.
సో… అమెరికాలో ఆదానీపై నమోదైన కేసు ఆధారంగా జగన్ మీద కేసు పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైపోతోంది…
ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకు చదివితే అర్థమయ్యేది అదే… తను మునుపటి చంద్రబాబు కాదు, జగన్ ఆ అయిదేళ్లూ చంద్రబాబుకు చుక్కలు చూపించాడు… కటకటాల్లో వేశాడు…
Ads
అదే సిట్యుయేషన్ జగన్‌కు క్రియేట్ చేయాలనే ప్రతీకార వాంఛ సహజం… పాత సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ బెయిల్ రద్దుకు ఢిల్లీ ద్వారా ప్రయత్నించవచ్చు అనే ఊహాగానాలు సాగాయి… ఎలాగూ ఇప్పుడు చంద్రబాబు ఎన్డీయే కూటమి మనిషి… పైగా తన మీద ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం…
ఈలోపు ఆదానీ నుంచి 1750 కోట్ల ముడుపుల ఆరోపణలు చంద్రబాబుకు జగన్ మీద ప్రతీకారం తీర్చుకునే దిశలో అచ్చొచ్చిన అవకాశమే… ఆంధ్రజ్యోతి కూడా అదే రాసుకొచ్చింది… అన్ని సిస్టమ్స్‌ను మేనేజ్ చేయగలననుకునే తనను ఏకంగా జైలుపాలు చేయడంతో చంద్రబాబు లోలోపల మండిపోతున్న తీరూ సహజమే…
ఈ ఆరోపణలు నిలబడతాయా..? ప్రత్యర్థి సౌరవిద్యుత్తు కంపెనీ అజూర్ చేసిన ఆరోపణలు, ఇచ్చిన వివరణల ఆధారంగా కేసు నమోదైందా..? ఇంకేమైనా స్పష్టమైన ఆధారాలున్నాయా తెలియదు… సరే, అదంతా అమెరికా చట్టాల ప్రకారం జరగాల్సిన విచారణ…
కానీ ఆ ఒప్పందాలు, ఆ ముడుపుల కారణంగా ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి… చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ మీద ఇక్కడే ఇంకో కేసు పెట్టేందుకు చాన్స్ లభిస్తుందేమో..! ఈ మొత్తం యవ్వారాల్ని వివరించి, జగన్ పాత బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అనే వాదనను సీబీఐ, ఈడీల ద్వారా న్యాయస్థానాల ఎదుట పెట్టే చాన్స్ కూడా వచ్చినట్టేనా..?
పనిలోపనిగా సాక్షి మీడియా మీద కూడా కూటమి ప్రభుత్వం ఓ కన్నేసే అవకాశం కనిపిస్తోంది… పత్రిక, టీవీ ఆస్తులన్నీ ఈడీ జప్తులో ఉన్నవే… ఐతే చంద్రబాబు ప్రయత్నాలకు, ఆలోచనలకు బీజేపీ హైకమాండ్ ఏమేరకు సై అంటుందో కూడా వేచిచూడాలి…
తన కొత్త పలుకు వ్యాసంలో రాధాకృష్ణ రాసిన పలు అంశాలపై చాలా సందేహాలున్నాయి… సరే, తనకు జగన్ అంటే పడదు కాబట్టి కొంత ఘాటుగా రాసుకొచ్చాడు సహజంగానే… కానీ తనేమంటాడంటే…
గతంలో నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉండేది. పోటీ లేకుండా పనులు దక్కించుకోవాలనే కంపెనీలు ఎన్బీసీసీని కవచంగా వాడుకునేవి. పనులను ముందుగా ఎన్బీసీసీకి నామినేషన్‌పై కట్టబెట్టేవారు. ఆ తర్వాత ఎన్బీసీసీ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఒప్పందం కింద డీల్ కుదుర్చుకున్న కంపెనీలు పనులు పొందేవి. చివరికి ఇదొక ప్రహసనంగా మారడంతో ఎన్బీసీసీ ఉనికిలో లేకుండా పోయింది. ఇప్పుడు సోలార్ విద్యుత్ ప్రమోషన్ పేరిట ఏర్పాటైన సెకీ కూడా ఎన్బీసీసీ బాపతే….
ఎన్బీసీసీ పేరిట జరిగే యవ్వారాలు నిజమే కావచ్చుగాక… కానీ అది ఉనికిలో లేకుండా పోవడం ఏమిటి..? నిక్షేపంలా ఉంది… వేల కోట్ల ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి… దాని షేరు ధర ప్రస్తుతం 89.22 రూపాయలు… అలాగే ఏపీ ప్రజలపై జగన్ అక్రమంగా మోపుతున్న భారం మీద ఇలా రాసుకొచ్చాడు…
అంతర్ రాష్ట్ర పంపిణీ చార్జీల రూపంలో ఒక యూనిట్‌కు రెండు రూపాయల 21 పైసలు చెల్లించడానికి పీపీఏ కుదుర్చుకున్నారు. (అసలు పవర్ ధర 2.49) దీంతో యూనిట్‌కు ధర 4 రూపాయల 70 పైసలు అయింది. ఈ కారణంగా రాష్ట్ర ప్రజలపై సాలీనా రూ.3750 కోట్ల అదనపు భారం పడుతుంది. 25 ఏళ్లకు గాను ఈ భారం రూ.లక్షా 56 వేల 151 కోట్లకు చేరుతుంది. ఇది కాకుండా అంతర్ రాష్ట్ర పంపిణీ నష్టాలు, జీఎస్టీ పెరుగుదల, సోలార్ ప్యానల్స్ ధర పెంపు రూపంలో ఒక్క యూనిట్‌కు 43 పైసలు అదనంగా చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ కారణంగా సాలీనా మరో 870 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించవలసి వస్తుంది. ఫలితంగా అదానీ కంపెనీ నుంచి కొనుగోలు చేసే ధర ఒక్క యూనిట్‌కు 5 రూపాయల 13 పైసలకు చేరుతుంది….. పీపీఏ కుదిరిన నాటికి అదానీ కంపెనీ అసలు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించకపోవడం నిజం కాదా?
దాదాపు పవర్ జనరేషన్ ధరతో సమానంగా ట్రాన్స్‌మిషన్ చార్జీలు ఉండటం ఏమిటి..? పైగా అంతర్ రాష్ట్ర పంపిణీ నష్టాలనూ ఏపీ ప్రభుత్వమే భరించడం ఏమిటి..? పైగా జీఎస్టీ పెరుగుదలను ఊహించి పీపీఏల్లో పెట్టడం ఏమిటి..? సోలార్ ప్యానెల్స్ ధర పెంపు కూడా ఎందుకు ఇవ్వాలి..? ఇవన్నీ నిజమే అయితే, రాధాకృష్ణ రాసుకొచ్చిన విషయాలే నిజమైతే జగన్ చేసింది ద్రోహమే అవుతుంది…
ఐతే పీపీఏలు అంటేనే బోలెడు కథలుంటాయి… అధికారంలో ఉన్న పార్టీ బాగా ఆశిస్తుంది… చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కుదిరిన పీపీఏలు ప్లస్ రాష్ట్ర విభజన తరువాత సోలార్, విండ్, హైడల్ పవర్ కంపెనీలతో కుదిరిన ఒప్పందాల్లోనూ బోలెడు బాగోతాలున్నట్టు జగన్ తను అధికారంలోకి వచ్చిన కొత్తలో అసెంబ్లీలోనే తీవ్ర ఆరోపణలు చేశాడు…
సరే, అలాంటిది తనే అచ్చం అలాంటి సౌర విద్యుత్తు ఒప్పందాల్లో ఇరుక్కుపోవడం తన డెస్టినీ… కానీ నిజంగా ఆదానీ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సెకీతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేస్తే బెటర్… (ఆర్కే చెప్పినవి అబద్ధాలు అని కాదు…) కానీ ప్రభుత్వం విడుదల చేస్తే అది అధికారిక ప్రకటన అవుతుంది… జనానికి నిజాలూ తెలుస్తాయి… కేసులు, అరెస్టులు, జైళ్ల సంగతి తరువాత..!!
చివరగా…. అదే సెకి నుంచి 2016లో ఇదే చంద్రబాబు 4.50 రూపాయలకు కొన్నాడని సాక్షి, వైసీపీ ఆరోపణ… దానికి ఆంధ్రజ్యోతి సుదీర్ఘ వ్యాసంలో జవాబు లేదు..!!
Share this Article