.
కొన్ని సైట్లలో మరీ అల్లు అర్జున్ మీద వార్తలు కొత్త కొత్త ధోరణులతో సాగుతున్నాయి… జాతీయ స్థాయిలో సంచలనం రేకెత్తిస్తున్న కేసు కాబట్టి అందరూ ఏవేవో కొత్త కోణాలు వెతికి మరీ రాస్తుంటారు సహజమే… కానీ ఒకటి కాస్త నవ్వు పుట్టించింది…
ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూ అనుకుంటా… ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో తెర మీదకు వచ్చే నటి కస్తూరి అందులో మాట్లాడుతూ జైలులోకి ఎంట్రీ అంటే, ముందుగా మొత్తం బట్టలు విప్పి చెక్ చేస్తారు తెలుసా అని ఏదో చెబుతోంది… అల్లు అర్జున్‌ను కూడా అలాగే చెక్ చేసి ఉంటారనీ చెప్పింది…
Ads
దాంతో కొన్ని సైట్లు, చానెళ్లు అల్లు అర్జున్‌ను నగ్నంగా జైలులో ఉంచారా…? అంటూ తమదైన చిత్రమైన థంబ్ నెయిల్స్ పెట్టేసి కథలు రాసేశాయి…
(ఇది ఓ సింబాలిక్ ఫోటో మాత్రమే… నాంది సినిమాలో అల్లరి నరేష్… అదీ జైలులో కాదు, లాకప్పులో… విచారణ దశలో దృశ్యం…)
అవును, జైలులోకి ఎవరు వెళ్లినా థరో చెకప్స్ తప్పవు… జాతీయ అవార్డు విజేతలని చూడరు… జైలు మాన్యుయల్ ఏది చెబితే అదే చేస్తారు… తనిఖీల తరువాతే నంబర్ కేటాయిస్తారు… సరే, ఈ వార్తలు ఎలా ఉన్నా… దొరికారు కదాని ఒక్కొక్కరు తెగ డిమాండ్లు చేసేస్తున్నారు…
జానీ మాస్టర్ జాతీయ అవార్డు వాపస్ తీసుకున్నందుకు అల్లు అర్జున్ అవార్డు ఎందుకు వాపస్ తీసుకోకూడదు..? సరే, ఇది కాస్త సరిగ్గానే ఉంది… మరీ కొందరైతే పుష్ప2 లాభాల్లో సగం రేవతి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్… ఇంకొందరు మొత్తం ఇవ్వాలని..!
అల్లు అర్జున్ ఏకంగా 2 కోట్లతో రేవతి పేరిట ట్రస్టు పెడతాడనీ… అందులో సుకుమార్ 50 లక్షలు అట, హీరోయిన్ రష్మిక మంధాన 50 లక్షలు అట, అల్లు అర్జున్ కోటి రూపాయలట… ట్రస్టుతో ఆమె కుటుంబానికి ఏం ఒరుగుతుందనేది పక్కన పెడితే… పుష్ప సినిమా నిర్మించిన మైత్రీ మూవీస్ 50 లక్షల చెక్ ఇచ్చిందని వార్తల్లో వచ్చింది… అది ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సాయం అని మరికొందరు రాశారు…
ఎవరు ఇచ్చినా సరే, అది మానవీయ కోణం కాబట్టి నో కామెంట్స్… మంత్రి కోమటిరెడ్డి తన కొడుకు పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు తరఫున 25 లక్షలు ఇస్తున్నాడు… అసలు అల్లు కుటుంబం పరిహారం మాటేమిటి, 25 లక్షలు అని ఏదో అన్నట్టు గుర్తు, ఇచ్చారంటారా..? తెలియదు..! సంధ్య థియేటర్ సంగతేమిటి..? దోషంలో భాగస్వాములు కదా..!
కొందరు కొంటె కోణంగులు మాత్రం శృతి తప్పి కామెంట్లు పెడుతున్నారు… సీఎం మీద వ్యక్తిగతంగా కూడా సోషల్ మీడియాలో బోలెడు పోస్టులు… చివరకు అల్లు అర్జునే నా ఫ్యాన్స్ పేరిట ఏదిపడితే అది పోస్టు చేయకండిరా బాబూ అని విజ్ఞప్తి చేసుకోవాల్సి వచ్చింది…
ఇంకెవరో ఇలా డిమాండ్ చేస్తున్నాడు నెట్‌లో… ఆ తొక్కిసలాటలో రేవతిని కోల్పోయాడు ఆమె భర్త… పిల్లలు ఇద్దరూ తల్లి లేనివారయ్యారు… కాబట్టి రష్మిక మంధాన తనను పెళ్లి చేసుకోవాలట… నవ్వుకోవడానికే రాసినా సరే, నీచాభిరుచి… గతి తప్పిన కామెంట్లు… ఎవడికి ఏది తోస్తే అది… విజయ్ దేవరకొండా..? వింటున్నావా..?!
ఈరోజు బన్నీ పోలీసుల విచారణకు హాజరు కాబోతున్నాడు… బెయిల్ రద్దుకై పోలీసులు పిటిషన్ వేయనున్నారనీ వార్తలు… అన్ని వీడియోలు అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తున్నాయి కాబట్టి… తను అడమెంటుగా అబద్ధాలు ఆడుతూ ప్రభుత్వాన్ని, పోలీసులను నిందిస్తున్నాడు కాబట్టి, ప్రభుత్వమూ కాస్త సీరియస్‌గానే తీసుకుంటోంది… బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా స్పందించేకొద్దీ కాంగ్రెస్ ఇంకాస్త బిగిస్తుంది..!!
Share this Article