.
నిజమే… భూతంలా పెరిగిపోతున్న గంజాయిని అడ్డుకోవాల్సిందే… ఏపీ కూటమి ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం ఆలోచనలు, చర్చలు, నిర్ణయాలు బాగున్నాయి…
గంజాయి సాగు, రవాణా, విక్రేతలకు సంక్షేమ పథకాల్ని ఆపేయాలనేది ప్రధాన నిర్ణయం… ఐతే, ఉపసంఘం తమ ఆలోచనల్ని మరింత విస్తరిస్తే బాగుంటుంది… ఎలాగంటే..?
Ads
1) సంక్షేమ పథకాల్ని నిలిపివేయడం అనేది కేవలం గంజాయి నేరగాళ్లకే కాదు… కిడ్నాప్, మర్డర్, దేశద్రోహం తదితర సీరియస్ నేరాల్లో ఉన్న వాళ్ల కుటుంబాలకు కూడా ఆపేయాలి… ప్రజాధనాన్ని క్రిమినల్స్‌కు పంచడం దేనికి..? వాళ్ల సంక్షేమానికి టాక్స్ పేయర్స్ మనీ దేనికి..?
2) ఒక్క రేషన్ మాత్రమే కాదు, సోషల్ పెన్షన్స్, ఇతరత్రా అన్ని ప్రభుత్వ పథకాల నుంచీ వాళ్లను మినహాయించాలి…
3) ఈగల్ అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, గంజాయిపై ఉక్కుపాదం మోపాలనే నిర్ణయం మంచిదే… కానీ ఆ గద్ద చూపులు, దాడులు గంజాయి మీద మాత్రమే కాదు… పెరుగుతున్న ఇతరత్రా అన్నిరకాల రసాయన డ్రగ్స్ మీద కూడా ఉంటే ఇంకా బెటర్…
4) డ్రగ్స్‌తో పోలిస్తే… కల్తీ మద్యంతో పోలిస్తే… నాసిరకం చీప్ లిక్కర్‌తో పోలిస్తే… కల్తీ సారాతో పోలిస్తే… గంజాయి తక్కువ ప్రమాదకరం, సరిగ్గా వైద్యంలో వాడితే ఆరోగ్యకరం, అమెరికా కొన్ని రాష్ట్రాల్లో గంజాయిపై నిషేధమే లేదు అనీ అంటారు కొందరు… ఐనాసరే దాని మీద బహుళ చర్చ అవసరం కావాలి, కాబట్టి ప్రస్తుతానికి గంజాయిని ఉపేక్షించొద్దు, అదే సమయంలో పైన చెప్పినవీ వదలొద్దు…
5) గత అయిదేళ్లలో అధిక ధరలకు అమ్మబడిన ప్రమాదకర రంగుసారా చాలా జీవితాలను కబళించింది… అదుగో ఆ బాపతు మద్యాన్ని అరికట్టాలి…
6) రాష్ట్రం పరిధిలో లేకపోయినా సరే… ఆస్ట్రేలియా తరహాలో పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధింపు సమాజానికి, భావి తరాలకు అత్యంత ప్రయోజనకరం… 18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం అన్నమాట…
7) నిజమే, కేవలం ఏపీ నిర్ణయం తీసుకోలేదు… కానీ చంద్రబాబు ప్రస్తుతం కేంద్రంలోనూ ప్రభావశీలి… తను ఇనీషియేట్ చేస్తే మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది… సోషల్ మీడియాతోపాటు పిల్లల స్మార్ట్ ఫోన్ల వాడకంతో వస్తున్న నష్టాలు అన్నీఇన్నీ కావు…
8) అబ్బే, అది కష్టం అని చాలామంది కొట్టిపారేస్తారు… కానీ చట్టం, నిషేధం అంటూ ఉంటే తప్పకుండా కొంతమేరకైనా మంచి ఫలితాలు వస్తాయి… సోషల్ మీడియా గంజాయికన్నా దుష్ప్రభావకరం కదా…!!
Share this Article