.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో ట్విస్టు… మరో కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది… ఇదే నిజమైతే అల్లు అర్జున్, రష్మిక మంధానతోపాటు స్పెషల్ షోకు హాజరైన పుష్ప2 టీం ఇబ్బందుల్లో పడ్డట్టే…
ఇప్పటిదాకా అందరూ ఏం వాదిస్తున్నారు..? పోలీసులకు సంధ్య థియేటర్ సమాచారం ఇచ్చినా సరే, పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదనీ, అల్లు అర్జున్‌కు నేరుగా ఆ తొక్కిసలాటకు సంబంధం లేదని కదా…
Ads
సంధ్య థియేటర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన కాపీ కూడా ప్రచారంలోకి వచ్చింది కదా… కానీ పోలీసులు అనుమతించలేదనీ, పైగా సెలబ్రిటీలు వస్తే క్రౌడ్ మేనేజ్‌మెంట్ ఆ థియేటర్‌లో అస్సలు సాధ్యం కాదనేది ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన కొత్త వార్త…
ఇదీ సంధ్య థియేటర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్న కాపీ… దీన్నే బన్నీ, వైసీపీ ఫ్యాన్స్ విస్తృతంగా సోషల్ మీడియాలో పుష్ చేశారు,.. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది దీని అనంతరం చిక్కడపల్లి పోలీసులు లిఖితపూర్వకంగా సంధ్య థియేటర్‌కు పంపించిన కాపీ… ఇదుగో…
ఒకవేళ ఇది ఫేక్ గాకుండా ఉంటే… ఇందులో ఇన్‌స్పక్టర్ స్టాంప్, ముట్టినట్టుగా సంధ్య థియేటర్ వేసిన స్టాంప్ కూడా ఉన్నాయి… (నా ప్రాథమిక సమాచారం మేరకు ఇది నిజం లేఖే…)
‘‘రెస్టారెంట్ పక్కనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉంది థియేటర్… సంధ్య 70 ఎంఎం, 35 ఎంఎం రెండూ ఒకే కంపౌండ్… సంధ్య 70 ఎంఎం స్క్రీన్‌కు విడిగా ఎంట్రీ, ఎగ్జిట్ లేవు… సింగిల్ ఎంట్రీ కారణంగా స్పెషల్ షో, న్యూ రిలీజ్ సందర్భంగా ఒకవేళ సెలబ్రిటీలు గనుక వస్తే క్రౌడ్ మేనేజ్‌మెంట్ కష్టం… అందుకే స్పెషల్ షో కోసం హీరోహీరోయిన్లు, ఇతర టీం రావద్దని చెప్పాల్సిందిగా థియేటర్‌కు సూచించబడింది..’’
ఇదీ ఆ లేఖ సారాంశం… ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు శ్రీతేజ ఈరోజుకూ చావుబతుకుల్లో ఉండటం తెలిసిందే… థియేటర్ మేనేజర్, ఓనర్, సెక్యూరిటీ ఇన్‌చార్జిలతోపాటు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన సంగతీ తెలిసిందే… జాతీయ స్థాయిలో చర్చ జరిగింది…
హైకోర్టు బెయిల్ ఇచ్చాక మొత్తం ఇండస్ట్రీ బన్నీ ఇంటి ముందుకు క్యూ కట్టింది పరామర్శ కోసం… ఐతే రావద్దు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ కష్టమని చెప్పినా సరే… సంధ్య థియేటర్ ఆ సినిమా టీంకు ఈ సమాచారం ఇచ్చిందా..? ఇచ్చినాసరే వినిపించుకోకుండా వచ్చారా..? ఒకవేళ ఈ లేఖ నిజమైతే తొక్కిసలాట కేసు ఇంకా బలంగా బిగుసుకున్నట్టే… బన్నీ అపరాధి అవుతాడు..!!
అవునూ… అల్లు అర్జున్‌కు సూటిగా ఓ ప్రశ్న… లీగల్ ప్రొసీడింగ్స్ కదా, రేవతి కొడుకు దగ్గరకు, ఆ కుటుంబం దగ్గరకు వెళ్లలేదనే ఓ డొల్ల సాకు చెబుతున్నావుగా హీరో… ఏ లీగల్ ప్రొసీడింగ్స్ దానికి అడ్డుపడ్డాయో మీ లాయర్‌తో చెప్పించగలవా..? మరి మోహన్‌బాబు టీవీ9 జర్నో దగ్గరకు ఎలా వెళ్లగలిగాడు..? తనకు లీగల్ ప్రొసీడింగ్స్ అడ్డుపడలేదా..? ఏమిటిదంతా..!!
Share this Article