Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరీ రావణ కేరక్టర్ ఏమీ కాదు… అందుకే పెద్దగా నచ్చలేదు జనానికి…

December 6, 2024 by M S R

.

రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో … 1979 లో వచ్చిన ఈ రావణుడే రాముడయితే సినిమాకు ఐకానిక్ సాంగ్ . వేటూరి వ్రాసారు . అక్కినేని 185 వ చిత్రం .

ఆ రోజుల్లో ఎన్నో సినిమాల నిర్మాత మీర్జాపురం జమీందారు కుమార్తె యన్ ఆర్ అనూరాధా దేవి ఈ సినిమాకు నిర్మాత . ఈ సినిమాకు ముందు అక్కినేనితో చక్రధారి సినిమాను నిర్మించింది . కధ , స్క్రీన్ ప్లే , డైలాగులు , దర్శకత్వం దాసరి నారాయణరావు వహించారు .

Ads

రొటీనే కధే . ఓ జమీందారు . ఆయన దగ్గర ఓ తోడేలు . జమీందారుని హత్య చేయడంతో కుటుంబం చెల్లాచెదురు అవుతుంది . పెద్ద కొడుకు అల్లరిచిల్లరగా , బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునేవాడిగా , ఆకురౌడీగా పెరుగుతాడు . దాసరి గారు పేరు పెట్టినట్లు అతనేం అంత రావణుడు కాదు .

రాముడు వ్యక్తిత్వమే ఎక్కువ ఉన్న రావణుడు . ట్రయాంగిల్ లవ్ . తన తండ్రిని హత్య చేసిన ఎలుగుబంటి అవతారంలోని తోడేలుని చంపి , జైలు శిక్ష అనుభవించి , తనను ప్రేమించిన. హీరోయిన్ని చేరటం టూకీగా సినిమా కధ .

ఈ సినిమా దాసరి- అక్కినేని కాంబినేషన్ లెవెల్లో ఆడలేదు . వంద రోజులు ఆడింది . డబ్బులు వచ్చే ఉంటాయి . ఇవన్నీ జరగటానికి ముఖ్య కారణం జి కె వెంకటేష్ సంగీత దర్శకత్వంలో హిట్టయిన పాటలు , ఆ పాటల్ని వ్రాసిన వేటూరి , దాసం గోపాలకృష్ణ , ఆత్రేయ , సి నారాయణరెడ్డి , ఆ పాటల్ని పాడిన సుశీలమ్మ , బాల సుబ్రమణ్యం , యస్ జానకిలు .

సి నారాయణరెడ్డి వ్రాసిన కనులలో నీ రూపం మనసులో నీ గీతం పాట కూడా చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది . మిగిలిన పాటలు ఉప్పు చేపా పప్పు చారు , ఉస్కో ఉస్కో పిల్లా , ఆకలెంతో దాహమెంతో అంతే అంతే మోహం వ్యామోహం , ప్రేమంటే తెలుసా నీకు బాగా పాపులర్ అయ్యాయి . రవివర్మకే అందనీ ఒకేఒక అందానివి పాట మాత్రం సూపర్ డూపర్ హిట్ . చిత్రీకరణ కూడా బాగుంటుంది .

jayachitra
ఈ సినిమాకు మరో విశేషం ఉంది . ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారొచ్చారట . తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాదుకు రావాలని దాసరితో అన్నారట . ప్రభుత్వం స్థలం ఇస్తే వచ్చేస్తాం అన్నారట . అర్జీ పెట్టండి ఏర్పాటు చేస్తానని అన్నారట . 13 మంది సభ్యులతో ఒక కమిటీని వేసి అర్జీ పెట్టుకున్నారట . ఆ ప్రయత్నం ఫలితమే ఈనాటి ఫిలింనగర్ .

అక్కినేనికి ఈ రఫ్ పాత్ర , గెటప్ ఆరోజుల్లో అక్కినేని అభిమానులకు బాగా హుషారు చేసింది . గ్లామర్ని లత , జయచిత్రలు జోడించారు . ఇతర ప్రధాన పాత్రలలో మురళీమోహన్ , ప్రభాకరరెడ్డి , అల్లు రామలింగయ్య , మోహన్ బాబు , మాడా , కె వి చలం , త్యాగరాజు , ముక్కామల , షావుకారు జానకి , జయమాలిని , ఉషాచౌదరి ప్రభృతులు నటించారు .

రవివర్మకే అందనీ ఒకేఒక అందానివి పాట కోసమే ఈ సినిమా రెండోసారి కూడా చూసా . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . అక్కినేని , దాసరి అభిమానులు చూడవచ్చు . లత అందంగా ఉంటుంది . లత అభిమానులు కూడా చూడొచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………. దోగిపర్తి సుబ్రహ్మణ్యం 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions