.
ప్రేరణ… బిగ్‌బాస్ హౌజులో ఈరోజు ఆటతో ఆమె బలంగా తెరపైకి వచ్చింది… టాప్ ఫైవ్ జాబితాలోకి ఎక్కినట్టే కనిపిస్తోంది…
అవినాష్ ఎలాగూ ఫైనలిస్టు… మిగతా ఆరుగురిలో ఆ నలుగురూ ఎవరు…? డౌట్ లేకుండా నిఖిల్, గౌతమ్ ఉంటారు… ఫైవ్‌లోనే కాదు, విన్నర్ రేసులో వాల్లే బలమైన పోటీదారులు అనిపిస్తోంది…
Ads
నిఖిల్ ఎమోషన్‌లెస్‌గా ఓ బండ మనిషిలా కనిపిస్తాడు… కావ్యతో బ్రేకప్ మీద మాట్లాడినప్పుడు మాత్రమే కాస్త ఎమోషనల్ అయ్యాడు… ఫిజికల్‌గా స్ట్రాండ్… ఫస్ట్ నుంచీ సూపర్ ప్లే తనది… టాస్కులు, గేమ్స్, చాలెంజులు ఏదైనా సరే…
తనకు దీటుగా ఉన్నది గౌతమ్… కానీ తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ… మొదటి నుంచీ ఉన్నవాడికే విన్నర్ అవకాశం ఉండాలనేది ఓ నైతికాంశం… పైగా గౌతమ్‌కు నోటి దురుసు… ప్రత్యేకించి అక్కలు అంటూ వెటకారాలు, వెక్కిరింపులు తనకు మైనస్… వితండవాదం చేస్తాడు…
సో, అవినాష్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్ సరే… ఆ ఒక్కరూ ఎవరు..? బహుశా నబీల్,.. ఎందుకంటే…? ఈమధ్య ఇరిటేట్ అవుతున్నాడు, బ్యాలెన్స్ కోల్పోతున్నాడు గానీ… నిజాయితీగా ఆడుతున్నాడు… రోహిణికి, విష్ణుప్రియకు కొన్ని పరిమితులున్నాయి…
సరే, ప్రేరణ విషయానికి వస్తే… ఎమోషన్స్… ఆనందం, దుఖం, కోపం అన్నిరకాల ఎమోషన్స్… ఏదీ దాచుకోదు, ఏదైనా పద్ధతిగా ఆడుతుంది, పనిచేస్తుంది… చిన్న పిల్లలా ఎగురుతుంది… ప్రతి టాస్కులో మ్యాగ్జిమం ట్రై చేస్తుంది…
ఈరోజు తమ పెళ్లి వీడియో చూశాక ఆమె మరింతగా ఆడియెన్స్‌కు కనెక్టవుతుంది… వోట్ అప్పీల్‌కన్నా ఇదే ఎక్కువ అప్పీలింగ్… భర్త పట్ల తన ప్రేమను వ్యక్తీకరించడంలో కూడా ప్రేరణ తీరు బాగుంది… ఇది చూసి ఈరోజు గెస్టుగా వచ్చిన ఓంకార్, సారీ, ఓహోంకార్ అనాలేమో… ప్రేరణను చూసి ఇన్‌స్పయిర్ అయిపోయి, రాబోయే ఇస్మార్ట్ జోడికి ప్రేరణ జంట పాల్గొనాలని కోరుకున్నాడు…
రోజుకో గెస్టు వస్తున్నాడు కదా… అది బాగుంది… ఈరోజు టీవీ సెలబ్రిటీ ఓంకార్ వచ్చాడు… సరే, కాసేపు ఏదో ఆట… ఫన్… పనిలోపనిగా ఇస్మార్ట్ జోడి మూడో సీజన్‌కు ప్రమోషన్ కూడా పూర్తిచేసుకున్నాడు… దానికీ ఓ ప్రోమో… సినిమా భాషలో ట్రెయిలర్ కూడా చూపించాడు… పర్లేదు, బాగుంది…
రేపు వీకెండ్ షో, బహుశా రేపు ఒకరిని, ఎల్లుండి మరొకరిని ఎలిమినేట్ చేస్తారేమో… డబుల్ ఎలిమినేషన్ ఉంటేనే చివరివారం టాప్ ఫైవ్ మిగులుతారు… వెళ్లిపోయేది విష్ణుప్రియ, రోహిణేనా..?!
Share this Article