.
మామూలుగా ఓ చిన్న జాతర జరుగుతూ ఉంటేనే… బోలెడు మంది చిరు వ్యాపారులు మాత్రమే కాదు… బ్రాండ్ ప్రమోషన్ల యాడ్స్ కూడా బాగా కనిపిస్తుంటాయి…
వర్తమాన వాణిజ్య ప్రపంచంలో ఎవరికైనా బ్రాండ్ ప్రమోషన్ తప్పదు… గతంలోని సంప్రదాయ మార్కెటింగ్ విధానాలు కాదు ఇప్పుడు… రకరకాల కొత్త పోకడలు వచ్చాయి… అలాంటిది కుంభమేళా వంటి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం జరుగుతుంటే ఇక యాడ్స్ సంగతి చెప్పాలా సపరేటుగా..?
Ads
ఎక్స్‌చేంజ్ ఫర్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త కనిపించింది… అదేమిటంటే..? జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా జరగబోతున్నది కదా… ప్రయాగరాజ్‌లో… మన జాతీయ ఉత్సవం అది… ఆ ఏర్పాట్లకు వందల కోట్లను ఖర్చు చేస్తుంది భారత ప్రభుత్వం…
45 రోజుల బృహత్ జాతరలో కనీసం 50 కోట్ల మంది హాజరై పుణ్యస్థానాలు చేస్తారని ఓ అంచనా… మరి అంతటి భారీ జనసందోహంతో కనెక్టయి తమ బ్రాండ్లు ప్రమోట్ చేసుకోవడానికి కంపెనీలు సహజంగానే ఆసక్తి చూపిస్తాయి కదా… గతం వేరు, ఈసారి వేరు… ప్రభుత్వం పది కేటగిరీల్లో… అంటే పోల్స్, హోర్డింగ్స్ వంటి రకరకాల కేటగిరీల్లో యాడ్స్‌ను ఏజెన్సీల కోసం టెండర్ పిలిచింది…
అంటే… నువ్వు కంట్రాక్టు దక్కించుకో, ఎంతకైనా వాణిజ్య కంపెనీలకు అమ్ముకో… ఇదీ సూత్రం… మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినిమా ఫంక్షన్ల ఈవెంట్లు, యాడ్స్ ఎట్సెట్రా యాక్టివిటీస్‌లో ఈమధ్య బాగా పాపులర్ అయిపోయి, సక్సెస్‌ఫుల్ బాటలో నడుస్తున్న శ్రేయాస్ మీడియా గ్రూప్ ఈ యాడ్స్‌లో ఏడు కేటగిరీల్లో కలిపి దాదాపు 80 శాతం వరకూ యాడ్ కంట్రాక్టుల్ని పొందింది… అచీవ్‌మెంటే…
కానీ… తమతోపాటు పూణెకు చెందిన వృత్తి అడ్వర్టైజింగ్, ఢిల్లీకి చెందిన ది క్రేయాన్స్ కూడా బరిలో ఉన్నాయి… ఒక ఛాలెంజ్… సాధారణ ధరలతో పోలిస్తే ఈసారి యాడ్ రేట్లు ఎనిమిదీ పది రేట్లు అధికంగా ఉన్నాయనీ, అందుకే అడ్వర్టయిజర్లు వెనుకాడుతున్నారనీ ఈ4ఎం అంచనా…
ఐతే… 2019 నాటి అర్థకుంభమేళా సందర్భంగా వచ్చిన యాడ్ రెవిన్యూ జస్ట్ 40 కోట్లు… అప్పటికీ ఇప్పటికీ బోలెడు మార్పు… సరిగ్గా ఆర్గనైజ్ చేస్తే ఈసారి 500 కోట్ల యాడ్ రెవిన్యూ వస్తుందని శ్రేయాస్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపు విజయకుమార్‌రెడ్డి అంచనా… ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమేటివ్ తదితర రంగాలు బ్రాండ్ ప్రమోషన్‌కు ఎంతైనా వెచ్చిస్తున్నాయనీ, 50 కోట్ల మంది హాజరయ్యే స్థలాన్ని మించి మంచి మార్కెటింగ్ స్పాట్ ఏముంటుందని తన అభిప్రాయం…
ఐనా సరే, ఓ డౌట్… వర్కవుట్ అవుతుందా..? కాకపోనీ… జాతీయ యాడ్ రెవిన్యూ మార్కెట్‌లోకి బలంగా ప్రవేశించడానికి ఓ మంచి స్కోప్… అసలే మార్కెటింగ్ వరల్డ్… మరి వాళ్లకూ ఓ రకం సొంత మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది కదా…! అందుకే ఇదంతా ఇప్పుడు తెలుగు టీవీ, సినిమా ఎట్సెట్రా ఎన్‌లైటెన్ సర్కిళ్లలో డిస్కషన్ టాపిక్..!!
Share this Article