.తెలంగాణలో, హైదరాబాదులో వాళ్లకు ఆస్తులు ఉండాలి… వాళ్ల చుట్టూ బౌన్సర్లు ఉండాలి… గన్నులు, గంజాయి, క్లబ్బులు, పబ్బుల సంస్కృతి గలవాళ్ళ సినిమాల కోసం జనం చావుకైనా తెగబడాలివాళ్లు ప్రజల ప్రాణాలకు విలువియ్యరు… ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించరు… కనీసం
తెలంగాణ ఏడాది ఉత్సవాలను ఆదరించరు… అందులో వారెవరు భాగస్వాములు కారు…సినిమోళ్ల పట్ల సామాన్యుల తీరు మారాలి… సినీనటుల ధనహంకారాన్ని జనం, చట్టాలు, న్యాయ స్థానాలు గుర్తించాలి…..ఇదీ అల్లు అర్జున్ అరెస్టు తరువాత తెలంగాణ సమాజం స్పందించిన తీరు… మరొక పోస్టు చూద్దాం….దమ్ముంటే పట్టుకోరా శేఖవాతహు… అని డాన్స్ వేసి సినిమా హీరోని… చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చెయ్యడం ఏంటో….
.
.
1. రీల్ లైఫులో హీరో కావచ్చు, రియల్ లైఫ్‌లో విలన్
2. మేం అన్నింటికీ అతీతులం అనే తిక్క భ్రమల బ్రేక్
3. ఈరోజుకైనా పొలిటికల్ పవర్ మాత్రమే ultimate
.పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం.. ఉన్నపళంగా తమతో రావాలంటే ఎలా?.. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా?.. పోలీసులు తీసుకెళ్లడంలో నాకు అభ్యంతరం లేదు-అల్లు అర్జున్.
చట్టం తలుచుకుంటే… రాజ్యం సంకల్పిస్తే… ఏ పుష్పరాజ్ కూడా అతీతుడు కాదు… జనం చస్తున్నా సరే, మా పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తాం అనుకునే రోజులు కావు ఇవి… ఎస్, నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చినోడికి, అర్జున్‌ను అరెస్టు చేసినోడికి మోహన్‌బాబు అనే దుష్టుడు ఎందుకు కనిపించడం లేదనేదీ వాజీబు ప్రశ్నే….వెయిట్… ఇలా చేస్తే హైదరాబాదు వదిలిపోతాం అనే బెదిరింపులు ఇక చెల్లవు… మీ ఖర్మ, మీరు ఇక్కడే ఉండటం కోసం ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కడం ఉండదు అనే సంకేతం ఇది… నిజంగానే రేవంతుడు ఇదే స్పూర్తితో ఉంటే చాలా బెటర్…తరలిపోవడానికి అక్కడేమీ లేదు, ఉత్త బెదిరింపులు తప్ప… ఇప్పటికే హైదరాబాద్ పొల్యూట్ అయిపోయింది ఈ పుష్ప మార్క్ బెదిరింపులతో… ఈ స్థిరవైఖరిని రేవంత్ కొనసాగిస్తే తెలంగాణ సమాజం మెచ్చుకుంటుంది…ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషనల్ వార్త, పుష్పరాజ్‌ను అరెస్టు చేశారట… ఎస్, మేం జనానికే తప్ప, ఈ సినిమా వాళ్ల శుష్క బెదిరింపులకు లొంగేవాళ్లం కాం అనే రేవంత్ సంకేతం ఇది… ఎన్ కన్వెన్షన్, ఏఏ రాజ్యం… అన్నీ బ్రేక్ చేస్తామనే ‘రాజ్యం హెచ్చరిక…’ఇది సినిమా కాదు… ఓ మహిళను చేజేతులా బలిగొన్న అరాచకం తనది… పోలీసులకు చెప్పరు, భద్రతచర్యలు ఉండవు… జనమంటే, ప్రేక్షకులంటే టికెట్ల రేట్లలోనే కాదు, ఇలాంటివీ వాళ్లకు పట్టవు… ఎస్, ఆ టికెట్ రేట్ల పెంపులో రేవంత్ సర్కారు ఘోర వైఫల్యం, ఆలోచనారాహిత్యం ఉండవచ్చుగాక… కానీ కడుక్కుంటున్నారు కదా… గుడ్…అల్లు అర్జున్‌కు ఏమీ కాదు… కోట్లు తీసుకునే లాయర్లు, కోర్టులు అండ… ఇదుగో ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడాలి… వాట్ ఎవర్ మే కమ్… మరి మోహన్‌బాబు మీద ఎందుకీ ప్రేమ అంటారా…? వెయిట్ అండ్ వాచ్… ‘‘వాడు మరీ దరిద్రుడు…!!తెలంగాణ జాగో ఆంధ్రావాలా బాగో అని పిలుపులు ఇచ్చి… తరువాత వాళ్ల కాళ్లల్లో ముళ్లు నోటితో పీకిన రారాజు రోజులు కావు ఇవి… ఓ తెలంగాణ కవి మరణిస్తే పరామర్శించే దిక్కులేక, సినిమావాళ్లకు అధికారిక అంత్యక్రియలు జరిపించిన మహా దుర్దినాలు కూడా కావు ఇవి….బీఆర్ఎస్ దీన్ని కూడా డైవర్ట్ చేస్తుంది… లగిచర్ల రైతుకు బేడీల ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడానికి ఈ అరెస్టు అని….. అంటే, ఓ నేరగాడిని సపోర్ట్ చేస్తుందా బీఆర్ఎస్…. రైతు బేడీలపై ఆల్రెడీ ప్రభుత్వం తలదించుకుంది సిగ్గుతో… ఎవరెవరినో సస్పెండ్ చేసింది… తప్పు అంగీకరించింది… అది వేరు, ఇది వేరు…చివరాఖరు :: అంతా ఫ్యాన్స్ మధ్య వైరం పెంచి పాపులారిటీని పెంచుకునే పిచ్చి డ్రామాలు… అరెస్టు వార్త వినగానే హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు బయల్దేరిన మెగాస్టార్… సమజైందా..!!
Share this Article
Ads