.
( Nallamothu Sridhar Rao ) ……. పబ్ కల్చర్ నుండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కి వస్తున్నారంటే.. విశృంఖలమైన జీవితం నుండి ఆధ్యాత్మికత వైపు వస్తున్నారంటే తెలీట్లేదా?
ఒక చిన్న కధతో మొదలుపెడతాను. 20 ఏళ్ల యువకుడు.. ఫ్రెండ్స్‌తో రోజూ చల్లటి బీర్ తాగడం అలవాటైంది.. అది మెల్లగా శృతిమించింది.
Ads
దాంతో పాటు నైట్ లైఫ్ అంటూ వేకువజాము 2- 3 గంటల దాకా తిరుగుతూ, వేళాపాళా లేకుండా తినడం అలవాటైంది. రెండేళ్లు బిందాస్‌గా గడిచింది. ఆ తర్వాత గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అన్నారు. గాల్ బ్లాడర్ తీసేయన్నారు. చిన్న వయస్సులోనే శరీరంలోంచి ఓ అవయవం పోయింది.
ఇక అప్పటి నుండి రాత్రి 7 గంటలకి తినడం మొదలుపెట్టాడు. రకరకాల చెత్త తిండి అంతా తినేవాడు కాస్తా చాలా సాత్వికాహారానికి మారిపోయాడు. ఇష్టమొచ్చినట్లు తిని, లేదా వత్తిడి పెంచుకుని, లేదా సరిగా నిద్రపోక ఊబకాయానికి లోనైన ప్రతీ ఒక్కరూ ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కి మారడానికి ఇదే కారణం.
సాయంత్రం 6 గంటలకే మన పూర్వీకులు తినే వాళ్లంటే.. వెకిలిగా నవ్వే వాళ్లు. ఇప్పుడు చచ్చినట్లు తమ ఒంటి మీదకు వచ్చే సరికి అలా తింటున్నారు. విశ్వంలో కొన్ని రిథమ్స ఉంటాయి. సర్కాడియన్ రిథమ్ అలాంటిది. దాన్నే బయలాజికల్ క్లాక్ అంటాం.
ఇది రోజు మొత్తంలో మొత్తం 12 మెరీడియన్స్‌ని ఒక్కొక్కటి 2 గంటల చొప్పున సమర్థంగా పనిచేసేలా చేస్తుంది. వీటిలో మధ్యాహ్నం 2 గంటల వరకూ శక్తిని ఇచ్చేవి ఉంటాయి. ఉదాహరణకి.. ఉదయం 7 నుండి 9 గంటల వరకూ స్టమక్ మెరీడియన్ యాక్టివ్‌గా ఉంటుంది. అంటే మనం ఆహారం తీసుకోవడానికి అనుకూలమైన సమయం.
ఆ తరవాత అలా తీసుకున్న ఆహారాన్ని ప్రాణశక్తిగా మార్చే Spleen మెరీడియన్ 9 నుండి 11 మధ్య యాక్టివ్‌గా ఉంటుంది. ఆ తర్వాత 11 నుండి 1 మధ్య హార్ట్ మెరీడియన్ యాక్టివ్‌గా ఉంటుంది. లంచ్ చెయ్యడానికి ఇది బెస్ట్ టైమ్.
ఆ సమయంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండి ఫుడ్ బాగా అరుగుతుంది. 1 నుండి మూడు గంటల మధ్య Small Intestine మెరీడియన్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇది అప్పుడే చేసిన లంచ్‌లోని పోషకాలను సక్రమంగా గ్రహిస్తుంది. ఇప్పటి వరకూ ఉన్నవన్నీ శక్తిని పెంచేవి.
మధ్యాహ్నం మూడు గంటల నుండి విసర్జకావయవాలు ఎక్కువ పాత్ర పోషిస్తాయి. 3 నుండి ఐదు గంటల మధ్య బ్లాడర్, 5 నుండి 7 గంటల మధ్య కిడ్నీ మెరీడియన్ యాక్టివ్‌గా ఉంటాయి. ఇవి ద్రవరూపంలో శరీరంలోని కాలుష్యాలను బయటకు పంపిస్తాయి.
ఆ తర్వాత రాత్రి 7 నుండి తొమ్మిది గంటల మధ్య మరో ముఖ్యమైన అంశం.. పెరీకార్డియన్ మెరీడియన్. ఇది భావోద్వేగాలు, మానసిక వత్తిడులను, భయాలు, కోపాలు, దుఖాలను బ్యాలెన్స్ చేస్తుంది. మీరు గమనిస్తే రాత్రి పడుకునే సమయానికి రాత్రి 9 గంటల తర్వాత శరీరం దానంటత అదే చల్లబడి సుఖంగా నిద్రకి సిద్ధం కావడం గమనించవచ్చు.
దానికి కారణం 9 నుండి 11 గంటల మధ్య ట్రిపుల్ వార్మర్ మెరీడియన్ పనిచేస్తుంది. ఇది శరీరం మొత్తం మూడు ప్రదేశాల్లో (పొత్తి కడుపు నుండి క్రిందకు), పొత్తి కడుపు నుండి ఊపిరితిత్తులకి మధ్య), ఊపిరితిత్తుల నుండి తలభాగం) వరకూ నీటిని సక్రమంగా బ్యాలెన్స్ చెయ్యడానికి పనికొస్తుంది. ఇలా నీటిని బ్యాలెన్స్ చెయ్యడం ద్వారా శరీరంలో ఉష్ణోగ్రత సమస్థాయిలో ఉండేలా కాపాడుతుంది.
ఆ తర్వాత రాత్రి 11 నుండి 1 మధ్య గాల్ బ్లాడర్, 1 నుండి మూడు మధ్య లివర్ కొవ్వులను, టాక్సిన్‌లను శుభ్రపరుస్తాయి. బైల్ జ్యూస్ తయారు చేస్తాయి. 3 నుండి 5 మధ్య ఊపిరితిత్తులు సమర్థంగా పనిచేసి అందులోని టాక్సిన్లని దగ్గు రూపంలో బయటకు పంపుతాయి. అందుకే కొంతమందికి వేకువజామున దగ్గు వస్తుంది, లేదా ముక్కులు బిగదీస్తాయి లేచేసరికి!
ఆ తర్వాత చివరి విసర్జకావయవం పెద్ద ప్రేగు.. ఇది ఉదయం 5 నుండి మధ్య సమర్థంగా పనిచేస్తుంది. అప్పుడు బాత్రూమ్‌కి వెళ్లడం మిస్ అయితే, ఇది చాలాకాలం కొనసాగితే చాలామందికి ఇక ఈ విషయంలో ఇబ్బందే!
ఇప్పుడు చెప్పండి.. నా శరీరం నా ఇష్టం అని విర్రవీగితే, పైవన్నీ కొన్నాళ్లే కోఆపరేట్ చేస్తాయి. తర్వాత చచ్చినట్లు దారికి రావాలి.
ఇకపోతే మనకు ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం ఉండేది. . యోగి పుంగవులు, సాధకులు ఉండే వారు. కానీ ఇంగ్లీష్ విద్యావిధానం వచ్చాక లాజికల్ థింకింగ్ పేరిట సైన్స్, మేథ్స్ వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చాక, సాధన తగ్గిపోయాక, సైన్స్ పేరిట పూర్వ జ్ఞానాన్ని అపహాస్యం చెయ్యడం మొదలుపెట్టాక.. మనిషిలో ఈ లాజిక్ వల్ల సపరేషన్ పెరిగి, ఇగో పెరిగి నేనే గొప్ప అనే నైజం పెరిగి, దీనికి ఆధ్యాత్మికత సొల్యూషన్ అనేది ఒప్పుకోలేక అలా డబ్బులోనూ, విలాసాల్లోనూ, సంభోగంలోనూ ఆనందం వెదుక్కుంటూ వస్తున్నాడు.
మనుషులకి మధ్య దూరం పెరిగితే ఏర్పడేది ఒంటరితనమే. ఇప్పుడు భారతీయ సమాజం ఆ ఒంటరితనం అంచున ఉంది. ఒంటరితనం సంఘర్షణని పెంచుతుంది. ప్రతీదీ ద్వైతంగా కనిపిస్తుంది. భయపెడుతుంది. ఎంతలా చిరాకు పెడుతుంది అంటే.. టైప్ చేస్తుంటే సహకరించని కీ మీద కూడా కోపం వస్తుంది. అద్వైతం అర్థమైతే ఈ భావోద్వేగాలన్నీ సమసిపోతాయి.
మరో వైపు వెస్ట్రన్ సొసైటీ చాలా తరాల బాటు సైన్స్‌ని నమ్ముకుని ఒంటరితనంలో బ్రతికి, మానసిక సమస్యలతో గన్ కల్చర్ పెరిగి ఇప్పుడు మనకంటే కొన్ని వందల రెట్లు ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నారు. వాళ్ల పుస్తకాల్లో, బోధనల్లో సగం మన రమణ మహర్షి గురించి, ఆది శంకరాచార్య గురించి ఉంటాయి.
కాబట్టి వెస్ట్రన్ కల్చర్, తిని తిరిగి ఏదో బావుకుంటున్నాం అని మాయలో కూరుకుపోయి పోగొట్టుకుంటున్నదంతా తిరిగి తెలుసుకుని ఆధ్యాత్మికత వైపు మన దేశం మళ్లే రోజు త్వరలో వస్తుంది.
అలాంటి మార్పుకి నేను జీవించి ఉన్నంత కాలం ఓ సమిధగా ఉంటాను. – నల్లమోతు శ్రీధర్
Share this Article