.
మెకానిక్ రాకీ… ఇది విష్వక్సేన్ కొత్త సినిమా… దాని ప్రమోషన్ కోసం బిగ్‌బాస్ హౌజుకు వచ్చాడు ఓ ఆటో తీసుకుని…
విష్వక్సేన్ సినిమాల ప్రమోషన్ అంటేనే అది భిన్నంగా ఉంటుంది… గతంలో కూడా చూశాం కదా… టీవీ9 దేవి గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో ఎపిసోడ్ దాకా…
Ads
బిగ్‌బాస్ హౌజులోకి రాగానే… బిగ్‌బాస్ నాకు మీ కిచెన్ టైమ్ పెంచడానికి అధికారం ఇచ్చాడు. నా సినిమాకు జనం వచ్చేలా ఏదైనా టాస్క్ చేయండి అన్నాడు విష్వక్సేన్… కనీసం 200 టికెట్లయినా మీ స్కిట్ చూసి అమ్ముడవ్వాలి అన్నాడు…
తప్పదు కదా… హౌజులోకి వచ్చిన పాపానికి ఏ అడ్వర్టైజ్‌మెంట్ ఐనా చేయాల్సిందే కదా… కాకపోతే కంటెస్టెంట్లు చేసిన స్కిట్ పరమ నాసిరకంగా, పేలవంగా ఉండి, నిజానికి మెకానిక్ రాకీ సినిమాకు వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్న 200 మంది కూడా రద్దు చేసుకుంటారేమో అన్నట్టుగా ఉంది ఈ స్కిట్…
ఫస్ట్ అవినాష్, టేస్టీ తేజ పోల్ డాన్స్ చేశారు… అవినాష్ కాస్త పర్లేదు… కానీ టేస్టీ తేజ డాన్స్ పరమ చిల్లరగా ఉంది… అదేదో విష్ణుప్రియ చేస్తే అదిరిపోయేది… తను స్వతహాగా మంచి డాన్సర్… తరువాత రోహిణి, అవినాష్‌లతో ఏదో డ్రైవింగ్ స్కూల్ ఎపిసోడ్ చేశారు, అందులో విష్వక్సేనుడు కూడా పాల్గొన్నాడు…
నిజానికి ఇలాంటివి చేయడానికి అవినాష్, రోహిణి పర్‌ఫెక్ట్… కానీ ఇక్కడ అదీ ఫెయిల్… ఏమాత్రం రక్తికట్టలేదు ఈ ప్రమోషన్ సీన్లు… నిజానికి హౌజులో తనదైన స్టయిల్‌లో బిగ్‌బాస్ మాటలకు పెడసరం సమాధానాలు ఇవ్వడం బాగోలేదు…
అంతకుముందు గౌతమ్, పృథ్విల గొడవను ఉద్దేశించి… పృథ్విది రౌడీయిజం, గూండాయిజం అని కామెంట్ చేశాడు తేజ… అవినాష్, రోహిణి కూడా వంతపాడారు… ఇదే తేజ చీఫ్ అయ్యాడని ఓ వార్త… సరే, విష్వక్సేన్ పట్టుకొచ్చిన ఆటోలోనే ఓ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్… తెలిసిందే కదా, మళ్లీ కుక్కల కొట్లాట టైపు గొడవలు, అరుపులు… కేరక్టర్ల విమర్శలు…
నిజానికి అక్కడ గొడవ కావాలని స్టార్ట్ చేసిందే గౌతమ్… అసలే పృథ్వి కదా, రెచ్చిపోయాడు… ఇద్దరూ మెంటలే కదా… అసలే బిగ్‌బాస్ పెట్టే గొడవలు ఎలా ఉంటాయి..? చాట్ల తవుడు, కుక్కను పిలువు అన్నట్టుగా…
చీఫ్ ఎంపిక టాస్క్ సమయంలో గౌతమ్ కావాలనే కన్నడ బ్యాచ్ ఓడిపోయేలా వ్యవహరించాడు… లేకపోతే టేస్టీ తేజ చివరి దాకా ఆటలో ఉండేవాడు కాదు… సరే, వోటింగు దగ్గరకు వస్తే… ఈసారి నలుగురు కన్నడ బ్యాచ్ ఉన్నారు కదా నామినేషన్లలో… బిగ్‌బాస్ కావాలని ఎవిక్టెడ్ కంటెస్టెంట్లను పట్టుకొచ్చి మరీ నామినేషన్లు వేయించాడు…
మొదట్లో యష్మికి టాప్ వోటింగ్ ఉండేది… ఈమధ్య పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ నెగెటివిటీ మూటగట్టుకుంది… ఫలితంగా డేంజర్ జోన్‌లోకి వచ్చేసింది… పృథ్వికి కూడా తక్కువ వోట్లే… హంబుల్, నోబుల్ గేమ్ ఆడుతున్న నబీల్ సహజంగానే టాప్ ప్లేసులో ఉన్నాడు…
ఇప్పటికీ మనం కాబోయే విజేతగా భావించే నిఖిల్ సెకండ్ ప్లేస్… అఫ్‌కోర్స్, ప్రేరణ థర్డ్ ప్లేస్… సో, ఎట్టకేలకు కన్నడ బ్యాచ్ నుంచి ఒకరు ఔట్ కాబోతున్నారన్నమాట… డబుల్ ఎలిమినేషన్ చేసేస్తే ఇద్దరు పోతారు… ఓ పనైపోతుంది… ఎలాగూ గత వారం ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు కదా… కన్నడ బ్యాచ్‌ను విపరీతంగా ద్వేషిస్తున్న వాళ్లకు కాస్త హేపీ..!!
Share this Article