Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వెతికీ వెతికీ చివరకు నితిశ్ కుమార్ ‘రెడ్డి’ కాదని తేల్చేశారు..!!

December 29, 2024 by M S R

.

. ( మెరుగుమాల నాంచారయ్య ) ..     …. ‘మనోడు, తెలుగోడు’ అనుకున్న నితీష్‌కుమార్‌ రెడ్డి కులం కూపీ లాగి రెడ్డి కాదు ‘రెడ్డిక’ అని తేల్చేశారు!
…………………………………….
మెల్‌బోన్‌లో ఆస్ట్రేలియాతో ఇండియా అడుతున్న నాలుగో క్రికెట్‌ టెస్ట్‌లో భారత ఆటగాడు నితీష్‌ కుమార్‌ రెడ్డి శనివారం 105 రన్స్‌ చేయగానే– ‘వాడు మనోడు, తెలుగోడి టెంపర్‌ నిరూపించాడు’– అంటూ తెలుగువారు పొగిడి పారేశారు.

అయితే, అతనికి ఇంటి పేరు లేదా దాని ఇనిషియల్‌ రాసుకునే అలవాటు లేకపోవడంతో తర్వాత అతను ఎవరు అనే తవ్వకం పనిలో పడ్డారు నెటిజనం. చివరికి కొన్ని గంటల్లోనే నితీష్‌ కుమార్‌ రెడ్డి గాజువాకకు చెందినవాడే గానీ, రెడ్డి కాదని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండే వెనుకబడిన కులం (ఓబీసీ) రెడ్డిక కుటుంబంలో పుట్టాడని తేల్చారు.

Ads

అంతేగాదు అతని ఇంటిపేరు ‘కాకి’ అనీ, అది ఎక్కువగా ఉత్తరాంధ్ర రెడ్డికల్లో ఉంటుందని కూడా పక్కా సమాచారంతో సోషల్‌ మీడియాలో తెలుగు నెటిజన్లు ప్రకటిస్తున్నారు. విశాఖపట్నం గాజువాక ప్రాంత కార్పొరేటర్‌ కాకి గోవింద రెడ్డికి ఈ నితీష్‌ కుమార్‌ రెడ్డి స్వయానా అన్న కొడుకని, అతని సెంచరీతో గాజువాకలో బంధువర్గం సంబరాలు చేసుకుంటున్నారని కూడా చెబుతున్నారు.

మొదట నితీష్‌ – రెడ్డి కాదు, బీసీ రెడ్డిక అని సోషల్‌ మీడియాలో గోల చేయడంపై ‘తుపాకీ’ అనే వెబ్‌సైట్‌లో వచ్చిన కథనం చదివాక ఈ కులం గోల అదే రెడ్డి– రెడ్డిక వివాదం గురించి నాకు తెలిసింది. ఎవరైనా వ్యక్తి అంతర్జాతీయ రంగంలో క్రీడలైనా, మరేదైనా రంగంలో ఏమైనా సాధిస్తే…… అతను భారతీయుడు అని తేలినాక అతను ఏ రాష్ట్రం వాడు? ఏ ప్రాంతం వాడు? ఏ కులపోడు అని సిటిజెన్లు, నెటిజెన్లు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలవారు అందునా కోస్తాంధ్ర, రాయలసీమ జనం కూపీ లాగడం ఇదేమీ కొత్త కాదు.


The Reddika caste is a Backward Class (BC-A) fishermen community in the north Andhra districts of Andhra Pradesh:

Identification: The Reddika caste is also known as Kepmare.

Gazette resolution: The Reddika caste is listed in the National Commission for Backward Classes’ Central List of OBCs under entry number 27 with the Gazette Resolution 12011/68/93-BCC(C) dt 10/09/1993


…. ఇదీ గూగుల్ ఎఐ ఇస్తున్న సమాచారం… ఐనా ఇలాంటి కూపీలు, వాకబులు, కుల పరిశోధనల వల్ల విశాల తెలుగు సభ్యసమాజానికి కొత్తగా జరిగే కీడు ఏమీ లేదని పాత అనుభవాలు చెబుతున్నాయి. ఒక్క బీబీసీ ఇంగ్లిష్‌ వెబ్‌సైట్‌లోనే నితీష్‌ కుమార్‌ రెడ్డి పూర్తి పేరు– కాకి నితీష్‌ కుమార్‌ రెడ్డి అని ఇవ్వడం గమనార్హం. ఎంతైనా వ్యక్తిగత వివరాలు సమగ్రంగా ఇవ్వడంలో ఇంగ్లీషోడి తర్వాతే ఎవరైనా!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions