Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి మూవీ మొఘల్‌కు జనంపై ఈ కక్ష ఏమిటో మరి..!!

December 26, 2024 by M S R

.

.    ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..         … జనం మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే జనమే కక్ష తీర్చుకున్నారని అప్పట్లో జోకులు వేసుకునే వారు ఈ సినిమా చూసొచ్చాక . విసి గుహనాధన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా . కధ , స్క్రీన్ ప్లే కూడా ఆయనదే . షోలే సినిమాను కాపీ కొట్టాడు . ఆ కోట్టేదేదో ఫుల్లుగా కొట్టేసినా బాగా ఆడేది . పాతిక షోలే నేత , ముప్పాతిక గుహనాధన్ నేత . కలగాపులగం . రామానాయుడు అంతటి సినిమా ఘనాపాటి ఎలా బోల్తా పడ్డాడో ఏమో మరి !

భారీ సెట్టింగులతో , భారీ ఖర్చుతో , భారీ తారాగణంతో తీసినా ఏవరేజుగా మాత్రమే ఆడింది . భారీ కక్ష , పగ , ప్రతీకారం సినిమా . సినిమా పేరే కక్ష కదా ! షోలే సినిమాలో సంజీవ్ కుమార్ చేతులు నరకబడ్డట్లు ఈ సినిమాలో జమున చేతుల్ని నరికేస్తాడు విలన్ సత్యనారాయణ .

Ads

జమున తన కక్ష తీర్చుకోవటానికి జైలు నుండి విడుదలయిన హీరో శోభన్ బాబుని నియమించుకుంటుంది . తర్వాత హీరోకి ఆమే తన తల్లి అని తెలుస్తుంది . హీరో చెల్లెలు మరొకతని వద్ద పెరుగుతుంది . మళ్ళా షోలే సినిమాలో లాగా చివర్లో గుర్రాలు , విలన్ని జమున ముందు పడేయటం , ఆమె తుపాకీతో చంపేయటం వంటి వాటితో సినిమా ముగుస్తుంది .

శోభన్ బాబు హుషారుగా , అందంగా కనిపిస్తారు . డ్యూయెట్లు , గ్రూపు డాన్సుల్లో అతిలోకసుందరి శ్రీదేవితో కలిసి అదరకొడతాడు . శ్రీదేవి చలాకీగా నటిస్తుంది . మోహన్ బాబుది పాజిటివ్ పాత్ర . మూడు మతాల పేర్లను కలిపి పెట్టుకుంటాడు . జేమ్స్ శేఖర్ ఖాన్ . ఆంధ్రా యూనివర్శిటీలో మాకో మిత్రులు ఉండే వారు . ఆయన పేరు జాకబ్ శాస్త్రి . మురళీమోహన్ ద్విపాత్రాభినయం . ఆయన ప్రేయసిగా , హీరో చెల్లెలుగా జయచిత్ర బాగా నటించింది .

విలనుగా సత్యనారాయణ బాగా నటించారు . రంగనాధ్ , మిక్కిలినేని , పి ఆర్ వరలక్ష్మి , శకుంతల , బాలనటుడిగా సాయికుమార్ , గుమ్మడి , బాలకృష్ణ (అంజిగాడు) , రమాప్రభ , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు . రామానాయుడు సెంటిమెంట్ ప్రకారం శ్రీదేవి పాటలో ఓ క్షణం తళుక్కుమంటారు .

ఆయనకు ఈ కక్ష సినిమా 30 వ సినిమా . బెంగళూరుకు 45 కి మీ దూరంలో ఉన్న రాంనగర్లో ఈ సినిమా కొరకు కార్లు , గుర్రాలతో భారీగా తరలి వెళ్ళి షూటింగ్ చేసారట . రెండు కొండల్ని కలుపుతూ ఓ టెంపరరీ బ్రిడ్జి కూడా కట్టారట . షోలే కూడా ఇక్కడే తీసారని అప్పట్లో అనుకునే వారు . Subject to correction .

జంధ్యాల డైలాగులు పదునుగానే ఉంటాయి . పాటల్ని ఆత్రేయ , ఆరుద్ర వ్రాసారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగానే ఉంటాయి . ఓ గ్రూప్ డాన్స్ చాలా బాగుంటుంది . శ్రీదేవి , జయచిత్రల మీద ఉంటుంది . మరొకటి ఖవాలీ పోటీ కూడా బాగుంటుంది . ఒకవైపు సత్యనారాయణ , గిరిబాబు , నటీమణి పేరు ఐడియా లేదు . మరోవైపు శోభన్ బాబు , మురళీమోహన్ , శ్రీదేవి . శ్రీదేవి , ఆ నటీమణి పోటాపోటీగా బాగా నృత్యిస్తారు .

పంచ భక్ష్య పరవాణ్ణాలను విస్తర్లో చెల్లాచెదురుగా వేసినట్లు ఉంటుంది సినిమా . సినిమాలో అన్నీ ఉన్నాయి . అన్నింటినీ ఓ క్రమంగా అరేంజ్ చేసుకోక పోవటం వలన బాగా ఆడవలసిన సినిమా ఏవరేజుగా ఆడవలసి వచ్చింది . ప్రేక్షకులు హంసల్లాంటి వారు . పాలను , నీళ్ళను చక్కగా వేరు చేయగలరు .

సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . శోభన్ బాబు , అతిలోకసుందరి అభిమానులు చూసి ఉండకపోతే చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొత్త ఉప రాష్ట్రపతిగా ఆర్ఎస్ఎస్ మార్క్ శేషాద్రి రామానుజా చారి..?
  • ఈ గుడికి వెళ్లొచ్చిన కొన్నాళ్లకే ఇందిర హత్య… మరి మోడీ సందర్శన…?!
  • Run Away… విమానాలన్నాక ఎదురెదురుగా రావా ఏమిటి..?
  • మైక్రోబరస్ట్..! కుండపోత కాదు, ఇది పైనుంచి కమ్మేసే ఓ సునామీ..!!
  • జీతెలుగు టీవీ సీరియల్ తీసేవాడికి చూసేవాడు పరమ లోకువ..!!
  • సీఎం స్వయంగా ఓసారి టాలీవుడ్ యవ్వారాలపై దృష్టిపెట్టడం బెటర్..!!
  • 70 ఏళ్ల వయస్సులోనూ యంగ్‌గా, ఆరోగ్యంగా… భలే తల్లి..!!
  • ట్రంపు… డబ్బు కక్కుర్తి మాత్రమే… నో ఎమోషన్స్, నో మోరాలిటీ…!!
  • రీఎంట్రీ సరే గానీ… కుర్ర వేషాలకు సూటయ్యే సీన్ లేదయ్యా నవీనూ..!
  • ఈ తలనొప్పిని మీకు సమర్పించువారు…!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions