.
WW3 అప్డేట్- 2 …. పుతిన్ హెచ్చరికలని లక్ష్య పెట్టకుండా ఉక్రెయిన్ మళ్ళీ దాడి చేసింది రష్యా మీద!
Ads
BRITISH STORM SHADOW!
బ్రిటన్ స్టార్మ్ షాడో క్రూయిజ్ మిసైళ్లతో ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది!
స్టార్మ్ షాడో మిసైల్స్ రష్యాలోని కుర్స్క్ (Kursk ) లో ఉన్న పుతిన్ అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్ మీద పడ్డాయి.
బర్యతిన్స్కీ ( Baryatinsky ) ఎస్టేట్ అనేది కుర్స్క్ లో పుతిన్ ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్… దాన్ని టార్గెట్ చేసుకొని ఉక్రెయిన్ దాడి చేసింది!
ఈ కమాండ్ సెంటర్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో భూమి లోపల నిర్మించారు. బంకర్ బస్టర్ బాంబు దాడులు చేసినా తట్టుకునే విధంగా నిర్మించారు.
రష్యన్ హై ర్యాంకింగ్ మిలిటరీ అధికారులతో పాటు ఉత్తర కొరియా నుండి వచ్చిన మిలిటరీ అధికారులు కూడా ఉన్నారు అక్కడ!
ఎంత నష్టం కలిగిందో వివరాలు బయటికి రాలేదు.
ఈ ఎస్టేట్ లో రష్యా ప్రధాన కమ్యూనికేషన్ సెంటర్ కూడా ఉంది. కమాండ్ & కమ్యూనికేషన్లు రెండూ ఉన్నాయి. ఒకవేళ ఈ ఎస్టేట్ కనుక ధ్వంసం అయిఉంటే మాత్రం అది పుతిన్ కి పెద్ద దెబ్బ!
ఎస్టేట్ ఉన్న కురుస్క్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రత్యక్షంగా చూసి మొత్తం 15 పేలుళ్ళు పెద్ద శబ్దంతో జరిగినట్లు చెప్తున్నారు. అంటే మొత్తం 15 స్టార్మ్ షాడో మిసైల్స్ ని ఉక్రెయిన్ ప్రయోగించింది అన్నమాట!
ఎస్టేట్ VVIP లు ఉండే విలాసవంతమైన భవనంలా కనపడుతుంది తప్పితే మిలిటరీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లా అనిపించదు! భూమిపై నుండి లోపలికి 30 అడుగుల కింద పటిష్టమైన కాంక్రీట్ తో నిర్మించారు కాబట్టి 15 స్టార్మ్ షాడో మిసైళ్ళని ప్రయోగించింది ఉక్రెయిన్ వెంట వెంటనే!
*******
STORM SHADOW – SCALP EG
బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా తయారు చేసిన క్రూయిజ్ మిసైల్. బ్రిటన్ STORM SHADOW గా పిలిస్తే ఫ్రాన్స్ SCALP EG గా పిలుస్తుంది.
మనం ఫ్రాన్స్ నుండి కొన్న రాఫెల్ F2 జెట్ ఫైటర్స్ తో పాటు వెపన్ ప్యాకేజి కింద ఈ SCALP EG కూడా కొన్నాము!
స్టార్మ్ షాడో లేదా స్కాల్ప్ EG లని మిలిటరీ ఎయిర్ బేస్ లో ఉండే రన్ వేలని ధ్వంసం చేయడం కోసం డిజైన్ చేశారు అంటే క్లస్టర్ బాంబులని ప్రయోగిస్తుంది . క్రమేణా అప్గ్రేడ్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం హై వాల్యూ టార్గెట్ ని కొట్టడానికి వీలుగా డిజైన్ చేశారు.
స్టార్మ్ షాడో రెండు దశలలో పేలుతుంది. మొదటి దశలో కాంక్రీట్ లేదా భూమిని చీల్చుకుంటూ లోపలికి వెళుతుంది. రెండవ దశలో లోపలికి వెళ్ళాక మిసైల్ లో ఉన్న వార్ హెడ్ పేలుతుంది. బర్యతిన్స్కీ ఎస్టేట్ లో ఉన్న బంకర్ ధ్వంసం చేయడానికి స్టార్మ్ షాడో అనేది సరైన ఆయుధం!
మరి 15 స్టార్మ్ షాడోలని ప్రయోగించారు అంటే ఎస్టేట్ లో ఏమీ మిగిలి ఉండక పోవచ్చు మరియు అందులో పనిచేస్తున్న హై రాంక్ మిలిటరీ అధికారులు ఎవరూ కూడా బ్రతికే అవకాశం లేదు!
STORM SHADOW లేదా SCALP EG లని ప్రయోగించే సాధనాలు ఏమిటి?
సబమెరైన్లు, ఉపరితల వార్ షిప్స్, జెట్ ఫైటర్స్ నుండి ప్రయోగించవచ్చు!
స్టార్మ్ షాడో మరియు స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ ప్రయోగించగల ఫైటర్ జెట్స్ : రాఫెల్, మిరేజ్ 2000 (ఫ్రాన్స్ ), టోర్నడో, యూరో ఫైటర్ టైఫూన్ (బ్రిటన్ ), సాబ్ గ్రిప్పెన్ ( స్వీడన్ ).
కానీ ఉక్రెయిన్ దగ్గర ఈ విమానాలు లేవు. Su -24 లు మాత్రమే ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి. అంటే Su -24 నుండి స్టార్మ్ షాడోలని ప్రయోగించింది ఉక్రెయిన్.
Su-24 లతో స్టార్మ్ షాడోలని అనుసంధించాలి అంటే Su -24 కంప్యూటర్ సోర్స్ కోడ్ సాఫ్ట్వేర్ ఎవరు ఇచ్చి ఉండాలి…! ఈ పని చేయడానికి కనీసం నెల రోజులు పడుతుంది.
ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఉక్రెయిన్ కు స్టార్మ్ షాడో క్రూయిజ్ మిసైల్స్ ని ఇచ్చాయి అని తెలుస్తున్నది!
బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు స్టార్మ్ షాడో లేదా స్కాల్ప్ eg మిసైల్స్ ని 2028 లోపు సర్వీస్ నుండి తొలిగించడానికి గాను కొత్త తరం మిసైల్స్ కోసం R&D చేస్తున్నాయి. ఉన్నవాటిని ఉక్రెయిన్ కి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి!
********
రష్యా నిస్సహాయత!
స్టార్మ్ షాడో క్రూయిజ్ మిసైల్ వేగం సబ్ సానిక్ అంటే శబ్ద వేగం కంటే తక్కువ. 550 KM రేంజ్ ఉండే సబ్ సానిక్ క్రూయిజ్ మిసైళ్ళు రష్యా ఆధీనంలో ఉన్న కుర్స్క్ ఓబ్లాస్ట్ లోకి వస్తుంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించలేదా! లేక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అక్కడ లేదా?
సోవియట్ కాలం నాటి S-250 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లు చాలు సబ్ సానిక్ వేగంతో వచ్చే మిసైల్ ని ఎదుర్కొవడానికి! S-300, S-400 లు అవసరం లేదు.
దాడి పక్కా ప్లాన్ తో చేశారు. ఒక్కో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో నాలుగు మిసైల్స్ ఉంటాయి రెడీ గా. నాలుగు ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ నాలుగు స్టార్మ్ షాడోలని అడ్డుకున్నాక మళ్ళీ మరో నాలుగు మిసైల్స్ ని లోడ్ చేయాల్సి వుంటుంది దీని కోసం కనీసం అరగంట సమయం పడుతుంది ఈ లోగా మిగిలిన 11 స్టార్మ్ షాడోలు దాడి చేస్తాయి. ప్లాన్ బాగుంది కదా?
అంటే రష్యా దగ్గర తగినన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు అన్నమాట!
కురుస్క్ అబ్లాస్ట్ రీజియన్ లో ఉన్న బర్యతిన్స్కీ ఎస్టేట్ నేరుగా పుతిన్ ( KREMLIN) అడ్మినిస్ట్రేషన్ తో అనుసంధానం చేయబడిన కమాండ్ కంట్రోల్ సెంటర్… దీనికే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రక్షణ లేదు!
ఏకంగా 15 స్టార్మ్ షాడో మిసైల్స్ దాడి చేయడం, దాడిని అరడజను డ్రోన్లు అదీ నిన్న మిట్ట మధ్యాహ్ననం వీడియో తీసి వెనక్కి వెళ్లిపోయాయి అంటే అర్ధం చేసుకోవచ్చు రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డొల్లతనం!
ఈ కధనం వ్రాసే సమయానికి రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు ఎందుకంటే ఉక్రెనియన్ డ్రోన్లు దాడి చేయడాన్ని వీడియో తీయడం వాటిని వైరల్ చేయడం జరిగిపోయింది! పుతిన్ ఎలా స్పందిస్తాడో చూడాలి! ………. (పొట్లూరి పార్థసారథి)
Share this Article