‌ఫ్లిక్స్ లో రిలీస్ చెయ్యాలి అని ఫిక్స్ చేసిన సందర్భంగా ట్రైలర్లను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్.
దానిలో ధనుష్ ప్రొడ్యూసర్ గా విఘ్నేష్ శివన్ డైరెక్టర్ గా నయనతార విజయ్ సేతుపతి తారలుగా తీసిన నానుమ్ రౌడీ దాన్ (నేను రౌడీనే) సినిమాలోని పాటలను, బిహైండ్ ద సీన్స్ – మేకింగ్ వీడియోలు కూడా కలిపి ఆ ట్రైలర్లు ఉండటం ధనుష్ దృష్టికి వచ్చింది.
దానికి స్పందించిన ధనుష్ తాను నిర్మించిన సినిమా తాలుకా వీడియోలను వాడుకునేనందుకు గాను కాపీరైట్ చట్టాన్ని ఆశ్రయించి లీగల్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఆ డాక్యుమెంటరీ రిలీస్ ఆగిపోయింది.
అప్పటికే అంతా తయారైపోయి ఈ సదరు డాక్యుమెంటరీ ఓనరైన నెట్‌ఫ్లిక్స్ ఆయా వీడియోలను తొలగించడానికి ఏమాత్రంగా సుముఖంగా లేదు. అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాత ఆ డాక్యుమెంటరీ ప్రసారాన్ని ఆపేసింది.
కాలం చకచకా గడిచిపోయింది. ధనుష్ మాత్రం ససేమిరా అన్నాడు.
అంటాడు …. ఖచ్చితంగా… అది ఒక వ్యాపారం….!!
నయనతార నెట్‌ఫ్లిక్స్ కి ఉచితంగా ఇవ్వలేదుగా…! ఆమె సొమ్ము చేసుకుంది.
ఏళ్ళు గడిచాయి…. నయనతార పిల్లల్ని కనిపించుకుంది.
నెట్‌ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం తాలూకా తలనొప్పి పోలేదు. చేసేది లేక ఆ డాక్యుమెంటరీని తన బయోగ్రఫీ పిక్చర్ గా రూపొందించి ప్రసారం చెయ్యాలని నిర్ణయించారు. ఆ దిశగా వర్క్ జరిగింది. పిల్లల ఫుటేజ్ కూడా జోడించారు. పెళ్ళి వేడుక వీడియో కాస్త బయోపిక్ అయి కూర్చుంది.
నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ బయోపిక్ ను రిలీస్ చెయ్యాలని ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. సదరు ట్రైలర్లు కూడా విడుదల చేసింది….
అబ్బా …. అదిగో… అక్కడే మళ్ళీ దొరికిపోయింది.
ధనుష్ లీగల్ టీం మళ్ళీ నయనతారకు నెట్‌ఫ్లిక్స్ కు నోటీసులు ఫ్రెష్ గా పంపించారు. నెట్‌ఫ్లిక్స్ వెంటనే ప్రసారం ఆపేసింది… ఈ గోలేంటి అని జుట్టు పీక్కుంది.
అసలు అందులో అంత ఘోరంగా ఏముంది…?! అబ్బే ఏం లేదు… నానుమ్ రౌడీ మూవీలో సెట్స్ లో తీసిన జస్ట్ మూడు సెకన్ల between the scenes/ behind the scenes ఫుటేజీని వాడారు.
కాపీరైట్ చట్టం ప్రకారం సినిమాకు సంబంధించిన ఫుటేజీ మ్యూజిక్ సెట్స్ పైన ప్రొడ్యూసర్ కే పూర్తి హక్కులు. అది మూడు సెకన్లయినా, మూడు నిమిషాలైనా, మూడు గంటలైనా….!
గత్యంతరం లేక ఆ భాగాన్ని తొలగించి ప్రసారం చేసారు, లేకుంటే ఈ సారి పిల్లల పంచెల ఫంక్షన్ కూడా కలిపి ప్రసారం చేయాల్సి వచ్చేది.
ఇదిలా ఉండగా బాగా పాతబడిపోయిన ఆ డాక్యుమెంటరీ పైన ప్రేక్షకులకు ఎటువంటి ఆసక్తి ఉండదు అని గ్రహించిన ఆమె వెంటనే ఏదైనా సెన్సేషనల్ గా చేసి జనాల్లో Buzz తీసుకురావాలి అని ప్లాన్ చేసింది.
ఒకపక్క నెట్‌ఫ్లిక్స్ వత్తిడి, ఒక పక్క పగ, మరో పక్క ధనుష్ చేతిలో ఒటమితో రగిలిపోతున్న నయనతార ‘బహిరంగ లేఖ’ రూపంలో ధనుష్ పై దుమ్మెత్తి పోసి అక్కసు తీర్చుకుంది.
నిజానికి across the table సెటిల్ ఐపోయే విషయాన్ని పంతంతో పెద్దది చేసింది. జరిగింది ఏదో జరిగిపోయింది దాని నుండి కూడా డబ్బు సంపాదించేద్దాం అని కాంట్రవర్సీకి తెరలేపింది….
మూడు పేజీల బహిరంగ లేఖలో ధనుష్ కారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వీడియో కాపీరైట్ విషయం కాకుండా ఏవేవో రాసింది. పాయింట్ ను చర్చించకుండా పక్కదారి పట్టించాలని చూసింది.
ఈ విషయం పైన పరువునష్టం దావా వెయ్యడానికి ధనుష్ కి అవకాశం మాత్రమే కాదు హక్కు కూడా ఉంది…. వ్యాసకర్త :: ప్రియదర్శిని కృష్ణ
Share this Article