.
ఒక్కటి నచ్చింది… బిగ్‌బాస్ హౌజులో మొదటి నుంచీ అందరి బ్రేకప్ స్టోరీలను గనుక వినిపించి ఉంటే ఎలా ఉండేదో గానీ… ఇప్పుడు టాప్ ఫైవ్ కంటెండర్లు తమ బ్రేకప్ స్టోరీలు వినిపించారు…
నటి సుహాసిని అడిగిన ప్రశ్నతో అందరూ మనసులు విప్పారు ఎంతో కొంత… ఒక్క అవినాష్ తప్ప… భార్య అపార్థం చేసుకుంటుందని భయపడ్డాడో ఏమో… కానీ ప్రేరణ, నబీల్, గౌతమ్ సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు… వాళ్ల మెచ్యూరిటీ లెవల్స్ కనిపించాయి…
Ads
అసలు లైఫే చాలా చిన్నది… అందులో బ్రేకప్ అనేది మరీ చిన్న విషయం… దానికోసం లైఫ్‌లో ఏదో కోల్పోయినట్టు ఫీలై, ఏదో చేసేసుకోవడం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం శుద్ధ దండుగ అనే పరిణతిని తమ సొంత బ్రేకప్ ఉదాహరణలు, తామెలా ఆ ఎమోషనల్ డిప్రెషన్ నుంచి బయటికొచ్చామో చెప్పగలిగారు…
జీవితంలో ఏదైనా సాధించడానికి ప్రయత్నిస్తే, ఆ ఎమోషనల్ లో నుంచి బయటపడొచ్చనీ, కాకపోతే కుటుంబసభ్యులు, మిత్రులు సహకారం అవసరమనీ చెప్పుకొచ్చారు… ప్రేరణ బాగా చెప్పింది… ఆమె అప్పుడప్పుడూ చిన్న పిల్లలా కనిపించినా సరే, తన ఆలోచనల్లో మెచ్యూరిటీ లెవల్స్ ఉన్నాయి…
బ్రేకప్‌తో కుంగిపోకుండా… కొంత వెయిట్ చేస్తే, పరిస్థితులు చక్కబడతాయి, లేదంటే కొత్త దారి తీసుకుని లైఫులో కొత్త ఆశలు కనిపిస్తాయి, నడిపిస్తాయి అన్నదామె… తన సొంత ఉదాహరణే… శ్రీపాదతో కూడా దాదాపు బ్రేకప్, అడ్డంకులు అన్నీ టైమ్ సాల్వ్ చేసిందనీ, చివరకు ఒక్కటయ్యామని వివరించింది…
నబీల్‌ది మరీ స్కూల్ ఏజ్ బ్రేకప్… లైట్ తీసుకుని, కెరీర్‌లో ఏదో సాధించాక, చేతిలో నాలుగు డబ్బులుంటే, అప్పటికి మెచ్యూరిటీ వస్తే అప్పుడు లైఫ్, లవ్ బాగుంటాయనేది తన అవగాహన… గౌతమ్ కుటుంబసభ్యుల సపోర్టుతో బయటపడ్డానని చెబుతూ టీనేజీ లవ్వులే ప్రమాదకరమనీ, పేరెంట్స్ కూడా కోపంతో గాకుండా కాస్త ఓపికగా, ప్రేమగా టీనేజ్ బ్రేకప్పుల నుంచి పిల్లలను బయటికి తీసుకురావాలని చెప్పుకొచ్చాడు…
నిఖిల్ తన లవర్ కావ్య గురించి చెబుతాడు అనుకుంటే… కాదట, ఏదో కాలేజీ లవ్వు గురించి చెప్పాడు… కానీ తన మనసులో ఉన్నది సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాడు… మిగతా అన్ని విషయాల్లో బండగా కనిపిస్తాడు గానీ లవ్, బ్రేకప్ విషయంలో ఏదో తనను బాధిస్తున్నట్టుంది… గతంలోనూ తన పెయిన్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాడు, కానీ ఎమోషనల్‌గా లో ఫీలవుతున్నట్టు కనిపిస్తూనే ఉంది…
పిచ్చి పిచ్చి టాస్కులు, గొడవలు గాకుండా… ఇదుగో ఇలాంటివి బాగా ప్రసారం చేయగలిగితే బిగ్‌బాస్ చూసే యువత, ప్రత్యేకించి టీన్స్‌లో ఆకర్షణనే ప్రేమ అనుకుని పొరబడే, తప్పుదోవన పడిపోయే పిల్లలకు ఉపయోగకరం… ఆ సిట్యుయేషన్ల నుంచి ఎలా బయటపడొచ్చో కూడా ఇలాంటివి దోవ చూపిస్తాయి..!!
Share this Article